ఊ అంటె తంటా – ఊహించమంటా

కొన్ని వార్తావాహినులు – విలీనం వైపే అందరూ మొగ్గు చూపుతున్నారని – విలీనం ఖాయమని చెబుతున్నారు.
నిజం గా అదే జరిగితే – చిరంజీవి చేజేతులా తన రాజకీయ ప్రస్థానాన్ని , తనను నమ్మి వచ్చిన వారి రాజకీయ జీవనాన్ని (political career) కొరి కోరి పక్క దోవ పట్టించినట్టే. ఈవేళ రామచంద్రయ్య గారు, సామాజిక న్యాయ సాధన కొసమే – కాంగ్రెస్సుతో కలిసి వెళ్లటం అని చెప్పారు (చూ : http://www.eenadu.net/breakhtml.asp?qry=break24). వారితో వెళ్ల దలుచుకుంటే ప్రత్యేకంగా పార్తీ పెట్టకుండా వెళ్ళి ఉండాల్సింది. పోనీ అప్పుడు కాంగ్రెస్ పై నమ్మకం లేదు, ఇప్పుడు కుదిరింది అనుకుంటే, ఇప్పుడు ఆ నమ్మకం కుదరటానికి గల కారణాలు ఎవో స్పష్టం గా కాన రావు. కాంగ్రెసు కన్నా తమని ఉత్తమం గా బేరీజు వేసిన 14 శాతం ఆంధ్రప్రదేశ్ వోటర్లుకు ఈ నిర్ణయానికి గల కారణాలు వివరించటం కనీస బాధ్యత. సామాజిక న్యాయం మాట ఒక నిముషం అటు ఉంచితే , అసలు 2009 ఎన్నికల తరువాత – అటు కేంద్రం లోను – రాష్ట్రం లో నూ చేసిన ఒక్క మంచి పనీ కనబడటం లేదు – ఆ పార్టీ తో ప్రజారాజ్యం కానీ – మరే పార్టీ కానీ అంటకాగటానికి.

రాష్ట్రం లోనీ కొన్ని కీలక సమస్యలపై, అంశాలపై ఆ పార్టికి కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు, ఒక ప్రాంతం వారు ఒకటి అంటే మరొకొప్రాంతం వారు మరొకటి అంటారు. పైగా కావల్సినన్ని వర్గాలు, గ్రూపులు, అసంతృప్తులు. ఇప్పటి వరకు – శాసనసభ స్పీకరు పదవిని, ఉంటుందని చెప్పిన ఉపముఖ్యమంత్రి పదవిని భర్తీ చేయలేని స్థితి. పి.సి.సి అధ్యక్షుడిని కొనసాగించాలో , మార్చాలో తెలియని డోలాయమానం. ఒక్క మాటలో చెప్పలంటే – నాయకత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లంటిది. ప్రణబ్ ముఖర్జీ గారే అఖిల పక్ష సమావేశం లో స్వయంగా – “నిర్ణయం తీసుకుంటే ఒక ఇబ్బంది, తీసుకోకపోతే ఇంకో ఇబ్బంది” అని చెప్పుకున్న స్థితి. ఈ స్థితిలో విలీనం కాదు కదా పొత్తు బెట్టుకున్నా కాస్తొ కూస్తో లాభపడేది ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీనే. పదవులు నాలుగు వచ్చినప్పటికీ – ప్రజారాజ్యానికి, దాని మీద విశ్వాసం ఉంచిన ప్రజలకీ, వెనువెంటనే గానీ, దీర్ఘకాలం లో గానీ ఒరిగేదేమి లేదు.

