Category Archives: పెంపకం

అమ్మ,నాన్న, ఓ ర్యాంకులొచ్చేఅబ్బాయి

 అమ్మ :  ఏమండి, ఎలాగూ ఇక్కడదాకా వచ్చాంగా , అవస్థలపురం లో మా పెద్దమ్మ కూతురుంది వెళ్దామండి.

నాన్న:  వద్దు, ఇంటి దగ్గఱ పిల్లాడు ఒక్కడే ఉన్నాడు, వెళ్దాం.

 అమ్మ :  మళ్లీ ఇక్కడ దాకా ఎప్పుడొస్తామో ఏమో, ఎక్కువసేపు వద్దు , రెండే నిమిషాలూ కూర్చొనివెళ్దామండి.

నాన్న:  వాడు ఒక్కడే ఉంటే టి.వీ చూస్తూ కూచుంటాడు,నా మాట విని ఇంటికి వెళ్దాం పద.

అమ్మ:  చదువుకుంటాని అని చెప్పాడండి, ఐనా టి.వి లాక్ చేసి వచ్చాను,  న్యూస్ ఛానల్స్ తప్ప ఏవీ రావు.

నాన్న: పిచ్చిదాన, అవి చాలవూ?!

ప్రకటనలు

అమ్మ, నాన్న, నాలుగేళ్లబ్బాయి -5

అబ్బాయి: ఏంటి నాన్న నేను పది రోజులు ఇంట్లో లేకపోతే నీకు బోర్ కొట్టిందా
నాన్న: అవును
అబ్బాయి: మామయ్య తిరిగి అమెరికా వెళ్లిపోయాడు, నే వచ్చేశాన్లే.
నాన్న: ఊ, ఏమిటి విశేషాలు?
అబ్బాయి : ఏమీ లేవు, నువ్వు చెప్పు.
నాన్న: మీ మామయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడా?
అబ్బాయి : అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు.
నాన్న: ???

                 *******            

అమ్మ: మీరు రాలేదని మా తమ్ముడు చెల్లెలు చాలా సార్లు అనుకున్నారండి.
నాన్న: అవునా
అబ్బాయి: నీకు అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు
అమ్మ:నువ్వూరుకోరా
నాన్న: వాడ్నంటావెందుకు,బడి మానిపించి మామయ్యతో తిప్పితే ఇవి కాక ఇంకేంనేర్చుకుంటాడు?

                 *******            

నాన్న: ఓరెయ్ ఇంకా పడుకో, రేపటి నుంచి బడికెళ్లాలి
అబ్బాయి: సరే
నాన్న: లాలనుచునూచేరు లలనలిరుగడలా..
అబ్బాయి: హబ్బా, నాకు లాలి అక్కర్లేదు నాన్నా, నేను పెద్దవాడినయ్యాను.
అమ్మ: చూశారా, మామయ్య దగ్గర ఉండి ఎంత డిప్లమసీ నేర్చుకున్నాడో, మీరు పాడితే వచ్చే నిద్ర కూడా పారిపోతుందని అనిచెప్పకుండా, నేను పెద్దవాణ్ణయ్యా, లాలి అక్కరలేదు అని చెప్పాడు.
నాన్న: ???

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౪

రెండు వారల క్రితం, అర్ధరాత్రి 12:00 గం

అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి , రేపటినుండి మీరు దింపండి..
నాన్న: బండి మీదేగా వెళ్లేది, పది నిముషాల భాగ్యానికి ఏమి కష్టంట.
అమ్మ: అదికాదండి,
నాన్న: కాస్తా,నిద్రపోనిస్తా, మళ్లి రేపొద్దునే లేచి ఆఫిసుకి పరిగెత్తాలి.

