ఎంతగొప్పది అయ్యా ఈ లిరిక్

ఒక చలన చిత్రం లో ఏడుకొండల స్వామి పాటలో కబురు అన్న అన్యదేశ్యం వేశి, ప్రాయశ్చిత్తం చెప్పమని మల్లాది రామకృష్ణశాస్త్రి గారిని ప్రాధేయపడ్డ, ఔచిత్యం అంటే ఏమిటో తెలిసిన కవులు పుట్టిన గడ్డ ఇది. 
ఈ మధ్య ఓ పాట చెవిన బడింది…

ఇలా మొదలౌతుంది:

ఏడుకొండల బాలాజీ డియర్

ఎంతగొప్పది స్వామీ నీ పవర్

నవవిధ భక్తి మార్గములలో సఖ్యత ఒకటీ అనీ, “డియర్” అనేది అటువంటి సంబోధన యనీ .. వినేనంత వరకు…నాకు ఎరుక పడలేదు ఈ పాట గొప్పతనం.

ఆ సఖ్యతను వ్యక్త పరచటానికి – ఆ భక్తుడికి – కాదు ఆ భక్తుడి వెనక నున్న రచయిత కి – ఇంతకన్నా మంచి మాటలు – కాసిని తెలుగు మాటలు అందుబాటులోలేకపోవటం..ఆలోచించాల్సిన విషయమే..

తిరుపతి లో ఒకరు గోవిందా అనగానే వెనక వంద మంది అందుకుంటారు అయాచితం గా… ఇక్కడ ,, ఎందుకో గానీ గాయకుడు “kamAn(5) everybody say it” అని అభ్యర్ధిస్తాడు.. అంత వేంకటేశుడి పై సఖ్యత కలవాడికి మిగతావాళ్లతో పని ఏమీ? వాళ్లు అంటేనేమి? అనకపోతేనేమీ?

 ఇంతా జూస్తే ఈ సఖ్యత తన పెళ్లి కుదర్చటం వల్ల … love matter చెప్పుకున్నాడట, answer దొరికిందట కాబట్టి Thank You my dear.

 సఖ్యత ఎక్కువకదా .. పెళ్లికి పిలుస్తూ “వచ్చిపోరా” అని కూడ అన్నారు భక్తులు.

ఇక్కడ పోవటం ప్రధానం ఎందుకంటె భక్తుడు ఇప్పటికే తిరుపతి వెళ్ళటానికని honeymoon postpone చేసుకొని మరీ Ticket కొనుక్కున్నాడు.

ఐతే, ఇంత సఖ్యతగల భక్తుడికీ, తను కోరిన మీదట పెళ్ళి కుదిర్చిన వెంకటేశుని సన్నిధి లో వివాహం చేసుకోవాలనిపించలేదు, కనీసం వెళ్లి ఆయనను పిలవాలని పించలేదు.. అందుకే First Card ఆయనకు post చేశాడుట. మరి post చేస్తే దేవుడు వస్తాడా అని మీ కనుమానమా? అందుకే ముందు జాగ్రత గా అన్నమయ పాటల orchestra కూడ పెట్టాడుట. ఈ సఖుడికి వేరే భక్తుడిపాటలతో నిమిత్తమేమిటో మరి.

అన్నట్టు ఈ భక్తుడితో పాటు మరో భక్తురాలు, ఆవిడ కాస్త ధనవంతురాలు గా దోచును. ఏకంగా తిరుపతి లడ్డు వంద K.G Book చెసిందిట విందు కోసం.

ప్రసాదానికి , ఫలహారానికి తేడా తెలియని పరమ భక్తురాలనుకుంటా…

 తి.తి.దే వారెవరైనా ఈ పాట విన్నారో లేదో, విన్నా వారికి అభ్యంతర కరమైనవేవీ కనబడలేదో తెలియదు. లడ్డు book చేయాలెగానీ సంతోషంగా పంపిస్తామంటారేమో తెలియదు. నేను సినిమా చూడకపోవటం వల్ల ఈ జంట తెరపై ప్రదర్శించిన భక్తి ఎట్టిదో కూడ తెలియదు.

 నమో వేంకటేశాయ

పురుషాయ మహాత్మనే

ప్రణతః క్లేశనాశాయ

 గోవిందాయ నమోనమః

స్వస్తి.

18 responses to “ఎంతగొప్పది అయ్యా ఈ లిరిక్

 1. ఎందుకయ్యా నీ bandwidth waste చేసుకుంటావు ఈ సంకర రంకెలకు వంకలుజూపి?

