పన్ తరంగాలు – ౪

 • ఇపుడవి ఖూనివర్సిటీలు.
 • కోర్ కమిటీ పూర్తి పేరు దగాకోరు కమిటీ.
 • (చాలా మంది) మగవారు పెళ్లికి ముందు నిత్యానందులు, పెళ్లి తరువాత కేవలం రత్యానందులు.

( ఈ పన్నునే త.నా, కర్ణాట లలో వేరే విధం గా చెప్పుకుంటున్నారుట, మీ ఇష్టం మీది)

 • ఇప్పటికీ చాలా మంది ఆడవారికి కొంప కొల్లేరు, బెడ్రూము పులికాట్.
 • గుఱ్ఱపు పందేలు ఆడేవాళ్లు ఎక్కువగా పాడుకునే పాట : ఆరేసుకేబోయి పారేసుకున్నాను హరీ, హరీ.

6 responses to “పన్ తరంగాలు – ౪

 1. బాగా పేలాయి.

 2. ప’నిలే’ని ‘ఈ”నా’డు కాల’మిష్టు’లాగా ఎన్నాళ్లున్నా ఈ ము’ధ-న’ష్ట-పు ‘పన్ను’లేనా?

  అంటే నా ఉద్ధేశం పన్నులనేవి అధమజాతి అలంకారాలు అందుకే కాళిదాసు వాటిని వాడలేదఁట। మీకు ఇంతకంటే చాలా ఎక్కువే చేతనయినప్పుడు, వేఱే భాషకూ ఈ భాషకూ ఇంకా వేఱే భాషకూ ఏవో రెండు మూడు అక్కరాలు కలినంత వాటితో ఆటలాడడం, పత్రికలలో ఎక్కువే జరుగుతుందిగా। భావి తెలుఁగు వైభవం నిలబెట్టవలసిన వారు మీరు ఇక్కడ ఇఱక్కుపోతే ఎలాగ?

  ప్రాసా పన్ను వాడితే మీ బందు టపాలా వుండాలి గాని, వాడిపేరేంటి, మన్మథుడు సినిమా అనుకుంట తీసాడు। త్రివిక్రమ్ వాడిసినిమాలోలా కేవలం ‘పన్ను’లతో ‘పబ్”బం’ గడుపుకుందామనుకుంటే ఎట్లా?

 3. రాకేశ్వరరావు గారూ,
  పన్నులపట్ల మీకున్న అభిప్రాయము అవగతమైనది మరియు గౌరవించదగినది.
  రెండు మాటలు చెప్పనివ్వండి:

  మీరు ఈనాడు కాలమిష్టుని నేలాబారు చూపు చూసే స్థాయి కి చేరుకున్నారు కానీ,
  నేను మోర ఎత్తి చూసే స్థితి లోనే ఉన్నాను.. అందుకోగలనా అని ఆశ పడుతూ…

  “మీకు ఇంతకంటే చాలా ఎక్కువే చేతనయినప్పుడు…”
  మీరు నా మీద ..వల్లమాలిన అభిమానంతో అన్నారు గానీ ..నా పరిమితులు మీకు తెలియనవి కావు.

  మీ ప్రోత్సాహమునకు సదా కృతజ్ఞుడను.

  @రవి చంద్ర గారూ, సూర్యుడు గారూ, వేణు శ్రీకాంత్ గారూ,
  నెనరులు.

 4. హ్హహ్హహ్హ..బావున్నాయండి.

  (చాలా మంది) మగవారు పెళ్లికి ముందు నిత్యానందులు, పెళ్లి తరువాత కేవలం రత్యానందులు…ఎప్పటికైనా అవుతారు సత్యానందులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s