విరోధి వత్సర మకర సంక్రాంతి

ఆ.  ఉత్తరాయణమున ఉత్తచేతులనేడు

       మొక్కుచుంటి మున్ను మోతుబరిని.

      పూటగడచు వీలు మాటకైననులేక

      దిగులు ముద్ద మింగి దిరుగు చుంటి  (1)

ఆ. అక్కచెల్లికినయి అమ్ముకొంటిని కొంత

    సొంత సంతు గూర్చి కొంత యమ్మి

    ఉండి గూడ లేక ఒక్కచెక్కనుకల్గి

     మిగిలితినిటులయ్యె మిగుల బండి. (2)

ఆ. కఱవు తప్పె ననియె కాస్త కుదుటపడ

     వరద వచ్చి పంట వమ్ము చేసె

     కుమిలి- వేచి యుంటి – కొడుకుపిలుపుగాదు

     కలుగ ముక్తి, పెద్ద పిలుపు కొఱకు (3)

ఆ. లోకబంధు వీవు రోదసి నందున

    లోకబంధు రైతు లోకులెదుటె

    ఏటి కొక్క రోజు ఎంచుచుందురునిన్ను

    మాకు నెపుడులేదు మన్న నింత  (4)

ఆ. నాదు దిగులు లేదు నాకునిపుడు గాని

     కలదు బాధ కర్షకాళి గూర్చి

    రైతు కేమిగలుగొ రాబోవు దినములా

    చూడ నేమి గలుగొ సూర్య నీకు!   (5)

————————————————————————–

 

బాదరాయణ లంకెలు:
మునుపొకమారు
భైరవభట్ల వారి బ్లాగులో ఇప్పుడు ,మునుపు .

 

8 responses to “విరోధి వత్సర మకర సంక్రాంతి

 1. పద్యాలు చదవడానికి బాగున్నా కొద్దిగ నిరాశాజనకంగా ధ్వనిస్తున్నాయి, మీ ఉద్దేశ్యమే అదా లేక నాకే అలా అనిపిస్తున్నాయా?

 2. మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు

 3. బాధనోర్వ లేక బ్రతుకు భారమవగఁ
  కష్టకాలము కడు నష్టమవగఁ
  భూమియందు సుఖము భూటనునేయుండు
  వూరు విడచి వెళ్లు వూకదంప
  😀

 4. నేను బొమ్మని చూపిస్తే మీరు బొరుసుని చూపించారు! కాకపోతే, బిళ్ళలోని ఏదో సాంకేతికలోపం వల్ల ఈ మధ్యనెక్కువగా బొరుసేపడుతోంది 😦 అది మనం రోజూ పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాం కదా పండగరోజైనా ఆ కనిపించని బొమ్మని గుర్తుచేసుందామనే తాపత్రయం నాది.

 5. ” రైతు కేమిగలుగొ రాబోవు దినములా” ఇలా మా తాతయ్య ౧౦ ఏళ్ళ కిందే అనేవారు. ఇప్పుడు మరీ దారుణం ఐపోయింది.

  నేటి రైతు ఆత్మ వ్యథని ఆవిష్కరించారు. పద్యం బావుంది. (రైతు) పరిస్తితి బాధపెట్టింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s