 2. Which movie is it…
  fortunately i dont have the habit of watching Telugu movies…

 3. చాల బాగా రాసారు. ఈ పాట రాసింది రామ జోగయ్య శాస్త్రి కదా.
  ‘సేమ్యా ఉప్మా లా ఉండే నువ్వు, చైనీస్ నూడిల్స్ లా చేంజ్ అయ్యవే ‘ అని రాసిన మహానుభావుడు ఈయనే.

 4. @phani
  ఈ సినిమా నమో వెంకటేశ సినిమా లోనిది.

 5. హ హ 🙂 ఏమిటో మీలాంటి వారు ఆక్రోశిస్తే తప్ప ఇలాంటి పాటలు ఓ సారి విని వదిలేయడానికి బాగా అలవాటు పడిపోతున్నాం అండీ. దేవస్థానాల వాళ్ళకి ఈ పాటలు విని అభ్యంతరాలు చెప్పే అంత తీరిక ఎక్కడిదీ. అయినా దేవుళ్ల మీద ఇలాంటి పాటలు కొత్తేం కాదనుకుంటా…

 6. మీరు కాస్త సెన్సిటివ్ అండీ. నేను నా చిన్నతనంలో, “సీతమ్మకూ చేయిస్తి చేయిస్తి చింతాకు పతకము రామలక్ష్మి” అన్న క్లబ్బు పాట, యదువంశ సుధాంబుధి అన్న కీర్తన రాగంలో “వయసా, ఇది నా తొలి వందనం” అన్న మరో క్లబ్బు పాట విని, మనసు బండబార్చుకున్నాను. ఈ సినిమాల సాహిత్యాల గురించి ఒగ్గేయడం మంచిది.

 7. సాధరణంగా మన కపులకి (సారీ… కవులకి) ఇనాళ్ళు వినాయకుడూ, ఆంజనేయుడూ, కృష్ణుడు తేరగా దొరికేవారు…ఇప్పటిదాక.. ఇప్పూడా ట్రెండు సాయిబాబా మీదకీ, వెంకన్నమీదకీ పాకినట్టుంది…

  ఏడు కొండలు ఏసీ చేస్తా.. ఎయిడ్తు వండరు నీ గుడి చేస్తా అన్న భక్తుడు ఈయనగారి దగ్గరి చుట్టం అనుకుంట.

  విని చెవులు మూసుకోవటమో, లేదా రచైత గారి జ్ఞానానికి మంగళహారతులు పట్టతమో తప్ప చేయగలిగిందేముంది?

  ఇంతకీ ఆ శ్లోకం మీరు కావాలనే అలా రాశారా?

  ఓం నమో వేంకటేశాయ
  కామితార్థ ప్రదాయినే
  ప్రణతః క్లేశనాశాయ
  గోవిందాయ నమోనమః కదా…

 8. శాయి ప్రవీణ్ గారూ,
  వారి మిగతా పాటలు నాకు పెద్దగా తెలీవు, వారి కవితా పటిమ మీద, రచనా శక్తి మీద నాకు అనుమానమేమీ లేదు, ఇది భారతదేశం లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రంలో కొలువైయున్న హిందూ దేవతా మూర్తిని గురించిన పాట. ఆ పాట తగిన స్థాయిలో ఉన్నాదా, మరీ ముఖ్యం గా కవి గారు సఖ్యతా భక్తి మార్గాన్ని ప్రకటించదలచుకున్నపుడు – అన్నది ప్రశ్న.

  ఫణి గారూ,
  నేను ఏదేని సినిమా చూసి ఆరేళ్ల పైమాటే, ఇది రోడ్డు పక్క టీ తాగటానికి వెళ్తే నా చెవిన బడింది.

  వేణూ శ్రీకాంత్ గారూ,
  అవునండీ హిందూ దేవుళ్ల మీద కొత్తేమి కాదు.
  రవి గారూ,
  నా మనసు, జ్ఞానేంద్రియాలు బండ బారినవే, ఇప్పుడిప్పుడే స్పందింపజేయటానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి సినిమా సాహిత్యాన్ని ఒగ్గేయండి, కానీ అందులో చూపుతున్న భక్తిని
  కాదు.