విలీనం ఐతే పోని కాంగ్రెస్కు ఒరిగేదేమైనా ఉందా అంటే – అదీ అంతంత మాత్రమే. నిజం గా – తెలంగాణా అంశం వల్లో జగన్ వర్గం వల్లో చీలికే వస్తే – ప్రజా రాజ్యం మద్దతు ఇచ్చినప్పటికీ – తగిన సంఖ్యా బలం ఉంటుదన్న నమ్మకం లేదు. పోనీ ఉన్నా – అలాంటి బలం ఎప్పుడు మైనార్టిగా మారుతుందో తెలీదు. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు.
పోనీ కేంద్రం లో ప్రభుత్వం సుస్థిరమనుకుందామా అంటే అదీ తెలియని పరిస్థితి. పైకి అంతా సవ్యమే అని చెబుతున్నా – D.M.k – కాంగ్రెస్సు సంబంధాలు ఎప్పుడు ఏ మలుపు తిరిగుతాయో తెలియదు. ఐనా, టెలికాం కుంభకోణం , సి.వి.సి నియామకం, కల్మాడి హస్తలాఘవం ఇత్యాదులు లతో కళంకితమైన ప్రభుత్వంలో పాలుపంచుకొని – ప్రజలకు ఇచ్చే సందేశమేమిటి. చిరు వ్యక్తిగత ప్రతిష్టకు కానీ, పార్టీకి కానీ ఒరిగేదేమిటి? సర్ఫ్ ప్రకటన సంగతి ఏమో కానీ, ప్రజాజీవితం లో మరక మంచిది కాదు కదా. మరి అలాంటప్పుడు
పోతే పోవాలిరా కలిసే పోవాలి
ఐతే అవ్వాలిరా ఐక్యమవ్వళి
పార్టీ ఏదైనా స.న్యా కావాలి – అని కొత్తగా ఇప్పుడు పాడటమెందుకు.

స్వప్రయోజనాలు/ప్రస్తుత ప్రయోజనాలకోసం అధిష్టానం ఆహ్వానించినా – రాష్ట్రం లో కాంగ్రెసు నేతలు మరియు కార్యకర్త లతో క్షేత్రస్థాయి లో వచ్చే సమస్యలు తక్కువకాదు. మరీ ముఖ్యంగా -అటు కోస్తాంధ్రలోను ఇటు తెలంగానాలోను – కాంగ్రెస్ శ్రేణులతో కల్సి నడవటం తేలికైన విషయం కాదు. గంజీ బెంజీ రెండూ తెలిసినవాడికి, ఎవరు నడుపుతున్నారో ఎటు పోతుందో తెలియని బస్సుయాత్ర ఎందుకు?

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సీట్లు దక్కకపోవచ్చు, అధికారంలోకీ రాకపోవచ్చు – ఈ లోపు ఓ నిర్ణయమైతే – సీమాంధ్రకే పరిమతం కావలసి రావచ్చు అనే అనుమానం అనుకుందామనుకుంటే- ఐతే అవ్వచ్చుగాక – అప్పుడు ఎన్నికలముందు కూడా పొత్తులు పెట్టుకోవచ్చు – అవసరమైతే వీలీనమూ గావచ్చు.
ఈ లోపు పొత్తుబెట్టుకుంటే – వారి బురద బూసుకోవటం తప్ప ప్రజారాజ్యం వారికి మరే మంచి ఫలితమూ కనబడటం లేదు.

కలిసాడుకుందాం రా!

చిరూ! మా ఇల్లు ఎంత శుభ్రమో! నీకు భలే నచ్చుతుంది, కలిసాడుకుందాం రా!!

పైగా, సముద్రం లో కలిసిన తరువాత ఇవి గోదావరి నీళ్లు అని గుర్తుబట్టేవాళ్లు ,గుర్తుపెట్టుకొనే వాళ్లు ఎవరూ ఉండరు కదా.

[ పై బొమ్మ ఈ పుటకు చెందినది : http://amars-world.com/wp-content/uploads/2010/11/mud-pit-boys-2.jpg ]

ప్రకటనలు

8 responses to “ఊ అంటె తంటా – ఊహించమంటా

  1. చిరంజీవి గారికి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ వే అలాంటపుడు కాంగ్రెస్ లో కలిస్తే తప్పేముంది?
    ఒక పార్టీ ని నడపడమంటే మాటలనుకున్నారా? ఈ విషయం ఆయనకు అనుభవం ద్వారా తెలుసుకున్నారు, తప్పు దిద్దుకుంటున్నారు. పదవులు ఆశించకుండా పనిచేయడానికి ఆయన సిద్ధమైతే ఈ విలీనం మంచిదే!!

