Category Archives: ‘ఊక’వితలు-పద్యాలు

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౬

సీ||
సర్పభూషణుఁడీవె? స్వర్ణభూషణుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గజచర్మ ధారివే? కనకవసనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
వల్లకాడు నీయిల్లె? వైకుంఠమట యిల్లు శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
విషమేక్షణుండవీవె? సమేక్షణుండంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గరళకంఠుడవీవె? కౌస్తుభధరుడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
దాల్తువె బూదినె? దాల్చఁట గంధమే శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గంగిరెద్దు రధమె? గరుడవాహనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
శ్వశుర వైరివె? యుంట శ్వశురగృహమునంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి

ఆ||
సిరియు సంపదలును స్థితియు సకలభోగ
భాగ్యములును వస్తు వాహనాదు
లెన్నొ గల హితుఁ గన నీర్ష్య నొందకయుంట
నేర్పవయ్య నాకు నీలకంఠ!

ప్రకటనలు

నేర్పవయ్య నాకు సర్పభూష! (3)

కాళిపూనికనొంది గౌరిగా రూపొంద
నీవెకారకుడవు, నీల కంఠ!

అన్నపూర్ణగగొనియాడనపర్ణాఖ్య
నానందమగునీకు ఆది భిక్షు!

పుట్టింటికేగి తాఁబూదియైనసతికి
ప్రాణముఁ బోసిన ప్రళయ కార!

సకలలోకములకుఁ సతియెదిక్కనుచును
రుద్రభూమిఁదిరుగు రుద్రుఁడీవు!

సతిసుఖమనయమ్ముపతికిముఖ్యమనియు
సతివిభవముగాంచి సంతసించు
ననియు బోధపరుపనర్ధాంగికినెటులో
నేర్పవయ్య నాకు సర్పభూష!

మునుపొకమారు

౨౬ జనవరి, ౨౦౧౧

తెల్లదొరలు బోవ తృప్తినొందగనేల?
ధనబలమునకపుడె దాసులగుట.
నల్లడబ్బు దేవ నావల్ల కాదని
‘చేతు’లెత్తెగాద నేత యిపుడె.

కొమ్మయ! నాదియు నివాళి కొంగర జగ్గా!

కవివొ, లక్షణనటుడవో, ఘనవిమర్శ
కుడవొ, నేతవో, దెలియగ గోర; గాని
ఋత్వము బలుక నేర్పు గురుత్వ పీఠి
నిను నిలిపి గారవించెద నిత్యమున్ను.

బాదరాయణ లంకె:

కళా వాచస్పతి

గగనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే

శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది మహోత్సవాల సందర్భంగా రాయలవారిని గూర్చి పద్యం వ్రాయాలని ఆశ గలింగింది, శ్రీ కొడిహళ్ళి మురళీ మోహన్ గారి ప్రోత్సాహం మీద.

ఏమి రాయాలా అని ………… తరువాత
తెనాలి రామకృష్ణుని పద్యం లో రాయలు వారు  చిన్న మార్పు చేసి విశేషార్ధం కల్పించిన విషయం గూర్చి చెబుదామని ఆలోచన వచ్చింది.  

తెనాలి రామకృషుల వారు నంది తిమ్మన గూర్చి ప్రశంసగా చెప్పిన పద్యం ఇది:  

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

రాయల మార్పు చేసిన పద్యం ఇది:

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాక ధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

దీని గూర్చి మరింత వివరణ ఇక్కడ చూడండి.
సరే  ఎలాగో నాలుగో పాదం కూర్చాను :”గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే”
అని.
పై మూడు పాదములకు గణములు కూర్చిన తరువాత పద్యం ఇదీ:

 

 

 

ఎందుకైనా మంచిదని  పద్యాన్ని  తీసుకువెళ్లి  కామేశ్వర రావు గారికి చూపించాను, వారు చిన్న మార్పు చేసి విశేషార్ధం కల్పించిన పద్యం ఇది:

జనజీవనసుఖమయ పా

లనమునను సుకవులకైతలను రాజకవీ!

 గనుగొన సులువుగనిలను,గ

గనమును నాకముగ మార్చు ఘనుడవు నీవే!

ఏమిటీ, కామేశ్వర రావు గారూ మార్పు చేయక ముందు పద్యం గనబడతం లేదు అంటారా? అదే గగనం అంటే.

సరే మొత్తానికి పద్యములైతే కట్టాను, చాలా రోజుల తరువాత, అనుకున్న పని, అందులోనూ శక్తికి మించినది, పూర్తిజేయగలిగాను,చేతనైనంతలో. గురుకృప, మిత్రలాభం తోడై. ఆ పద్యాలు ఇక్కడ చూడవచ్చు.

భైరవభట్ల వారి మార్పు చూసి చూడగానే – నా నోట వచ్చిన మాట ” మా కొలది జానపదులకు..”

పద్యాన్ని పూర్తి చేస్తే: 

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ! గనగ, శ్రీకామేశా!

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

నేపధ్యం:

 సమస్య
నా పద్యం:

పదవీ విరమణ చేసిన వృద్ధుడు, తన భార్యతో,భోజనానికి కూర్చుంటూ:

చచ్చులు పుచ్చులు కూడా

లచ్చిమి!కొనలేకనుంటి; లావా నలమై

 చిచ్చరబుట్ట జఠరమున

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

[సామాన్యంగా వారి బ్లాగులోనే జవాబు ఇచ్చేవాడిని కానీయండీ, ఈ పద్యంలో లావానలమని అపభ్రంశం ఉండటంతో అక్కడ జూపలేదు. ]

నవ(యుగ) వధువు

13/4/2010: మలి ప్రతి:

నవ వధువు

దేశాంతర నగరప్రవాసోపలబ్ధ విభవలాలసాచేలాచ్ఛాదితనేత్ర- గాంధారి

గగనమార్గకృత నిస్తంత్రీసల్లాపమయ వివాహశృంఖలాబద్ధ – శాకుంతల

ఖండాంతర స్థిత మహాసౌధభరిత లంకాపురాతిరిక్త నగరంభర జనారణ్య సంచారభీత- సీత

తలిదండ్రులు –
మునుపు
పిల్ల్ల నచ్చలేదంటారేమోనని
భయపడేవారు

ఇపుడూ భయపడుతున్నారు

సంబంధం వద్దన్నపుడు కాదు  ..
పెళ్ళికి సిద్ధమన్నపుడు.