దత్తపది – ౧

రాబోయే సీతాకళ్యాణానికి, ఎలాగు మీరు పద్యాలు వ్రాస్తారు కాబట్టి, ఈ లోపు

మిల్క్( milk),
బటర్ ( butter),
జాం ( jam),
శాండ్ విచ్( Sandwich)

పదాలతో –
బాలకాండ – శివధనుర్భంగం ముందువరకు, ఏదైనా అంశంపైన – మీకు తోచిన వృత్తం లో
పద్యం కావాలి.

24 responses to “దత్తపది – ౧

 1. బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడవికి తోడ్కొని వెళ్ళినపుడు, ఓ ఉదయం, మునులు రాముణ్ణి నిదుర లేవమని ప్రార్థిసున్నారు.

  వేదవేద్య వినుత! వేకువ జామాయె
  జగముల గావుమో, జలజ నయన!
  సార జగత్త్రాణ శాండ,విచ్చుమునయ
  నమ్ములు దైవకార్యమ్ము నెఱుప!
  శుభకర! వనమున సుఖముగ అత్తమి
  లు కు
  మార నీ కనులు తెరువుమయ!
  ప్రాగ్రవి మిన్నుదారిఁ బట్ట రయమునన్
  కౌసల్యా సుత! జూపు కౌశలమ్ము!

  మంగళాకార! గూర్చుమో మంగళములు!
  అనఘ! అనవద్యాంగుడ! బాపు మాపదలను!
  శూర! దైత్యులఁ బరిమార్చి శుభము గూర్చి,
  రామ! మఖము నెఱుప మాకు రక్ష నిమ్మా!

  తప్పులుంటే సరిదిద్దగలరు.

 2. మూడవపాదం పొరబాటు సవరించాను.

  వేదవేద్య వినుత! వేకువ జామాయె
  జగముల గావుమో, జలజ నయన!
  సార సకల జగత్త్రాణ శాండ,విచ్చు
  ముఁ గనులు దినకార్యములను నెఱుప!
  శుభకర! వనమున సుఖముగ అత్తమి
  లు కుమార నీ కనులు తెరువుమయ!
  ప్రాగ్రవి మిన్నుదారిఁ బట్ట రయమునన్
  కౌసల్యా సుత! జూపు కౌశలమ్ము!

  మంగళాకార! గూర్చుమో మంగళములు!
  అనఘ! అనవద్యాంగుడ! బాపు మాపదలను!
  శూర! దైత్యులఁ బరిమార్చి శుభము గూర్చి,
  రామ! మఖము నెఱుప మాకు రక్ష నిమ్మా!

  శాండ అంటే అర్థమక్కడ.

  అత్తమిలు = నిదురించు

 3. రవి గారూ, ధన్యవాదములండీ, పద్యం బాగుంది,
  “విచ్చుము గనులు” గురించి రాకేశ్వరుడి లాంటి వైయాకరణులెవరన్నా చెప్పాలి.
  – పై పాదం లో జలజ నయన అని అన్నారు కాబట్టి నాకు బాగానే అనిపించింది.
  మీరు సవరించిన పాదం లో యతి సరిపోయిందంటారా.

  నేను వృత్తమడిగాను, మీరు సీసమిచ్చారు, ఐతే నేం, కడుపు నిండింది. ఎత్తుగీతి ఎంత చక్కగ వుందో.

  చివర “మా” కు దీర్ఘం అచ్చుతప్పు.

  మంచి పద్యాన్నిఇచ్చి నందుకు మరొక్కసారి ధన్యవాదములు.

 4. ధన్యవాదాలండి. సీసం ప్రయత్నించిన తర్వాత వృత్తం అని చూశాను. వృత్తం అంటే కాస్త బెదురండి. మొదలు పెట్టేప్పుడు ఆసక్తిగా ఉన్నా, చివరికి ఏదోలా వస్తోంది.

  మొదటి వ్యాఖ్యలో పద్యమే కరెక్టు. రెండవ పద్యం తప్పు.

  రాకేశ్వరులు “విచ్చుము” గురించి విచ్చి చెప్పాలి.

 5. ఊ.దం గారూ ! ఎంత ప్రయత్నం చేసినా శాండ్విచ్ తో ఏ పాదమూ తోచటం లేదు.. అయినా అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టటం భావ్యం గా లేదు.

