నేర్పవయ్య నాకు సర్పభూష! – ౬

సీ||
సర్పభూషణుఁడీవె? స్వర్ణభూషణుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గజచర్మ ధారివే? కనకవసనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
వల్లకాడు నీయిల్లె? వైకుంఠమట యిల్లు శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
విషమేక్షణుండవీవె? సమేక్షణుండంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గరళకంఠుడవీవె? కౌస్తుభధరుడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
దాల్తువె బూదినె? దాల్చఁట గంధమే శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గంగిరెద్దు రధమె? గరుడవాహనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
శ్వశుర వైరివె? యుంట శ్వశురగృహమునంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి

ఆ||
సిరియు సంపదలును స్థితియు సకలభోగ
భాగ్యములును వస్తు వాహనాదు
లెన్నొ గల హితుఁ గన నీర్ష్య నొందకయుంట
నేర్పవయ్య నాకు నీలకంఠ!

5 responses to “నేర్పవయ్య నాకు సర్పభూష! – ౬

  1. శీతాద్రి వాసుడైన ఈశ్వరుడిని కూడా శ్వశురగృహవాసి అని చమత్కరిస్తుంటారు గదండీ.
    సీసపద్యంలో చక్కటి వర్ణనలను సమంగా చేశారు. బాగుందండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s