మాతా శత్రుః పితా వైరి గురుర్ రిపుః – ౨

 

ఈ రోజు తిరిగి పాఠశాలలు మొదలయ్యాయి,ఆంధ్రదేశంలో 

కం) బుడిబుడి నడకల బుడతల
వడివడి బంపెదరు బడికి వదరగ యాంగ్లం
పడిపడి జదవగ పోరుచు
చెడిపెదరుగదపసివాండ్ర చేరియె పెద్దల్
కం) ఇన్సల్టౌపేరంటుకు
కాన్సెప్టుస్కూలునందు గాడన “ఎడ్మిట్”
కన్సెప్షన్ నాట్నుండే
టెన్సౌనులెసగటుతండ్రి, డీలా పడుచున్.

శా) ఆయాచేతులచిన్నిబాలునొదిలే ఆయమ్మ ఎట్లుండునో
ఆయాసంబనియెంచబోకబడిలోఆఙ్ఞాపనేలిత్తురో
న్యాయమ్మే?పసివాండ్రపోరితినుమన్నన్?ఇష్టమే లేదనన్
ఆయంబొమ్మికబాల్యమేచెరబడెన్,యాంగ్లంపుకాన్వెంటునన్.

శా) ఇష్టాయిష్టపుప్రశ్నలేదు;గదమాయింపేసమాధానమై;
శ్రేష్టమ్మౌనిదువిద్య,శాలనుచునే,జేర్చన్ యహంకారులై-
నిష్ఠంబూనియెపుస్తకమ్ముగనడౌ;నిర్లక్ష్యమేధోరణై;
నష్టంబెంతయెలెక్కలేయుదురయో!నష్టంబదెవ్వానికో.
[విద్య=గ్రూపు;శాల=స్కూలు]

తే) బాలుని పరువు పందెము బారనీరు
ఆడిన, పరువు పందెము నోడు తండ్రి;
తండ్రివృత్తి తల్లిసుశీలతలను మించి
తనయు ర్యాంకులే గొప్పలౌ ధాత్రి నేడు!
[ వీడు బడిలో పరుగు పందెమాడి, తక్కువ మార్కులు తెచ్చుకుంటే తండ్రికి తలకొట్టేసినంత]

తే) అరయ ఏకాకిగాదోచు అర్భకుండు
ఫష్టు తినగ అమ్మిచ్చులే ఫాష్టు ఫుడ్డు
తండ్రి దినదినమునుజొప్పు తనదు కాంక్ష
గురువు శిక్షింప ముందుండు; ఘోరమిద్ది.

ఇది గతంలో పొద్దువారి నిర్వహణ లో కొత్తపాళీ గారి అద్యక్షతన జరిగిన సమ్మేళనమునకు వ్రాసినది. అక్కడ ప్రకటించబడలేదు.

5 responses to “మాతా శత్రుః పితా వైరి గురుర్ రిపుః – ౨

  1. పితా వైరి – అని ఉండానుకుంటాను. వైరీ – దీర్ఘం స్త్రీలింగం. పద్యాలు మనసుకు తాకాయి.

  2. రవిగారూ, మార్చానండీ, ధన్యవాదాలు.

  3. పద్యాలు, భావమూ బాగున్నదండీ !!
    సనత్

  4. అద్భుతంగా ఉన్నాయండీ పద్యాలు.

  5. సనత్ గారు, ప్రణీత స్వాతి గారు,
    ధన్యవాదములండీ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s