  రవిగారూ! మీ ప్రయత్నం ముదావహం.

 6. సనత్ కుమార్ గారూ, సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా దత్తపది ఇచ్చినందుకు మన్నించండి. ఈ సారి నుంచి మరింత జాగ్రత్త వహిస్తాను

 7. ఊ.దం. గారూ !!

  శ్రీరామనవమి శుభాకాంక్షలు!

  విశ్వామిత్రుల వారు యాగ సం రక్షణార్థం రామ లక్ష్మణులను పంపమని కోరినప్పుడు ధర్మ సంకట స్థితినెదుర్కున్న దశరథుడి మనసులోని భావన…

  గుడ్వర్డ్ మిల్కులు త్రాగు బాలకులనే కోరంగ నెట్లోర్చెదో?
  మిడ్వే లేదొ? అజాం డమందు ప్రథమమ్మీ సంటమ్మిందు నే
  శాండ్విచ్చౌదునొ? మోహ ధర్మముల కే సారమ్ము జూపింతునో?
  గుడ్విల్ల్ ఉద్భట రాగ మోహములనే గూల్చెన్ గదా, తాపసీ !

  గుడ్విల్ గెశ్చరు గా ముందస్తుగా మాట ఇచ్చేసి ఆ తర్వాత పసి పిల్లవాణ్ణి పంపాలా? మధ్యే మార్గం (మిడ్ వే) లేదా? నేను చతురంగ బలసమేతుడనై రానా.. ఇత్యాది ప్రశ్నలతో మమకారం అడ్డు రాగా ధర్మమా ? మోహమా ? దేనికి బధ్ధుడవ్వాలి? సంకోచించాడు దశరథుడు. ఆలోచించి (ఇష్టం లేకపోయినా, కష్టమైనా) ధర్మానికే మొగ్గాడు. దానినే మరలా అరణ్యవాసానికి పంపాల్సి వచ్చినప్పుడు కూదా చొప్పాడు. యద్యదాచరతి శ్రేష్ఠః కదా.. దాన్ననుసరించే రాముడు కూడా ధర్మానికే కొమ్ముకాశాడు యుధ్ధ కాండలోనైనా, ఉత్తర కాండలోనైనా… అని నా భావన…

  సాధ్యాసాధ్యాల విషయానికొస్తే ఎంతైనా ‘విశ్వామిత్రుల ‘ సృష్టి కదా మాబోటి వాళ్ళకి కొంచం కష్టమే …

  తెలుగు పదాలు గా వాడటానికి శతధా ప్రయత్నించి వీలు గాక ఇక తెంగ్లీషునాశ్రయించా… కనీసం ఓ ముప్ఫైయ్యైదు వేసి పాస్ చేసేద్దురూ… ప్లీజ్ ..

 8. గుడ్వర్డ్ మిల్కులు త్రాగు బాలకులనే కోరంగ నెట్లోర్చెదో?

  మిడ్వే లేదొ- అజాండ మందు? ప్రథమమ్మీ సంకటమ్మిందు నే

  శాండ్విచ్చౌదునొ? మోహ ధర్మముల కే సారమ్ము జూపింతునో?

  గుడ్విల్ల్ ఉద్భట రాగ మోహములనే గూల్చెన్ గదా, తాపసీ !

  ఉద్భటము adj. Great, exceeding. హెచ్చు అయిన.

 9. సనత్ కుమార్ గారూ,
  ఊ.దం.గారి మాటేమిటోగాని నేను ఐతే మటుకు మీకు అరవై మార్కులు ఇచ్చేస్తాను.

 10. సనత్ కుమార్ గారూ, పద్యం బాగుందండీ.
  మనలో మన మాట, మురళీ గారు అరవై అన్నారంటే .. మనం డిష్టింక్షన్ అని చెప్పుకోవాలి.

  మీరు చెప్పినట్టు, త్రిశంకులోకపు భాషా సంకరపు అలోచనలుచేస్తూ “సాండ్విచ్” పదాలలో ఒదిగిపోతుందనుకున్నాను.
  వీలైతే రెండో దత్తపది రెండు మూడు రోజుల్లలో ప్రకటిస్తాను.

 11. అవుట్ ఆఫ్ సిలబస్ లో ప్రశ్న వచ్చినప్పుడు అందులో 60 మార్కులు తెచ్చుకోవడం పెద్దవిషయమే!

