ఘనంగా శ్రీరామలింగేశ్వర శతకావిష్కరణ (డి.వి.డి)

మొన్న శివరాత్రి నాడు జొన్నవిత్తుల వారి శ్రీరామలింగేశ్వర శతకావిష్కరణ మహోత్సవం చూడడాటనికి వెళ్ళాను. మహోత్సవం అన్నది నా మాటే.అలా ఎందుకన్నానంటే – ముందుగా ఘనాపాఠీలు స్వరయుక్తంగా చేసిన రుద్రపారాయణం మొదలిడుకొని అంతా శివమయంగా  భక్తిపూర్వకంగా జరిగిన కార్యక్రమమిది.

ఈ శతకం పుస్తకరూపం లో ఇంతకుముందే వెలువడి, ఈ  మధ్యనే మూడవముద్రణకు నోచుకుంది. ఇప్పుడు ఆ పద్యాలన్నీ శతకకర్త పాడి, వ్యాఖ్యానించిన డి.వి.డి ని ఆవిష్కరించారు.ఈ సభ లో వేల సంఖ్యలోశతకం పుస్తక (మూడవముద్రణ) ప్రతులను భక్తులకు ఉచితంగా ఇచ్చారు.

రుద్రపారాయణ తరువాత ప్రార్ధనా గీతం గా ఈ శతకం లోనివే, రెండు పద్యాలు జొన్నవిత్తుల వారి ఇద్దరుకుమార్తెలు అద్భుతంగా ఆలపించారు. “మా నీ దాగనిదా” అనిమొదలయ్యే శార్దూలం చాలా చక్కగా పాడారు చిన్నారులు. వెంటనే బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు శివరాత్రి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రసంగించి కవి శ్రీ జొ.రా.రాను ఆశీర్వదించారు.

వీరు ప్రసంగం చేస్తుండగా శ్రీ చిరంజీవి గారు సభ కి వచ్చారు. వెంటనే ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందనుకున్న నా ఊహ ను తల్లకిందులు చేస్తూ – పద్య వాద్య కచేరి మొదలు పెట్టారు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు – పద్మశ్రీ ఎల్లా వారి తో కలసి.
ఇది అనితఃపూర్వం. అసామాన్యం. అద్భుతమైన ప్రయోగం.

ఒక సంగీత వాద్యం వెలుపరించే నాదానికి అనుగుణంగా సార్ధక శబ్దాలను ఉపయోగించి పద్యం చెప్పే ప్రక్రియ. ఇది అనుకోకుండా,చివర నిముషంలో   తలపెట్టిన అంశమని నిర్వాహకులు వెల్లడించారు. అందువల్లనూ, కొంతమంది రావలిసిన కళాకారులు చివరి నిముషం లో రాలేకపోవటం వల్లనూ కొన్ని పద్యాలనే గానం చేశారు. శంఖానాదాన్నీ, ఘంటానాదాన్నీ, మృదంగధ్వానాన్నీ – పద్యం లో  ప్రతిభావంతంగా పలికించారు జొన్నవిత్తుల వారు. ఆ విధంగా ఆంధ్రదేశం లో  పద్య వాద్య ప్రక్రియ అనే సాహితీ వామనమూర్తి మూడడుగులు వేసినట్లయింది. ఇది సంగీత సహిత్యాలు సమన్వయం చేసే ప్రక్రియ. ఇప్పటికే పద్యనాటకాలు దేశాన పలుచెరుగల విజయవంతంగా నడచున్నప్పటికీ దానికన్నా భిన్నమైన ప్రక్రియ – వాయిద్యజన్య ధ్వనికి దగ్గరగా ఉన్న  తెలుగు అక్షరాలతో పద్యం ఉండే ప్రక్రియ. రెండూ ఒకదాని వెంట ఒకటి చెవులకుసోకుతుంటే చిత్రమైన ఆనందానుభూతి. మాత్రవిబుధరంజకం. శ్రీయుతులు రామలింగేశ్వరరావు, ఎల్లా వెంకటేశ్వరరావుగార్ల కృషితో మునుముందు మరింత సొబగులు అద్దుకొని ఆంధ్రసాహితీసరస్వతికి మంగళాశాసనాలు పలికే ప్రక్రియ.
తదనంతరం శ్రీ చిరంజీవి గారి  చేతుల మీదగా శ్రీరామలింగేశ్వరశతకం డి.వీ.డీ ఆవిష్కరింపబడినది.
ఎందరో చిత్రరంగ ప్రముఖులు హాజరైనారు, వేదికనలంకించినారు. ఐతే,  ఎవ్వరూ కూడ బేషజాలు చూపకుండా, తమతమ సామజిక స్థాయి గానీ, ఐశ్వర్యాన్ని గాని ఎంచక వేదికపై తమ వర్తన ద్వారా  “సత్యం  శివం సుందరం” అని చాటిన ఘనమైన సభ. “కొన్ని సభలకు మనం గౌరవం తెస్తాం, కొన్ని సభలు మనకు గౌరవం తెస్తాయి” అన్న చిరంజీవి గారి పలుకు ఇక్కడ ఉటంకించటం చదువరుల ఊహకు ఉపయుక్తం అని అనుకుంటాను.

