పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

నేపధ్యం:

 సమస్య
నా పద్యం:

పదవీ విరమణ చేసిన వృద్ధుడు, తన భార్యతో,భోజనానికి కూర్చుంటూ:

చచ్చులు పుచ్చులు కూడా

లచ్చిమి!కొనలేకనుంటి; లావా నలమై

 చిచ్చరబుట్ట జఠరమున

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

[సామాన్యంగా వారి బ్లాగులోనే జవాబు ఇచ్చేవాడిని కానీయండీ, ఈ పద్యంలో లావానలమని అపభ్రంశం ఉండటంతో అక్కడ జూపలేదు. ]

ప్రకటనలు

5 responses to “పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

 1. ఊక దంపుడు గారూ,
  “లావానలమై” ప్రయోగం చమత్కారంగా ఉంది. మిశ్రసమాస ప్రయోగం దోషం కాదు. మంచి పూరణ. అభినందనలు.
  దీనిని నా బ్లాగులో ప్రచురించాను.

 2. లావానలం యత్యాక్రోశము నుండి పుట్టినదా?

 3. ఆర్యా! మీ పూరణ అద్భుతంగా లేదని ఎవరనగలరు చెప్పండి. అనుకుంటే మీరే అలా నుకుంటారేమో మరి. అన్య దేశ్యంగా పదప్రయోగం చేయ వచ్చు.
  అభినందనలు.

 4. రాకేశ్వర గారు,
  యత్యాక్రోశం ( 🙂 ) కాదనుకుంటా.. “ల” తో పదాలు వెతుక్కోవటం పెద్ద కష్టం కాదుగా.

  శంకరయ్యగారూ, రామకృష్ణా రావు గారూ,
  స్వాగతమండీ. మీ వ్యాఖ్యలు నాకు యోగ్యతా పత్రాలు.

 5. * ఛ.లే.ప – ఛందస్సు లేని పద్యం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s