ఏళ్లు – మైలు రాళ్లు

త రెండేళ్ల లో హిందూ మతానికీ జరిగిన ఆవగింజంతా మేలైన ఉంటే, ఆ మేలు గురించి చెప్పుకోవటం జరిగితే వాటిలో భక్తి టి.వి తప్పక ఉండదగినది.
నిన్న రెండేళ్లు పూర్తి చేసుకున్న భక్తి టి.వి కి శుభాకాంక్షలు.

షా కిరణ్ మూవీస్ సంస్థకు పాతికేళ్లు.
శ్రీవారికి ప్రేమలేఖ. ప్రతిఘటన. మయూరి. కోట. శ్రీకాంత్.
ఉషా కిరణ్ మూవీస్ వారికి నా శుభాకాంక్షలు.

నెల లోనే 10వ తేదీన ఈనాడు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంది. తెలుగు చదవటం వచ్చి, ఈనాడు దినపత్రిక “అస్సలు” చదవని తెలుగువాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈనాడు వారికి శుభాభినందనలు. ఈ దినపత్రిక కొన్నివందల ఏండ్లు నడచు గాక.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా మొదటి సారి ప్రమాణస్వీకారం చేసినది సెప్టెంబర్ 1న. రేపటికి పుష్కరం పైన రెండు సంవత్సరాలు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారలను మెప్పించిన, ప్రధాని పదవి లో ఎవరు ఉండాలి అనే విషయం లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన, ఎక్కువకాలం ముఖ్య మంత్రిగా కొనసాగిన గుర్తింపు కలిగిన దశనుండి, హత్యాయత్నము, పదవీచ్యుతి, నిన్న మొన్న రాజకీయాలలోకి వచ్చిన వారితో శాసనసభలోనూ – వాంప్ కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ వంటి వారలతో బయటా మాటలనిపించుకొనే స్థితి -విధివిలాసమంటే ఇదేనేమో.
క, బ్లాగ్లోకం లో- గురుతుల్యులు, నిత్య యవ్వనులు శ్రీ చింతారామకృష్ణ గారి ఆంధ్రామృతం బ్లాగు ప్రధమ వార్షికోత్సవాన్ని దిగ్విజయం గా పూర్తిచేసుకుంది.

4 responses to “ఏళ్లు – మైలు రాళ్లు

 1. భక్తి టీవీ సంగతి అంతగా తెలియదుగానీ, మిగతావి అన్నీ కూడా అచ్ఛంగా నా మాటలే మీ మాటలుగా చెప్పినట్లుందండీ. అంతా మంచే జరగాలని ఆశిద్దాం.

 2. మీరు చెబుతున్నది NTV వాళ్ళ భక్తి టీవీ గురించేగదా! గరికపాటి నరసింహారావు గారి కావ్యప్రసంగాలు నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన కార్యక్రమం. ఎటొచ్చీ ఈ మధ్య మావాడి ఇంటర్మీడియెటు చదువు నిరాటంకంగా సాగాలని శాస్త్రోక్తంగా టీవీని బలి ఇచ్చిందగ్గర్నుంచీ, వాటికి దూరమయ్యాను.

 3. చదువరి గారు,
  అవునండీ ఆ భక్తీ టి.వి నే. అయ్యో మీరు గరికపాటి వారి పద్య వ్యాఖ్యలు వినటం లేదా?
  ఈ మధ్య వారు అభినయిస్తున్నారు కూడా..
  పద్యం లో నయనము అన్నమాట రాగానే కళ్ల దగ్గరకి చేయి తీసుకెళ్లటం, చెక్కిళ్ళు అనగానే – చెక్కిళ్ల పైకి చేయి తీసుకెళ్లటం ఇలా..

 4. 🙂 కాస్తో కూస్తో ముందునుంచీ ఉన్నదేలెండి.
  రాశేరె వరుణుడి కోపానికి బలైన సమయంలో మళ్ళీ పెట్టెను తెరిచానుగానీ చూట్టానికి కుదరడంలేదండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s