అమ్మ,నాన్న, ఓ ర్యాంకులొచ్చేఅబ్బాయి

 అమ్మ :  ఏమండి, ఎలాగూ ఇక్కడదాకా వచ్చాంగా , అవస్థలపురం లో మా పెద్దమ్మ కూతురుంది వెళ్దామండి.

నాన్న:  వద్దు, ఇంటి దగ్గఱ పిల్లాడు ఒక్కడే ఉన్నాడు, వెళ్దాం.

 అమ్మ :  మళ్లీ ఇక్కడ దాకా ఎప్పుడొస్తామో ఏమో, ఎక్కువసేపు వద్దు , రెండే నిమిషాలూ కూర్చొనివెళ్దామండి.

నాన్న:  వాడు ఒక్కడే ఉంటే టి.వీ చూస్తూ కూచుంటాడు,నా మాట విని ఇంటికి వెళ్దాం పద.

అమ్మ:  చదువుకుంటాని అని చెప్పాడండి, ఐనా టి.వి లాక్ చేసి వచ్చాను,  న్యూస్ ఛానల్స్ తప్ప ఏవీ రావు.

నాన్న: పిచ్చిదాన, అవి చాలవూ?!

12 responses to “అమ్మ,నాన్న, ఓ ర్యాంకులొచ్చేఅబ్బాయి

 1. హ.హ…హ.. మీవాడు చిన్నాడే. నేనైతే పిల్లలను న్యూస్ చానెల్స్ చూడనివ్వటంలేదు. నేనూ చూడటంలేదు. నవరసాలు భీబత్సంగా చూపించేస్తున్నారు. ఇక మిగిలినవి Discovery, Geographic, Animal Planet..

 2. అవస్థలపురం.. మా వనస్థలి పురం 😉

 3. 🙂 మంచి టేకు!

  వార్తా చానెళ్ళు – మామూలు వేళల్లో అవి మాదకరం -బూతులు కూస్తాయి, మత్తు కలిగిస్తాయి. రాత్రి 11 తరవాత అవి ప్రమాదకరం. బూతు చూపిస్తాయి.

  పగలంతా చెప్పేది నీతులు, రాత్రులు..

  • చదువరి గారూ,
   మీ ఉద్యోగస్తులవ్వటం వల్లనో, అమాయకులవ్వటం వల్లనో అవి రాత్రి 11 తర్వాతే ప్రమాదకరం అనుకుంటున్నారు.
   కానీ,

   రాత్రి 11 గంతల తరువాత వేసేవి, మర్రోజు మధ్యానం నిద్ర సమయానికి కూడ వేస్తారు.
   ప్రతి చానెలూ – వాళ్ల నేరార్ధగంటని – పొద్దున తిరిగి సమాజం మీదకి వదులుతాయి.
   సాక్షత్తూ ఆంగ్లపుచానెలే, “రాత్రి జాగారం” అనే వాళ్ల కార్యక్రమాన్ని మధ్యానం పూట మళ్లీ విడుస్తుంది.

   ప్రత్యేకంగా ఒక గంట నేరాలను, ఒక గంట హీరోయిన్ శరీరీళ్లను, మరో గంట వెబ్ లో ఉచితంగా దొరికే వీడియోలను, ఒక గంట ఏ నగలషాపులో ఏ నగలున్నాయో చూపించే వాటికి “వార్తా ఛానెళ్లు” అని పేరు.
   నెహ్రూ గారి ముని మనవడు శ్మశానం పక్క పూటకూళ్లలో సాంబార్ నలుచుకొనో, కారప్పొడి నలుచుకొనో ఇడ్లీ తింటే – “పగులు కబురు”.
   కాగా ..
   పొరబాటున ఏదన్నా సినెమా లో ఎవరన్నా ముద్దెట్టుకుంటే .. అసలు అది ఎట్టా పుట్టింది దగ్గర మొదలుబెడతారు.
   ఎవడన్నా వాన పాట తీస్తే, రాజ్ కపూర్, నర్గీస్ నుంచి మొదలుబెడతారు
   ఇక ఎవతైనా బికిని వేస్తే … ఆ వార్త ఛానల్ లో చూశి – ఒక పరిశోధనా గ్రంధం సమర్పించవచ్చు..

   మీరు చెప్పిన ప్రమాదకర సమయాలు – “మామూలు” విషయాలవి.. అదే ఒక మంత్రాలయానికో ఒక అంతఃపురానికో అంటుకొని ఉంటే …సర్వకాల సర్వావస్థల్లోనూ అదే ….

   ఈ మధ్య దయ్యాలమీద సిన్మాలు తీయటమే వృత్తిగా పెట్టుకున్న ఒకాయన సినిమా తీస్తే – చెప్పాపెట్టకుండ, భయపెట్టకుండ – ఆయనతో ఇంటర్వ్యూ బెట్టి – ఆ దృశ్యాలు మధ్యానం పూట వేసారు.

   ఇంకా సర్టిఫికెట్ రాని సినిమాల ప్రకటనలు గుప్పిస్తారు – ఓ మూల చిన్న అక్షరాల హెచ్చరికతో

   మోహన్ సింగు గారు నా మాట ఎవరూ వినటం లేదు – వీళ్లమీదన్నా నాప్రతాపం చూపిస్తాను అని — సెన్సారు చేస్తాము అని సమావేశాని పిలిస్తే – మా సెన్సారు మేము చేసుకుంటాం అని తప్పించుకున్నారు

 4. బాగుంది మీ న్యూస్ జోక్. మరి దారుణంగా తయారయ్యాయి. రాత్రి 9.30 కే TV 5 లో నగ్నామృతం పేరుతొ బూతే బూతు. చిన్న పిల్లలు చుస్తారన్న ఇంగిత జ్ఞానం కుడా లేదు వీళ్ళకి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s