11 responses to “ఘనంగా శ్రీరామలింగేశ్వర శతకావిష్కరణ (డి.వి.డి)

 1. Nice.
  మన సభల్లోనూ, సభలకి హాజరయ్యే ఆత్మీయ, విశిష్ట అతిథుల్లోనూ ఆ మాత్రం యుక్తాయుక్త విచక్షణ బతికి ఉన్నదన్న మాట.

 2. మేము కూడా వచ్చాం ఆ సభకి! మీరన్నట్టు భేషజాలు లేకుండా సభ చక్కగా జరిగింది. అందరూ మల్లాది గారికి ఇచ్చిన గౌరవం చూడముచ్చటగా ఉంది.

  వినూత్నమైన పద్య వాద్య కచేరి..ముఖ్యంగా ఎల్లా వారి మృదంగనాదం…. జొన్నవిత్తుల వారి పద్యం పోటీ పడ్డాయి! మిగతా వాద్యాలకి ఇంకొంచం సాధన అవసరం అనిపించింది. సమయాభావం వల్ల అని సెలవిచ్చారు కాబట్టి మున్ముందు ఈ ప్రక్రియ మరింత జనరంజకం అవుతుందని ఆశిద్దాం.

 3. అర్రెర్రే తెలియకపోయిందే…
  పరిచయమే పాల్గొన్న అనుభూతినిస్తోంది, ఊదం. ధన్యవాదాలు.
  ఎవరైనా దానిని రికార్డు గానీ చేశారా? ఏమైనా?

  • అయ్యా నాకు తోచినది నేను రాశాను. అంతే.

  • ఐతే ఆ వార్త కొంచం విపరీతం గా ఉన్నట్టు నాకు తోచుచున్నదండీ.

   1)కొత్త ఛందస్సులు : వీటిని ఇప్పుడు పద్యకావ్యాలలోనే ఆశించడంలేదు , పైగా కోటికి పైగా ఉంటే ఇప్పుడు కొత్తవాటి అవసరమేముంది?

   2)కొత్త పదప్రయోగాలు: చదివిన 3 పద్యాలలో ఒకటి చేశారు “మున్ముడి” అని – అర్ధం వివరించారు.

   3)సహనానికి పరీక్ష , విలుమైన సమయం వృధా : నాకు తెలిసి పద్య వాద్య కచేరి ముందు జరిగినవి – పారాయణ, ప్రార్ధనగా 2 పద్యాలు, మల్లాది వారి ప్రసంగము. ఇవిగాకా వేరే ఏమైన జరిగినాయేమో ( పారాయణ ముందు) తెలియదు, ఇవి పరీక్షగా తోస్తే అంతకన్నా ఉత్తమమైన విషయం ఇంకోటి లేదు.