  అయితే సాండ్విచ్ వదిలేసి, మిగిలిన వాటితో తెలుగు రాముణ్ణి చూపించి ఉంటే ప్రాణానికి కాస్త సుఖంగా ఉండేదేమోనండి.

 12. రవి గారు, సనత్ గారు, మంచి ప్రయత్నాలు

  సనత్ గారు, శాండ్విచ్ వల్ల మీ పద్యంలో ప్రాస దెబ్బతిన్నదండీ…

 13. రవి గారూ!, ఊ.దం గారూ! గిరి గారూ ! మురళీ గారూ! నెనర్లు…

  రవీ, మా దశరథుడు ఈ కాలం వాడన్న మాట. మాట మాట కీ మధ్యలో ఇంగ్లీషు పదాలు లేక పోతే ముద్ద మింగుడు పడని రకం అనుకోండి… (సాండ్విచ్చ్ ఒక్కటే ఇంగ్లీసు లో పెట్టి మిగిలినవి తెలుగులో పెడితే ఎబ్బెట్టు గా ఉంటుందేమో మొత్తం పద్యమే తెంగ్లీషు లో రాసేద్దాం అని అనుకున్నా..

  మీ ప్రాణానికి మందు రాఘవ గారో, కామేశ్వర రావు గారో, ఊ.దం. గారో, లేకపోతే పెరటి చెట్టైనా మీకు మీరో వేస్కోవాల్సిందే.. నాలాంటి వాడి వల్ల గాదు సుమీ… మనదంతా కాంపౌండరు వైద్యం…

  అప్పటికీ ‘జాం’ నీ ‘బటర్ ‘ నీ ఆంధ్రీకరణ లోనే తీసుకున్నా…
  మిగిలినా ఒక్కటీ తెలుగులో రాద్దాం అనుకున్నా మిల్క్ కి మేల్కొలుపు ఇత్యాది వి రాయచ్చో లేదో తెలీదు. నాకా పర్యాయపదాల్లో, వ్యుత్పత్తులలో పరిజ్ఞానం కొంచం తక్కువ. అందుకే నా పద్యాల్లో ధారల్లంటివి అస్సలు కనబడవు (వస్తే కదా కనబడ్డానికి ఎందుకంటే నే కూడబలుక్కుంటా… అందుకే నిర్మొహమాటం గా చెప్పెసా అత్తెసరి వచ్చేస్తే చాలు అని).

  నిజానికి అస్సలు రాయలేనేమో కూడా అని అనుకున్నా.. ఊ.దం గారు శాండ్విచ్ మీకు నచ్చకపోతే అది వదిలేసి మిగతా వాటితో ప్రయత్నించండి, మీరాముడు వద్దంటాడా! అని అనడం తో రామ నవమి నాడు ఆఖరు నిముషం లో ఎదో ప్రయత్నం చేసేసి అయ్యిందనిపించుకున్నా.. అసలే రాబోయే సీతాకళ్యాణానికి, ఎలాగు మీరు పద్యాలు వ్రాస్తారు కాబట్టి అని అన్నారు, కనీసం ఇల్లాగైనా ఒకటి రాద్దాం అని చేసిన ప్రయత్నం (మా రాముడు నాకు పెట్టిన వడపప్పు కొంచం ఆంద్రా టేస్టు గాకుండా ఇంగ్లీషు టైపు ఉంది ఈ సారికి మరి.. )

  గిరి గారూ! ప్రాస దెబ్బతిందా?? ఎట్లా?
  డ్వ, డ్వే, డ్వి, డ్వి ప్రాస సరిపోయింది కదా??

  ‘శాం’ ఒకటే అక్షరం కాదా? శాన్డ్విచ్చ్ అని అందుకే రాయలేదు

  నేనేమైనా మిస్సౌతున్నానా?

 14. సనత్ గారు,
  ప్రాస నియమం ఉన్న పద్యాల్లో ఒక పాదంలో ప్రాసాక్షరానికి పూర్వము పూర్ణానుస్వారము ఉంటే మిగతా పాదాల్లో కూడా ఉండవలసిందే. ఉదాహరణకి “తొండము నేక దంతము” పద్యము చూడండి.
  మీకు వీలైతే సులక్షణసారము ప్రతిని కొనుక్కోండి. ఛందస్సుపై మీకు మంచి అవగాహన ఉంది కనుక పైమెట్టులెక్కడానికి ఉపయోగపడుతుంది.
  గిరి

 15. గిరి గారూ! నాకు తెలీని విషయాన్ని దెల్పి మార్గ దర్శనం చేశారు, ధన్యవాదాలు.

