అవధాన ప్రియుల కోసం – ౨

అవధాన ప్రియులకు ఆనందం కలిగించే రెండు కార్యక్రమాలు రెండు టీవీ ఛానళ్ళలో వారమ్ వారం వస్తున్నాయి..
మొదటిది HMTV లో జై తెలుగు జై జై తెలుగు. ప్రతి ఆదివారం. ఇంతకు ముందు ఉదయం వచ్చేది ఇప్పుడు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారం చేస్తున్నట్టున్నారు.
జొన్నవిత్తులవారు నెరపుతున్న ఈ కార్యక్రమం లో గత పది పదిహేను వారాలు గా ఒక పేరొందిన అవధాని గారిని పిలచి , వారిని పూర్వావధానులు పేరిట సత్కరిస్తూ, అటు ఆ అవధాని గురించి, ఇటు సమ్మానం అందుకోవటానికి వచ్చిన వారి సాహితీ విశేషాలతోను చక్కగా సాగుతున్న కార్యక్రమమ్.
ఈ వారమ్ ఆచార్య బేతవోలు వారితో ముఖాముఖి ప్రసారం చేశారు..
అలానే, రాళ్లబండి వారితో, గరికపాటి వారితో .. ఒక్కరేమిటి లెండి.. అందరి అవధానులతో ముఖాముఖి చూడవలసినవే…

ఓ వెసులుబాటు ఏమిటంటే  .. మీరు ఈ కార్యక్రమాలు… టి.వి లో ఆవేళకు చూడలేకపోతే .. వారి యూట్యూబు చానల్ల్ ( ఎవరూ యూట్యూబుకు తెలుగు అనువాదమ్ చేసే సాహసం చెయ్యలేదనే అనుకుంటున్నాను)
లో వీలు చిక్కినప్పుడు చక్కగా చూడవచ్చు…
బేతవోలు వారి తో ముఖాముఖికి ప్రధమభాగపు లంకె ఇది..

రాళ్లబండి వారి తో ముఖాముఖి ఇక్కడ..

ఈ కార్యక్రమం లో మున్ను చిత్రకవులతో చేసిన సంచికలతో సహా అన్నిటి జాబితా ఇది:

జై తెలుగు జై జై తెలుగు

ఇక రెండవ కార్యక్రకం శ్రీ వెంకటేశ్వర భక్తి వాహిని వారు ప్రతి శని వారం మధ్యాహ్నం మూడున్నరకు అవధానం పేరిట – అష్టావధానాన్ని నెరపుతున్నారు .. ఇందారం కిషన్రావు గారి సంచాలకత్వం లో. ఎండరో చిన్నా పెద్దా ( వయసులో) అవధానుల కవితా ప్రతిభనుచూసే అవకాసం కలుగుతున్నది ఈ కార్యక్రమం లో. రెండు వారముల క్రితము ఆముదము మురళి గారు చాలా చక్కగా అవధానము చేసినారు. గతవారామ్ ఇద్దరు జంటకవులు సంస్కృతాంధ్రాలలో అష్టావధానం చేశారు. వీరి కార్యక్రమాలు – ప్రత్యక్షం గా జాలం లో చూసే అవకాశం ఉంది కానీయండి.. కార్యక్రమం ముగిసిన తరువాత చూసే తావు నాకు కనపడలేదు. మీకి తెలిస్తే పంచుకోండి.

ప్రకటనలు

2 responses to “అవధాన ప్రియుల కోసం – ౨

  1. ధన్యవాదాలు, ఊకదంపుడు గారూ! యూట్యూబ్లో ఉన్న అన్ని ఎపిసోడ్లూ చూసేశా 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s