  సనత్ గారూ,
  మీరు ఉటంకించిన పాట నే టపా వ్రాసేటప్పుడు అలోచించినా కూడా గుర్తు రాలేదు.
  చెవులు మూసుకోకుండ కనీసం మన బ్లాగులో నైనా నచ్చలేదు అని చెప్పవచ్చేమో. సినిమా రచయితలు అవుదామని సిద్ధం గా ఉన్న, బ్లాగులు రాస్తూ ఉన్నవారు చాల మందే ఉన్నారు, కనీసం వారిలో ఓహో ఇలాంటివి అభిలషణీయము కావేమో అని ఒక శంక నైనా కలిగించవచ్చు అని నా అనుకోలు.
  ఇక శ్లోకం – ఓం మనసులో అనుకొని నమో దగ్గరనుండి మొదలు పెట్టాను.
  పురుషాయ మహాత్మనే / కామితార్ధ ప్రదాయినే రెండూ విని యున్నాను.

 9. ఓ మగువా నీతో స్నేహం కొసం ఎంతో TRY చేసా’…అన్నదే గొప్ప కవిత్వం అనుకున్నా. Good. అంతకన్నా మంచి సాహిత్యం బయలుదేరిందన్నమాట.

 10. ha ha ha
  “తిరుపతి లో ఒకరు గోవిందా అనగానే వెనక వంద మంది అందుకుంటారు అయాచితం గా”
  మీరు తిరుమల వెళ్ళి చాల్రోజులైనట్టుంది. పది పన్నేండేళ్లక్రిందటే, క్యూలో నించుని నేను ఏడుకొండలవాడా అని అరిస్తే నా ముందూ వెనకాలా ఉన్నవాళ్ళు ఎవడీ అనాగరిక యాదవ సామంతరాజు అన్నట్టు చూశారు!
  ” తి.తి.దే వారెవరైనా ఈ పాట విన్నారో లేదో, విన్నా వారికి అభ్యంతర కరమైనవేవీ కనబడలేదో ”
  You got to be kidding!!!

 11. “పది పన్నేండేళ్లక్రిందటే, క్యూలో నించుని నేను ఏడుకొండలవాడా అని అరిస్తే నా ముందూ వెనకాలా ఉన్నవాళ్ళు ఎవడీ అనాగరిక యాదవ సామంతరాజు అన్నట్టు చూశారు!”

  మీరూ తిరుమలెళ్ళి చాన్రోజులైనట్టుండాదే! పదిపన్నెండంటే ఎక్కువేలే గానీ, పొయిన వారం తిరుమల వెళ్ళి మూడుగంటలు క్యూలో నిల్చుని యిన్న్యా. పోష్ గా కనిపించే జనాభా కూడా “గోవిందా, గోవిందా” అని అరవడమూ మానలేదు, నా పక్కన్నే ఓ పెద్దాయన భుజంమీద ఉన్న బుడ్డోడితో సహా అందరూ అందుకోటమూ మానలేదు.

 12. ఆర్యా ! భక్తిని యీ రోజుల్లో ప్రదర్సించే వారెక్కువవుతున్న కాలం .భక్తితో ముక్తిని కాంక్షించే వారు కరువౌతున్న కాలం.
  భక్తిపై అనురక్తి లేని వారెక్కువవుతున్న కాలం…అయినా ఆ కలియుగ వైకుంఠుని దర్శించాలని వచ్చేవారు అనునిత్యం పెరుగుతూనే వున్నారుకదా.
  ఇలాగే వాళ్ళు పాడాలి. భగవంతుని యీ తీరునే వేడుకోవాలని భావించగూడదేమో.
  ఏ భాషనైనా, ఏ పదాల పిలిచినా భగవంతుడు పలుకుతాడని నమ్మి ,దర్శనానికీ,పూజలకూ,ప్రసాదాలకూ,నివాసానికీ అన్నింటికీ, షార్ట్ కట్ లకు ప్రజలు వెతుకుతున్న కాలం. అందుచేత అంతగా వేదన చెందవలదని విన్న విస్తూ, ప్రజలలో భక్తి వున్నా లేకున్నా, భయమో, భీతో, మరేదో ఏటికేడు భక్తులు పెరుగుతూనే వున్నారు. భక్తిభావ వ్యక్తీకరణలేతీరున,యేభాషన వుంటేనేమి? కన్నడిగులు ఒకతీరున, అరవ తంబిలొక తీరున,వారి వారి భాషల్లో …..
  కానీండు.భగవంతుని సన్నిధికి ఏదో నెపంతో ఆ వెంకటరమణుడు రప్పించుకొని ఆనందిస్తున్నాడు కదా.మనం ఆందోళనపడి ప్రయోజనమేమి?

