పొద్దుపోని యవ్వారం

పొద్దుపోని యవ్వారం అనబడు డూపు టపా

వాళ్లిద్దరూ కపులా?

అవును కపులే.

నీకెలా తెలుసు?

లేకపోతే అలా బండి మీద కూచొని కోతిచేష్టలెందుకు చేస్తారు.

నే అడిగింది ఆలూమగలా అని..
ఆడామగలైనందుకు సంతోషించాల్సిన కాలమిది.

….
మొత్తానికి హైదరాబాదు చూపించరా అంటె ఫ్రీజోన్ కి తీసుకొచ్చినట్టున్నావే

నువ్వే కదా సినిమా కి వెళదామటే కాదు సాగర్ చూస్తానన్నావ్


నువ్వుచెప్పలేదుగా – బుద్ధుడి ముందుగట్టు
వైపు లేక్ వ్యూ
వెనకగట్టు వైపు  లేకి వ్యూ అని

సరే ఇప్పుడైనా వెళ్ళి డి.వి.డి తెచ్చుకొని  చూద్దం పద

*****
బ్లూ సినిమా ఉందా అండీ

అబ్బే మా దగ్గర అట్టాంటివి ఉండవండీ.

???!!

9 responses to “పొద్దుపోని యవ్వారం

  1. బాగుందండీ మీ యవ్వారం. 🙂 లేకి వ్యూ ప్రయోగం అదరహ!

    మా ఇంకో తమ్ములుంగారు పాములపడగవారికి అప్పుడెప్పుడో చెప్పినట్టు

    సేద్యాతురాణాం నమాగాణి నమెట్టః
    అన్నాతురాణాం నవుడికి ర్నవుడకః
    యవ్వారతురాణాం నబెడిసిన్ నసాగః
    మర్కటాతురాణాం నకపి నకవిః
    ________________________
    ________________________

    (ఇలా మీకు నచ్చినవి ఆ సందుల్లో, అదేనండీ ఖాళీల్లో నింపుకోండి!) 🙂 🙂

    J V S

  2. అదిరెన్!
    “ఆలూమగలైనందుక్కాదు, ఆడామగలైనందుకు సంతోషించాల్సిన..” – ఇది మహాన్!

  3. absolutely fun.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాననుకోండి 🙂

  4. పింగుబ్యాకు: నా లుంగీ కాకపోతే « ఊక దంపుడు

Leave a reply to చదువరి స్పందనను రద్దుచేయి