అమ్మ, నాన్న, నాలుగేళ్లబ్బాయి -5

అబ్బాయి: ఏంటి నాన్న నేను పది రోజులు ఇంట్లో లేకపోతే నీకు బోర్ కొట్టిందా
నాన్న: అవును
అబ్బాయి: మామయ్య తిరిగి అమెరికా వెళ్లిపోయాడు, నే వచ్చేశాన్లే.
నాన్న: ఊ, ఏమిటి విశేషాలు?
అబ్బాయి : ఏమీ లేవు, నువ్వు చెప్పు.
నాన్న: మీ మామయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడా?
అబ్బాయి : అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు.
నాన్న: ???

                                 *******                        

అమ్మ: మీరు రాలేదని మా తమ్ముడు చెల్లెలు చాలా సార్లు అనుకున్నారండి.
నాన్న: అవునా
అబ్బాయి: నీకు అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు
అమ్మ:నువ్వూరుకోరా
నాన్న: వాడ్నంటావెందుకు,బడి మానిపించి మామయ్యతో తిప్పితే ఇవి కాక ఇంకేంనేర్చుకుంటాడు?

                                 *******                        

నాన్న: ఓరెయ్ ఇంకా పడుకో, రేపటి నుంచి బడికెళ్లాలి
అబ్బాయి: సరే
నాన్న: లాలనుచునూచేరు లలనలిరుగడలా..
అబ్బాయి: హబ్బా, నాకు లాలి అక్కర్లేదు నాన్నా, నేను పెద్దవాడినయ్యాను.
అమ్మ: చూశారా, మామయ్య దగ్గర ఉండి ఎంత డిప్లమసీ నేర్చుకున్నాడో, మీరు పాడితే వచ్చే నిద్ర కూడా పారిపోతుందని అనిచెప్పకుండా, నేను పెద్దవాణ్ణయ్యా, లాలి అక్కరలేదు అని చెప్పాడు.
నాన్న: ???

ప్రకటనలు

6 responses to “అమ్మ, నాన్న, నాలుగేళ్లబ్బాయి -5

  1. మా బావగారు చాలా కొంటె మనిషి. మా అక్కయ్య చాలా బాగా పాడుతుంది. కానీ ఆమె, కొడుక్కి నిద్ర పుచ్చడానికి లాలి పాట మొదలుపెడితే, పిల్లవాడు (మా అక్క కొడుక్కి అప్పుడపుడే పూర్తి గా వాక్యాలు పలికే వరకూ మాటలొస్తున్నాయి) – ‘అమ్మా! పాత ఆపు ! నిద్రపొతా !’ అనే లా తరిఫీదు ఇచ్చారు. మొదటి సారి వాడలా అనేసరికీ మా అక్కయ్య నిర్ధాంతపోయి.. ఒక అరగంట సేపు పడీ పడీ నవ్వింది. తరవాత తెలిసింది అది పిల్లాడి సొంత తెలివి కాదనీ, వాళ్ళ నాన్న నేర్పించారనీ ! అది గుర్తొచ్చింది.

  2. జ్యోతి గారు,
    కాస్త స్వానుభవం కాస్త ఊక. నా తరువాతి టపాకు మీరు ఇదే ప్రశ్న అడగకుందురుగాక.

  3. సుజాత గారు,
    నేను పాట పాడితే వచ్చే నిద్ర కూడా పోయే మాట నిజమే.
    ఫాన్ అట్టా తిరగకుండా ఇట్టా ఎందుకు తిరిగుతుంది, నువ్వు ఫాన్ ఎక్కి కూర్చో నేను స్విచ్ వేస్తా – ఏమౌతుందో చుద్దాం…
    ఇలాంటి వాటిని నిలువరించటానికి – ఓ పల్లవి పట్టుకొని అరిగిపోయిన రికార్డ్ లా అదే “చదువుతూ” ఉంటాను .. ఇంక ఎవరూ మాట్లాడరు – నిద్రపోయే టైం అయ్యింది అన్న భావన కలిగించటానికి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s