   4)వ్యధా కార్య క్రమాలు ఎందుకని ప్రేక్షకుల అవేదన : ఈ కార్యక్రమం విజయవంతైమైతే – భాషకు మేలు చేస్తుంది, కాకపోతే నా ఒక్కడి వైఫల్యం గా మిగిలిపోతుంది అని మనవి చేసుకొని మరీ మొదలు పెట్టారు శతక కర్త – “ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడావరా ముందుగా అటో ఇటో ఎటో వైపు…”
   5)భజన సభ – సాహితీ సభ లలో ఇంతకు మించి భజనలు చూడటం అరుదేమీ కాదు,
   6)’పనికి మాలిన ప్రసంగాలు’ – వీరికి అందరి ప్రసంగాలు పనికిమాలినవిగ తోస్తే నే చెప్పగలిగినదేమీ లేదు –
   7)తమని తాము నిందించుకూంటూ – అలా కాకుండా – తృప్తిగా ఇంటికొచ్చినవాడిని నేనొకడిని ఉన్నాను అని మనవి చేసుకుంటున్నాను.

 4. మురళీమోహన్ గారూ,
  సాక్షిలో సాహిత్యసమాచారం కూడా వ్రాస్తారాండీ?! వ్రాసినా మఱీ ఇలా వ్రాయటం బాగోలేదు.

 5. ఊకదంపుడు గారూ!

  ఆ కార్యక్రమానికి వెళ్ళాలని అనుకొని వెళ్ళలేకపోయాను. మరుసటి రోజు పేపర్‌లో వార్త చదివి వెళ్ళకపోవడమే మంచిదయ్యింది అని అనుకున్నాను. కానీ మీ టపా, ఆ వార్తపై మీ వివరణా చదివాక నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. ఆ పోస్టును తొలగిస్తున్నాను.

  రాఘవగారూ!
  నిజమేనండీ.మఱీ అలా వ్రాయటం బాగోలేదు. 🙂 నేను దానిని పోస్టులో పెట్టడం ఇంకా బాగోలేదు.

 6. కోడీహళ్లి మురళీమోహన్ గారూ,

  ఆ టపా ఉంచితే బావుండేది, వార్తకు సమర్ధింపులేమైనా వ్యాఖ్యలరూపంలో వస్తే – సభలు నిర్వహింఛే పద్యప్రియులకు మార్గదర్శకం గా ఉండేది.
  ఈనాడులో అదే వార్త ఇక్కడ. ( వీరు ఎల్లావారికి తబలా ఇచ్చారు)
  శతకం మాత్రం తప్పకుండాచదవండి/ వినండి, మీరు ఆనందిస్తారని నా అనుకోలు.

  భవదీయుడు
  ఊకదంపుడు

 7. కొత్తపాళీ గారూ,
  అవునండీ.
  వీరికి చిత్రరంగ స్పర్శ కూడా ఉండటం తో అతిధులు ఎక్కువ మందే అయ్యారు, వేదికపై.

  సిరిసిరిమువ్వ గారూ,
  సంతోషమండీ.

  సనత్ గారూ,
  గతం లో ఓ అవధానం గురించి చెప్పినప్పుడు కూడా ఇలానే అన్నారు, మీరు బొత్తిగా దినపత్రికలలో జిల్లా సంచిక చూడరనుకుంటా 🙂

 8. అమ్మో మీకు జ్ఞాపక శక్తి కొంచం ఎక్కువే స్మీ

  సాఫ్ట్వేర్లో ఉండి మీరు దినపత్రికలను ఆసాంతం చదవగలగటం, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలగటం మీవంటివారు చేసుకున్న అదృష్టం. మా ఇల్లు కొంచం గోదావరీత – లంక మేత టైపు. సాఫ్ట్వేర్ టెక్కు దిగి మాదైన ప్రపంచంలో పడటానికి మాకు 30 కిలోమీటర్లు జీవితం ఉందండీ.. అయినా ఇకపై దినపత్రికా పాఠకులతో సాంగత్యం కొంచం ఎక్కువ కలగజేసుకుంటా లెండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s