అద్భుత అవకాశం

 

ఇలా మీ ఖరీదైన కారుని హై.మ.పా.సం చెత్తకుండి పక్క నిలుపుకోవటానికి, రెండుగంటలకి కేవలం పది రూపాయలే.
మీది ద్విచక్రవాహనమైతే కేవలం 5 రూపాయలే.
త్వరపడండి, అసలే ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉంది. మళ్లా,కొత్త సంవత్సరం కానుకగా, ప్రభుత్వం రుసుము పెంచే ప్రమాదం లేకపోలేదు.

[ఇక్కడ వాహనాలు నిలుపుకోనివ్వటం ద్వారా,  హై.మ.పా.సం  ఆర్జించే ఆదాయం సంవత్సరానికి 13 లక్షల పైమాట అని విశ్వసనీయ వర్గాల భోగట్టా.]

9 responses to “అద్భుత అవకాశం

 1. చెట్టులేని చోట ఆముదం చెట్టే మేలని ఊరకే అనలేదు పెద్దలు… చెత్తకుండీ పక్కన పార్కింగ్ ఉందా?? పార్కింగ్ ఏరియాలో చెత్తకుండీ పెట్టారా? ఇది చెప్పుకోండి చూద్దాం..
  మీరు భలే పుటోలు పట్టుకొస్తారండి…

 2. వ్యాపారంలో అదృష్టం కలసిరావట్లేదా
  వ్యవసాయంలో అధిక దిగుబడి కోరుకుంటున్నారా
  ఉద్యోగంలో ఉన్నత పదవులు కావాలా
  పిల్లల చదువులూ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం అభివృద్ధి పొందాలా
  మీ ప్రభుత్వం చేతగానిదా, మీ నాయకులు ఒట్టి దానవులా
  మీ తోటి నాగరికులు సంస్కారము లేనివారా
  నిత్యమూ నిత్యవసరాల ధరలు పెరుగుచున్నాయా
  జీవితంలో సమస్యలతో సతమతమవుతున్నారా
  అయితే వేంటనే తరలిరండి.
  భూటాన్

 3. మా కుకట్‌పల్లి అందాల్ని భలే పట్టేసారుగా!

 4. chaala baagundandi, intaku chudaalsina vaallu chustarantaara?

 5. chaala bagundandi.

  intakee pilli meda lo ganta kattedevaranta?

  chudaalsina vallaku kallu teruchukonedepudu naarayanaaaa?

 6. రాకేశా, భూటాన్‌ సమాచార సంస్థలో ఉద్యోగమెప్పట్నించీ? అందుకే ‘ఆ, ఊ’ అర్థం కావట్లేదు!
  ఊకదంపుడు గారూ, ఆహూ, ఊహూ! 🙂

 7. చెత్తకుండీ పక్కన అయినా పర్లేదు, పార్కింగ్ దొరికితే అంతే చాలండీ!

  వరూధిని గారూ, కూకట్ పల్లి అందాలు..:-)!

  రాకేశ్వర…
  భూటాన్ లో ఇళ్ళ స్థలాల రేట్లు ఎలా వున్నాయి?

 8. సుజాత గారు..ఆ ఫోటో ఆంధ్రప్రదేశ్ లో ఘనత వహించిన KPHB colony ఎదురుగానండి! స్వాగత్ ఫంక్షను హాలు దగ్గర…ఓహ్.. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గంలేండి!!

 9. ఒక్క కూకట్ పల్లి లోనే ఏం ఖర్మ! ఏ ప్రాంతంలోనైనా ఇలాంటి దృశ్యాలు కోకొల్లలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s