 13. ఆర్యా, మీ అభ్రిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు. మీరు చెప్పిన అన్ని విషయాలు బావున్నాయి. ఒక్క ” భక్తిభావ వ్యక్తీకరణలేతీరున,యేభాషన వుంటేనేమి? ” అన్నదానితోనె ఏకీభవించను. తమిళనాట ఇలాంటి పాట చూపించండి, పోని కన్నడనాట చూపించండి. శంకరాబరణం లో శంకరశాస్త్రి చెప్పినట్టు – “…ఆకలేసిన పాపడు అమ్మా అని ఒకరకంగా ఏడుస్తాడు…”. ఈ పాట లోని భాష తోనే కాక ఆ భక్తి ని వ్యక్త పరచిన తీరు నాకు నచ్చలేదు. ఈ పాట లో మీకు ఎంత భక్తి బావం కనిపించింది? ఉన్నది మీరు చెప్పిన కాలం లోనైనా దేవుడితో హనీమూన్ వాయిదా వేసుకొని వచ్చాను స్వామీ అని మొరపేట్టుకునె వాడు ఇంకా కంట బడకపోవటం వల్ల అవ్వచ్చు. మనం కాకపోతే ఎవరు ఆందోళన పడాలి? మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఎర్పడినప్పూడు తిరుమల ఆంధ్రరాష్ట్రంలోకి వచ్చినది. తమిళనాడు పర్యవేక్షణ లో ఉంది ఉంటే అక్కడ అన్యదేశ్యముల వినియోగం ఇప్పుడు ఉన్నదానిలో వందవవంతు కూడ ఉండేది కాదు. అవన్నీ పక్కన పెడితే మనం నమ్మిన దేవుడు – మన బాషలో తీసిన సినిమాలు మనం కాకపోతే ఎవరు చెబుతారు బాగుందనో – బాగలెదనో?
  ఓ నాయిక హై పిచ్ లో ఎలుగెత్తి ఆకుపూజ నీకు సోకు పూజ నాకు అని అరిస్తే దాన్ని కూడ భక్తి అని ఎలా అనుకోమంటారు? పాట మొదలవుతున్నపుడు దేవళం చూపించి – మిగతా పాటా అంతా జీన్స్ పాంటు షూస్ వేసుకొని – ష్టెప్పులు వేస్తుంటే దాన్ని భక్తి అని ఎలా అనుకోమంటారు?

  భవదీయుడు

 14. థియరెటికల్లీ స్పీకింగ్,
  నాకు ఆ డియర్-పవర్ ప్రాసపదాల్లో ఏం తప్పు కనబడట్లేదు।
  అంటే నాకున్నంత అచ్చతెలుఁగు పిచ్చ బహుతక్కువ మందికి వుంటుంది నిజమే, కానీ యోగసాధనచేననుకుంట నాకు అస్సలు తప్పు కనబడుటయేలేదు।

  భాష విషయానికొస్తే,
  ముందు పూజయంతా సంస్కృతంలో జరిగేది। ఇక వేంకటేశ్వర వైష్ణవం అరవంలోనే అగ్గిలాగా ప్రబలింది। ఇక అన్నమయ్య అచ్చతెనుగులో వ్రాయడం మొదలుపెట్టినప్పుడు ఎంత మంది ఏమన్నారో..

  ఆంగ్ల పదప్రయోగం వల్ల పాటలో నాణ్యత తగ్గుతుందేమోగాని మనలాంటి భాషాభిమానులకు। భక్తికీ కేవలం-మానవ-కల్పితమైన-భాషకీ ముడి వేయడం నామటుకు నాకు ఔచిత్యముగాననిపించుటలేదు। భక్తి యంటేనే మన యిష్టాయిష్టాలూ ప్రియాప్రియాలూ అభిప్రాయాలూ ఆసక్తులూ అన్నీ కఱిగిపోవడం కదా, అందున తెలుఁగని అచ్చదనమని అందమనీ పట్టుకు ప్రాకులాడడం …

  – రాకేశ్వర
  *all opinions are ephemeral and subject to change abruptly.

 15. అందరూ సైఁ సైఁ అంటుటే మీరు వ్రాసిన దానికి నేను నాణానికి నాకు తోచిన వేఱే ప్రక్క చూపిద్దామని ఆ టపా వ్రాసాను, తీఱా చూస్తే మనోహరులు నా అభిప్రాయం చెప్పనేచెప్పారు। దానికి మీరు ప్రతిస్పందించారు కూడా।
  నా వ్యఖ్యను వెనుదీసుకోవోడానకి లేదు, కావున మీరు దానిని ఇఙోర్ చేయవచ్చున్।

 16. Ninnati diname teliindi e website vunnadi ani. Vaak swatantryam vundalsinde. Kaani adi vichitramaina dhorani lo cheppadamu sari ayinadi kaadu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s