 16. సులక్షణసారము ప్రతి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పి పుణ్యం గట్టుకోండి… బాబ్బాబు…

  సనత్ కుమార్

 17. విశాలాంధ్రలో దొరుకుతుంది ప్రయత్నించండి

  • సనత్ గారూ, అక్కడిదాకా వెల్తే పద్యకవితా పరిచయమూ పద్యారామమూ కూడా చేతబట్టుకోండి, రెండూ ఆచార్య బేతవోలు వారివే.
   పద్యకవితాపరిచయం దొరుకుతుందో లేదో చెప్పలేను. పద్యారామం ఆధునిక పద్య కవుల పుస్తకాలపై ఆచార్య బేతవోలు వారి సమీక్షలు.

 18. తప్పకుండా…

  ధన్యవాదాలు..
  -సనత్ కుమార్

 19. మీ దయవల్ల నేనూ మార్గదర్శి లో చెరాను. ఒక మోపెడ్ కొనుక్కున్నా అన్నట్టు గా హైదరాబాదు ఆబిడ్స్ ప్రాంతానికి వెల్లి విశాలాంధ్ర వారి భాండాగారం లో అమూల్యమైన పొత్తాన్ని సంపాయించుకొచ్చా… (అంతకముందే అంతర్జాలంలో డౌన్లోడు చేసుకున్నా కానీ దాన్లో భీమనచందం, అనంతుని చందం అంటే ఏమిటో అర్ధం కాలె) సరె పుస్తకమంటూ ఉంటే దాన్లో నోత్సు కూడా రాస్కోవచ్చు కదా అని ప్రాప్తి స్థానం గురించి అడిగా.

  అయితే మీరన్నట్టు గానే పద్యకవితా పరిచయమూ పద్యారామమూ దొరకలే.

  ఇక్కడింకో విన్నపం.
  ఇంతకముందు మెయిల్సులో అడిగా కానీ వ్యాఖ్య లో మళ్ళే అడుగుతున్నా…
  ఆమరకోశాన్ని ఎట్టా చదువుకోవాలి? ఒకట్రెండు చోట్ల రాఘవ గారు & రవిగారు ఉటంకించటం చూసి అదేదో చదవాలి అనుకున్నా కానీ నాకదసలు తలా తోకా తెలియట్లే.

 20. సనత్ గారూ, సులక్షణ సారం విశాలాంధ్రలో దొరికిందా మీకు? నాకు పుస్తకం డీటయిల్స్ చెప్పండి కాస్త. మా అనంతపురం విశాలాంధ్రలో ప్రయత్నిస్తాను. (నేను దాదాపు ప్రతి వారాంతం మా వూరికి వెళతాను).

  పద్యకవితాపరిచయం నా వద్ద ఒక కాపీ ఉంది. అజోవిభో వారి వెబ్ సైటు చూడండి. దొరుకుతుందేమో..

  అమరం వల్లె వేయటం మినహా గత్యంతరం లేదండి. పుస్తకం.నెట్ లో మీ ప్రశ్ననే నేను తాడేపల్లివారిని అడిగితే, ఆయన ఖచ్చితంగా చెప్పేశారు, వల్లె వేయమని. అయితే, నాకు మాత్రం ఎంతప్రయత్నించినా వయసూ, మెదడూ సహకరించట్లేదు. అందుకని, పుస్తకం చివర, అమరం పదాలన్నిటినీ అనుక్రమణికగా ఇచ్చిన ఒక ప్రతిని ఎలానో సంపాదించి, ఆ అనుక్రమణిక రెఫర్ చేస్తూ కొద్దికొద్దిగా నేర్చుకుంటున్నాను. (ఈ రకమైన దొరకడం కాస్త కష్టం. నాకు పాత పుస్తకాల షాపులో దొరికింది)

 21. లింగమగుంట తిమ్మకవి కృత “సులక్షణ సారము”
  వ్యాఖ్యాత: జొన్నలగడ్డ మృత్యుంజయరావు
  రోహిణీ పబ్లికేషన్సు (రాజమండ్రి)
  వెల 45 రూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s