ఇంగ్లీషూ యు లివ్ లాంగా- ౯

ఇవాళ అనుకోకుండా అమీరుపేట వెళ్లవలసివచ్చింది.
సరే ఎలాగువెళ్లా కదా అని అక్కడ ఒక ప్రసిద్ధమైన హోటల్ లో మంచి కాఫీ తాగుదామని మెట్లు ఎక్కబోతుంటే పరిచయమైన గొంతు వినిపించింది.
తల తిప్పి చూస్తే మా రామలింగడు కాలిబాటపై పోస్టర్లు అమ్మేవాడితో బేరమాడుతున్నాడు.
వాడికో నాకో ఇవాళ ఉచిత కాఫీ రాసి పెట్టి ఉన్నదని అర్ధమై.. వాడి దగ్గరకి వెళ్లి …
కాలేజి రోజుల్లో వీడి గది లో ఓవైపు మధుబాల, ఓవైపు సబాటిని, ఇద్దరి మధ్య లో కాసిని ధనాత్మక సందేశాలు, కాసిని ప్రేరణ సందేశాలు ఉండటం గుర్తొచ్చి,
“ఏరా ఈ పోస్టర్ల పిచ్చి ఇంకా పోలేదా” అన్నాను.
“నువ్వా, అంత తేలిగ్గా ఎలా పోతుంది” చెప్పు అన్నాడు తల తిప్పి.

అవుననుకో ఇంత దూరం వచ్చి మరీ కొనాలంటవా?
షాపింగ్ కని వచ్చాం. మా అవిడా,మరదలూ పక్క చీరెల కొట్లో ఉన్నారు, కాలాన్ని సద్వినియోగం చేసుకుందామని నేనిలా…
అయిందా? ఇంక తీసుకోవలిసినవి ఉన్నాయా?
అవుతోంది, ఎన్ని పోస్టర్లు కొన్నా, తన కోసం ఒక్కటి కూడా ఇంత వరకు తీసుకోలేదని మా ఆవిడ ఈ మధ్య మెత్తగా గుర్తు చేసింది, అందుకని…
ఇది చూడు – అప్పటికే తీసుకోవటానికి నిర్ణయం చేసుకున్న ఒక పోస్టరు నా చేతిలో పెట్టి మళ్లీ వెతికే పని లో పడ్డాడు.
దాని మీద ఇలా వ్రాసి ఉంది:
The female of the species is more deadlier … ”

ఆడాళ్లతో చచ్చేచావని ఎంత చక్కగా చెప్పాడు, నాక్కూడా ఒకటి తీసుకో ఇది. అవసరానికి పనికొస్తుంది.

7 responses to “ఇంగ్లీషూ యు లివ్ లాంగా- ౯

  1. ఏడ్చినట్టుంది…….అహహా…..మీ టపా కాదు, ముందా కత్తి దించండి ……ఏడ్చినట్టుంది ఆ కొటేషను .

  2. డబుల్ స్ట్రెస్సన్నమాట .. అందుకేకాబోలు డబుల్ కంపేరెటివ్ ఉపయోగించాడు. 🙂

  3. more deadlier. ఆహా అంటే ఎక్కువ చస్తారనో ఏమో…

  4. కొత్తపాళీ గారు, లలిత గారు, రాకేశ్వర రావు గారు,
    “The female of the species is more deadlier than the male”
    ఇది పూర్తి పాఠం.
    “deadly” అని ఉన్నా నా బుద్ధికి కొత్త అర్ధమేమి తోచదనుకోండి ….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s