నేర్పవయ్య నాకు సర్పభూష! (3)

కాళిపూనికనొంది గౌరిగా రూపొంద
నీవెకారకుడవు, నీల కంఠ!

అన్నపూర్ణగగొనియాడనపర్ణాఖ్య
నానందమగునీకు ఆది భిక్షు!

పుట్టింటికేగి తాఁబూదియైనసతికి
ప్రాణముఁ బోసిన ప్రళయ కార!

సకలలోకములకుఁ సతియెదిక్కనుచును
రుద్రభూమిఁదిరుగు రుద్రుఁడీవు!

సతిసుఖమనయమ్ముపతికిముఖ్యమనియు
సతివిభవముగాంచి సంతసించు
ననియు బోధపరుపనర్ధాంగికినెటులో
నేర్పవయ్య నాకు సర్పభూష!

మునుపొకమారు

5 responses to “నేర్పవయ్య నాకు సర్పభూష! (3)

 1. ఇవన్నీ… అర్ధాంగికి ఎలా బోధపఱచాలో నేర్పాలాండీ? బాగు బాగు. 🙂

 2. చిన్త రామ కృష్ణా రావు.

  నేర్పులన్ని గల్గి నేర్పమందు వదేల?
  నేర్పినాడ? శివుఁడు? నేర్పుఁ జూపి.
  సర్ప భూషణుండు కార్పణ్యమును జూపి
  నేర్పకున్న గాని నేర్వ గలవు.
  సీసాన్ని అద్భుతంగా ప్రవహింపఁ జేస్తున్న నీ నైపుణ్యాన్ని అభినందిస్తున్నాను.
  నీవు అద్భుతమైన శతకాన్ని సీసమయం చేసి అందు ఆటవెలదులతో ఆడుకోవాలని మనసారా కోరుకొంటున్నాను.

 3. శక్తి లేదు స్వామి, శతకమనుటనేల?
  ఉక్తి యుక్తి లేవు ఊక దప్ప.
  నేర్వ వలెను చాల నియమంబు బట్టి నే,
  గురుల వద్ద, మిత్ర వరుల వద్ద.

 4. శ్రీపతి సనత్ కుమార్ గారూ,
  ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s