ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౮

 

మొన్న సాయంత్రం ఓ బ్లాగ్మిత్రుడితో మాట్లాడి, పనిలో పనిగా చాలా రోజులైందని మా రామలింగం ఇంటికి వెళ్ళాను, చెప్పాపెట్ట కుండా.

“ఏమిట్రా ఊడి పడ్డావ్” అన్నాడు

“ఉద్యోగం ఊడి పడ్డాను రా “అన్నాను

“పోన్లే పోతే పోయిందిలే” అన్నాడు రానారె అంత దిలాసా గా.

” పోయింది నాది కాకపోతే నేనూ అదే అనేవాడిని”

“ఇప్పుడేమిటంటావ్” 

“ఏదైనా ఉద్యోగం చూపించు”

” నేను ఏదో ఇంగ్లీషు పాఠాలు చెప్పుకుంటున్నవాడిని మీ ఉద్యోగాలసంగతి నాకేంతెలుసు” అన్నాడు “తెలీవని నాకుతెలుసులే కానీ పొరపాటున తెలిస్తే చెప్పు”అని.. ఈ మంతెన సత్యనారయణ గారి మాహా శిష్యుడి దగ్గర ఆ టైం లో కాఫీ నీళ్లు కూడా గిట్టుబాటుకావని లేచి వచ్చేశాను.

రాత్రి పెందరాడె పదకొండు గంటలకి ఇంటికి చేరి, స్నానపానాదులు ముగించి నిద్రపోవాలి కాబట్టి, టి.వి చూడకపోతే నిద్ర పట్టదేమో అని భయం తో టి.వి పెట్టి రిమోట్ కి పనిచెప్పాను అలా పాయలను తిప్పుతూ తిప్పుతూ, ఉవిదా టివి వద్ద ఆగాను – సులభాంగ్లమ్ అనే కార్యక్రమం మీద. ఓ ఐదు నిముషాలు చూసి ఉద్విగ్నత తట్టుకోలేక – మా రామలింగానికి పోన్ చేశాను

రా.లిం: ఓరె నీ ఉద్యోగం పోయిందని గుర్తు ఉంది,  వీలైతే ఉద్యోగం చూపించాలని గుర్తుంది, ఈ టైమ్ లో పెళ్లినవాడిని బాధించటం న్యాయం కాదురా, స్వాతిముత్యం లో కమల్ హాసన్ లాగా.

 నేను: ఆగాగు, నే ఫోన్ చేసింది నా ఉద్యోగం గురించి కాదు, నీ ఉద్యోగం పోవచ్చు అని చెప్పటానికి రా.లిం:ఎందుకుట

నేను: టి.వి లో సులభాంగ్లం అని ఓ కార్యక్రమం వస్తోంది

 రా.లిం:సులభాంగ్లమా సులభ్ కాంప్లెక్స్ ఆంగ్లమా?

నేను:ముందు శులభ్ నేర్పి తర్వాత కాంప్లెక్స్ నేర్పుతారేమో

రా.లిం:ఐతే ఏమిటిటా?

నేను: ఓరి అమాయకుడా, ఆకలిరాజ్యం లో కమల్ హసన్ అంత అందగాడు ముగ్గురు యాంకరమ్మలని కూర్చోబెట్టుకొని, టి.విలో ఉచితం గా ఆంగ్లం నేర్పుతుంటే ఇంక నీదగ్గరకొచ్చి డబ్బులు కట్టి ఎవడు నేర్చుకుంటాడు చెప్పు?

రా.లిం:ఇంగ్లీషా, ఏమి నేర్పుతున్నాడు ఏమిటి

నేను:చేంజ్ థ వాయిస్

రా.లిం: ఇందాకటి నుంచి “a object” “a object” అంటున్నాడ?

నేను:అవును

రా.లిం: సరే మరి, ఆయన యాంకరమ్మలు మాట్లాడే విషయాన్ని బట్టి గొంతు ఎట్టా మార్చుకోవాలో నేర్పూతూ ఉండి ఉంటాడు, ఇంగ్లిషు గ్రామర్ కాదులే .. నువ్వేమీ భయపడక

నేను:అంతే నంటావా?

రా.లిం: అంతే, స్పోకెన్ ఇంగ్లీషు నేర్పేవాడికి ఆంధ్రదేశం లో ఢోకా లేదు.

నేను:అంతే నంటావా?

రా.లిం: అంతే, కాదు కూడదు భయపడాల్సిందే అంటే, పగటి వేళ భయపడరా బాబు, ఇలా రిపీట్ టెలికాష్ట్ చూస్తూ భయపడమాక.ఇంక నువ్వు కూడా టివీ కట్టేసి పడుకో.

 వాడి మాట ప్రకారం టి.వి కట్టేసి, రిమోట్ ని టి.వి మీద పెడుతూంటే అక్కడ మా ఆవిడ వ్రాసి పెట్టిన చీటీ కనిపించింది. VCD పైన అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాను, టి.వి చూడడం ఐపోయిన తరువాత, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సంతకం చేయండి. ఇంగ్లీషు మార్కులు ఒక్కసారి చూడండి.

వాడి ఇంగ్లీషు మార్కుల మీద నాకు ఎటువంటి ఆశలు లేవు. ఎందుకంటే, వాడి ఇంగ్లీషు పరీక్ష రోజు, బడి దగ్గర దింపుతుంటే, ప్రిన్సుపాలిని ( అనగా నమ్రత కాదు) అరుపులు వినిపించాయి:

 What did I said?