    • నీహారిక గారూ, ఆ వోట్లు వేసినవాళ్లు కాంగ్రెసు వద్దు అనుకొని – చిరంజీవి గారి పార్టికి వేశారా, మాకు కాంగ్రెసే కావాలి అని కుండబద్దలు కొట్టి చెప్పి మరీ చిరంజీవి గారి పార్టికి వొటు వేశారంటారా? తెలుదేశం వోట్లు ఏ నియోజకవర్గం లోనూ ప్ర.రా.పా చీల్చలేదని కచ్చితంగా చెప్పగలరా? పార్తీ నడపటం మాటలు కాదు నిజమే. కానీ ప్రత్యామ్న్యాయాలు లేకపోలేదు.

  2. కాపుల ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ వే అందులో మీకనుమానం ఉందేమో గానీ నాకు లేవు. అభిమానాన్ని చంపుకోలేక భార్యా భర్తలలో ఒకరు కాంగ్రెస్ కి వేస్తే ఇంకొకరు చిరంజీవికి వేసారు.

    ఇక మీరన్నట్లు ఓట్ల చీలిక తెలుగుదేశం లోనే లోక్ సత్తా పార్టీ వల్ల వచ్చింది. అందుకే వారిద్దరూ పాము ముంగిసల్లాగా పోట్లాడుకుంటారు.

    • మీరు చెప్పిన దానితో మీరే విభేదిస్తున్నారు. లోక్ సత్తా చీల్చిన విషయం సరే. నేను అడిగినది, ప్ర.రా.పా చీల్చినదా లేదా అని. భారతదేశం లో భార్యాభర్తలకి మాత్రమే కాదు కదండీ ఓటు హక్కు ఉన్నది.

  3. అనుపమమైన పోలికను హాయిగ బ్లాగున నుంచి మమ్ములన్
    మనమున నూహ చేయుమని, మంచిగ ప్రక్కకు తప్పుకొంటివే!
    సునిశిత భావనాపటిమ చూపుచునుండె గదా విచిత్రమై
    కనపడు చిత్ర మేపగిది గాంచితివయ్య?మాహానుభావుడా!

    • ఠాగూరనుచిత్రములో
      బాగుగబట్టెనవినీతిపరులభరతమున్;
      ఓగులపుట్టనుజేరన
      ఆగని ఆవేదనద్ది యక్షరమయ్యన్

      మీదౌదార్యము మీదుస్నేహమును సామీప్యంబునేబొందుటే
      నాదౌభాగ్యము రామకృష్ణవిబుధా! నాపుణ్యమేనాటిదో
      వాదమ్మింతయులేక,గొంటిరిహితంబౌచిత్రమున్,పోలికన్,
      మోదమ్మిచ్చెనుమీదుమాట,బొలిచెన్ మోమున్ నమోవాకముల్

  4. నీహారిక గారూ, ఆ వోట్లు వేసినవాళ్లు కాంగ్రెసు వద్దు అనుకొని – చిరంజీవి గారి పార్టికి వేశారా, మాకు కాంగ్రెసే కావాలి అని కుండబద్దలు కొట్టి చెప్పి మరీ చిరంజీవి గారి పార్టికి వొటు వేశారంటారా?
    కాంగ్రెస్ వద్దు అనుకుని చిరంజీవికి ఓటేసినప్పుదు చిరు కాంగ్రెస్ తొ కలిస్తె ఇక అర్దం ఏముంది

  5. అన్నిటి కంటే వింత ఏమిటంటే…

    నిన్నటిదాక కాంగ్రెస్సంతా అవినీతిమయం అంటూ దుమ్మెత్తిపోసిన నోరు, రాజశేఖర రెడ్డి అవినీతి విశ్వరూపాన్ని, అడ్డమైన స్కాములనూ నిలదీసి తూర్పారబట్టిన నోరూ విలేఖర్లు అదే ప్రశ్న వేసే సరికి, ఆ యా ప్రాజెక్టులూ, స్కీములలో అవినీతి జరిగింది కానీ రాజశేఖర రెడ్డి అవినీతి పరుడు కాదు అంటూ కొంగొత్త భాష్యం అందుకున్నారు.

    పౌరుషం, ఆత్మాభిమానం, నిజాయితీ మొ రాజకీయనాయకులకు ఉండవు కానీ చిరంజీవేదో పొడిచేస్తాడు అంటూ గంపెడాశ పెట్టుకున్న అభిమానులూ, ఓట్లేసిన ప్రజలు మాత్రం బొక్క బోర్లా పడ్డారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s