ఓ వారం క్రితం, అర్ధరాత్రి 12:00 గం
అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి,తిరిగి వచ్చి మొదలు పెట్టాలంటే వంట లేటవుతోంది రేపటీ నుండి మీరు దింపండి..
నాన్న: నాకున్న సమస్యలకి నాకు నిద్రపట్టేదే తెల్లరుఝామున, ఆ రెండుగంటలన్నా ప్రశాంతంగా పడుకోనీ
అమ్మ: అదికాదండి,
నాన్న: నువ్వు దింపితేనే వాడికి ఇష్టం ఇక పడుకో

మొన్న అర్ధరాత్రి 12:00 గం

అమ్మ : ఊరుకున్నకొద్దీ వీడి మిస్సు మరీ మితిమీరి పోతోందండీ
నాన్న: ఇప్పుడేమైంది
అమ్మ: ఈవాళ వీణ్ణి “ఎంత మీనాన్నలాగ అందగాడివైతే మాత్రం అంత మిడిసిపడక్కర్లా” అందిట.
నాన్న: అంత మాట అందా, వాళ్ల ప్రిన్సిపాల్ తో మాట్లాడతాలే, అన్నట్టు, నీకు కష్టం గా ఉందంటున్నావుగా రేపటినుంచి వాణ్ణి స్కూల్లో నేను దింపుతాలే..
అమ్మ: ( మా అక్కచెప్పిన చిట్కా నాక్కూడ పనిచేసిందోచ్)

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౩

అమ్మ: పుస్తకాలమీద ఎక్కితొక్కుతావేరా, చదువు రాదు, సరస్వతీ దేవి శపిస్తుంది
నాన్న: శపిస్తే ఏళ్లతరబడి ఈనాడు పుస్తకాలు కొని-చదవనందుకు నన్ను, వాటినన్నిటినీ మెట్టులాగా షోకేసు బొమ్మలందేటట్టు పెట్టిన నిన్ను శపించాలిగాని వాడినెందుకు శపించటం?

అమ్మ: □ □ □ □ □ □□

నాన్న: ▫■▫□▪□▪□▪□

అమ్మ □ □ □ □ □ □□ □ □ □ □ □ □□□ □ □ □ □ □□
 నాన్న: ▫■▫□▪□▪□▪□■□■□■
అమ్మ:   □ □ □ □ □ □□□ □ □ □ □ □□
 నాన్న:  ■■■▫■▫□▪□▪□▪□■□■□■□■□■□■□■□■□■□■
అబ్బాయి : నేను బొమ్మతీసుకొని దిగాను గాని, మీరింకా ఆపుతారా?

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౨

గురువారం రాత్రి:
అబ్బాయి : ఎంటి నాన్న తొందరగా వచ్చి నిద్రబుచ్చుతాననిచెప్పి ఇవాళ కూడా లేట్ గా వచ్చావు?

(అవసరానికో అబద్ధం ఆడే) నాన్న
:  పెందరాడే వద్దామనుకున్నా, వస్తుంటే పని ఉందని కారుణ్యా అంకుల్ ఆపేశాడు, అందుకని లేట్ అయ్యింది

***

శుక్రవారం ఉదయం
అమ్మ: ఏమండి,లేవండీ మీకు కారుణ్య ఫోన్
అబ్బాయి : ఉండు నేను మాట్టాడతా

అబ్బాయి : హలో, రాత్రి మా నాన్నని అంతసేపు ఆఫీస్ లో ఎందుకట్టేపెట్టా? తొందరగా వచ్చి బబ్బోపెడతానన్నాడు, రాలేదు పెట్టాలేదు..
కారుణ్య: ???
అమ్మ, నాన్న :?????

అమ్మ, నాన్న, మూడేళ్లబ్బాయి

అమ్మ: పదిన్నర అవుతోంది పడుకోరా
అబ్బాయి: నాన్న వచ్చాక పడుకుంటాలే అమ్మా

అమ్మ: పదకొండయింది పడుకో నాన్న, టి.వీ రేపు చూడచ్చు
అబ్బాయి: నాన్న వచ్చాక పడుకుంటాలే అమ్మా
అమ్మ: నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంకా లేటవుతుందిట, నేనూ పడుకుంటున్నాను , నువ్వూ పడుకో
అబ్బాయి: సరె ఐతే నువ్వు పడుకో అమ్మా నేను ఇవాళ పడుకోను లే..
అమ్మ: ఎందుకు పడుకోవు?
అబ్బాయి: నేను నిద్ర మధ్య లో లేచి ఏడిస్తే, నువ్వు విసుక్కొని తిడతావు గా, అప్పుడు ఎత్తుకొని నిద్రపుచ్చటానికి నాన్న ఉండరుగా అందుకు.
అమ్మ: ??!