సమస్యాపూరణం -100

మూడేళ్ల క్రితం రాకేశ్వర్డుడికి చెబితే ఆశకు అంతు ఉండాలి అనే వారేమో.
రెండేళ్ల క్రితం రానారేకి చెబితే – సాలుకి రెండూ సభలు జరుకుంటే చాలేద్దూ అనేవారేమో
ఏడాది క్రితం మలక్పేట్ రౌడి తో అని ఉంటే – సమస్య లా కెలుకుడు సంఘం కామెంట్లా అని అడిగేవారేమో…

అంతెందుకు – ఓ వందరోజుల క్రితం మీరు నాతో చెప్పి ఉంటే.. నేనూ నమ్మేవాడిని కాను….

కానీ ….

ఇవేళే … కందిశంకరయ్య గారు తమ బ్లాగులో వందవ సమస్యని .. అవునండీ వందవ సమస్యని పూరణ కొరకై ప్రకటించారు.

వారికి మరొక్క మారు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అవిశ్రాంతంగా, ఆరోగ్యం సహకరించకున్నా , వేరే పనులు ఉన్నా ఉపేక్షించకుండా ప్రతి రోజూ సమస్యనో దత్తపది నో ఇచ్చారు. అవి కష్టం గా ఉండకుండ చూశారు. తమ మిత్రులు చెప్పిన పూరణలను – బ్లాగరుల కోసం తమ బ్లాగు లో ఉంచారు. శ్రద్ధగా తప్పులు చెప్పారు – మెరుగులు దిద్దారు.
ఈ తెలుగు అధ్యాపకులకు నా నమస్సులు.

అలానే, ఈ సాహితీ ప్రక్రియను బ్లాగ్లోకంలో సుప్రసిద్ధం గావించిన చింతారామకృష్ణారావు గారికి, డా.ఆచార్యఫణీంద్ర గారికీ, మురళీ మోహన్ గారికి, మలక్పేట్ రౌడీ గారికి, కామేశ్వరరావు గారికి, సుమిత్ర గారికి, యువకవులు రానారే, రాఘవ,శ్రీరాం గార్లకూ, కొత్తపాళీ గారికీ వినయ పూర్వక అభినందనలు.

పూరణలందించిన ప్రతి ఒక్కరికిన్నీ అభినందనలు.

3 responses to “సమస్యాపూరణం -100

  1. శంకరయ్య గారికి, మీకూ కూడా నా అబినందనలు.

  2. ఊకదంపుడు గారూ,
    ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

  3. కంది శంకరయ్య గారికీ; వారి సేవా దృక్పథాన్ని గుర్తించి అభినందించిన శ్రీ ఊకదంపుఁడు గారికీ; సమస్యా పూరణలు నిరుపమానంగా చేసిన కవులందరికీ నా అభినందనలు; ధన్యవాదమును.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s