 What did I said?

 I told you that you should woke up early morning at least in exam days naa…

సరే మాఆవిడ చెప్పింది కదా చూద్దమని ఫైల్ తీసుకున్న నాకు, ఆ బడి వారు ప్రత్యేకంగా ముద్రించిన ఫైలే చెప్పింది

fname

 అనవసరంగా ఇంగ్లీషు మార్కులు చూడకు అని.

12 responses to “ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౮

 1. బహుశా Father’s Name అంటే ఒకరికన్నా ఎక్కువ తండ్రులని (బహువచనం) అనుకునుంటారేమో 🙂

 2. ఇంజనీరింగ్ లో మా కెమిస్ట్రీ లెక్చరర్ మేము ఏ రూమ్ లో కూర్చోవాలో అడిగితే ఆయనిచ్చిన సమాధానం
  “Where u sitted yesterday sit there only” 🙂 🙂

 3. ఉద్యోగం ఊడి పడ్డాను – 🙂
  వికటకవి – సూపరు!

 4. మీ అబ్బాయికి ఇంగ్లీష్ మార్కులు బాగానే వచ్చుండాలే. పేపర్స్ దిద్దేవారికి వచ్చి ఏడవాలిగా మరి? వాళ్ళకే రాకుంటే ఇంక పేపర్స్ లో మనం జేమ్స్‌బాండ్ సినిమా కధ రాసినా మంచి మార్కులే వస్తాయి.

 5. నేను కూడా మంతెన వారి శిష్యుడనే, కానీ అప్పుడప్పుడూ బాదాం పాలు వంటివి దొరకక పోతే కాపీ తాగాల్సివస్తుంది!

  ప్రిన్సుపాలిని బాగుంది.
  Father name అంటే తప్పేంటండీ, తెలుగు వారు అనరూ తండ్రి పేరు అని. దానినే అచ్చటాంగ్లంలో పాదర్ నేమ్ అన్నారు!

 6. ప్రిన్సిపాల్ అనే పదానికి తిరుమల రామచంద్రగారి ‘హంపీనుంచి హరప్పాదాకా’లో ప్రాంశుపాలుడు అన్నారు. సంస్కృతం అనుకుంటా. దీనికి అర్థమేమిటో తెలుసుకోవాలనే ఆలోచనను ఎవరికైనా ఈ పేరు పెడితే ఎలా వుంటుందా అనే ఆలోచన మింగేసింది. 🙂

  ఉద్యోగం ఊడి పడ్డాను. – 🙂

 7. ఓహో దట్టా?
  ఐ థింక్ వాటో వాటు!

 8. హ హ హ..కేక..మాకు ఇంజనీరింగ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ ఒకాయన ఉండేవాడు..ఇంగ్లీష్ లో కిలోమీటర్ వీక్. ఒక సారి ఇటుక ని ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది ఆయనకి ఫ్లో లో గుర్తురాలేదనుకుంటా…suppose there are two ఇటుక్స్ అన్నాడు..పోన్లే అని క్షమించేసారు స్టుడెంట్స్..ఇంకోసారి if today is tomorrow, there is no tomorrow అన్నాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాకపోతే క్లాస్ లో ఒక డికోడర్ ఉండేవాడు..వాడు చెప్పాడు..”అరె, ఆయన ఉద్దేశ్యమేమంటే..రేపు కూడా ఈరోజు లాగే వర్షం పడితే రేపు క్లాస్ ఉండదు” అని..ఈ ముక్క లో ఇంత మీనింగ్ ఉందేటి అనుకుని, ఆయని వెళ్ళి అడిగాం “రేపు క్లాస్ ఉంటుందా” అని. “చెప్పాను కదండీ క్లాస్ లో నే. if today is tomorrow, there is no tomorrow అని. రేపు కూడా వర్షం పడిందంటే క్లాస్ ఉండదు”

 9. రాకేశ్వర రావు గారు, మీరు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నరుగా, మీరు ఏది సరి అంటే మాకూ ఇదే సరి.
  రవి చంద్ర గారు,
  మీ కళాశాల కోస్థా తీరం లో ఉందా
  mohanrazz గారు,
  ఇటుక్స్ బావుంది,
  ఇలానే వాకాడు లో చదివి ముంబై లో తేలిన మిత్రుడొకడు ఓ స్టేటస్ మీటింగ్ లో “I pumped the required data, but still no reply.” అన్నాడు
  రానారే గారు, ఆ పుస్తకం చాల రోజులని నుంచి చదవాలని, కాని ఇంతవరకు చూడనుకూడా లేదు.
  ఏమిటో ఈ మధ్య ఎవ్వరూ పుస్తకాలు అరువు ఇవ్వడం లేదు

 10. ha ah,

  Ilantivi maaku boledu, college rojullo.
  machuku konni vadhulthanu kasukondi.
  maa HOD bayata unna kurrallani choosi, class lo ki vachaka, ‘those who are talking to corridor, dont come class late’ idhi artham chesukovadaaniki maaku 4 yrs pattindi. inko maths lect’r (a/b) bhagham loni lavaani haraanni oke sankhyatho guninchandi ane dhaaniki chinna paati session theesukunnadu, adhee ENGG lo.. thanu multiply up by $%# and down by $%# ane vaadu. idhi chadivina vaaaru evariana madana palle MITS lo chadivi unte, inka konni raaastharani aasisthooo..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s