Category Archives: పేరడీలు

ఇదో ప్రయాస

చిరిగిన నోటులో తేదీని చూస్తున్నా
పాలముంత లో నెయ్యి ని వెతుకుతున్నా
ఎంతటి పిచ్చివాణ్ణి నేను…
కానీలేనివాడ్ని వడ్డీతో కట్టమంటున్నా!

ఐ.పీల ముంగిట్లో అసలును బేరమాడుతున్నా
బకాయిదారు ఇళ్లను నిన్ననేను వెతుకున్నా
పరుసేలేనిచోట నేను…
పయిసల సామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!

పెరటిఇంటి ముందు కావలినై కాస్తున్నా
దొరికితె నాల్గు తగులించాలనుకుంటున్నా
జేబులు చిరిగిన చొక్కాలో నేను…
చిల్లరనాణాలకై అన్వేషిస్తున్నా!

సయికిలుంది తాళాన్ని తీయలేకనున్నా
నడి రాత్రములో నాకునై నేనున్నా
నడకని ఆశ్రయించిన నేను…
తన్నేటిఎగశ్వాసలో తెగరొప్పుతున్నా!

ప్రకటనలు

పెడితే పెట్టాలిరా…

పెడితే పెట్టాలిరా పార్టీ పెట్టాలి
ఐతే అవ్వాలిరా ఛీఫ్ అవ్వాలి
బాటేదైనా గాని మనరైలు వెళ్లాలి
పోటిఉన్నాగాని గెలుపొంది తీరాలి
హస్తినలో నీకోసమె పాత్రే ఉండాలి

అనుపల్లవి:
వోట్లే రాలాలి మునిరాజు లాగ
సీట్లే రావాలి నటరాజు లా
పదవే ఉండాలీ నెలరాజు లా
ముగిసే పోవాలి రాజూ, పేదతేడాలన్నీ…….

అనుపల్లవి మీకేమైనా అర్ధం అయ్యిందా చదువరి గారు?

సిగ్గేల?

               పేరడీ??

          హగ్గే హాటౌ చిట్కా
         రగ్గేలశిశిరపురాత్రి రమణియె బ్రోవన్
         దగ్గేలదగ్గరౌమన
         సిగ్గేలసిసలుమగనికి సిరిసిరి మువ్వా?

తూగులయ్య పదాలు

[హెచ్చరిక: ఇది పేరడీ]

శ్రీరాముడి ఈ టపా చూసిన తరువాత బ్లాగేశ్వరునికి ఎలా కలిగిందో, రానారే గారి ఈ టపా చూసిన తరువాత నాకు అలానే దురద పుట్టింది. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో రోడ్డు మీద బాగా తాగి తూలుతున్న మందు బాబు దారిచూపించాడు:

అన్న మాట వినుట
తిన్న బాట జనుట
తగవు గొప్పవాడవగుట
ఓ తూగులయ్య!

మాట తూలుట కన్న
తాగి తూలుట మిన్న
బతుకు బండి సున్న
ఓ తూగులయ్య!

సత్యశోధన కూన
మూడు బీర్ల మీన
నిజమె నాల్క పయిన
ఓ తూగులయ్య!

వోట్లనాడు ఉచితము
వద్దనుటనుచితము
ఘనమీ ప్రజాతంత్రము
ఓ తూగులయ్య!

దుఃఖము మరువ తాగు
సంతోషమపుడును తాగు
నీకేల ఆలుబిడ్డల ఓగు
ఓ తూగులయ్య!

తాగి బండి నడుపబోకు
నడిపి జనుల చంపబోకు
అదియె పదివేలు మాకు
ఓ తూగులయ్య!

ఇట రానారె స్పూర్తి
నాది వికటపు ఆర్తి
ఆరుద్ర గురు మూర్తి
ఓ తూగులయ్య!

చిత్ర పుత్రోత్సాహము

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ఎపుడా
పుత్రుడు హీరో అగునో
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ‘నటులా’
పుత్రుని నటనను బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు “ఆడున్
పుత్రుని సినిమా వందని”
పత్రికలు టీవీలుపేల,  ప్రాప్తము సుమతీ!

పుత్రోత్సాహమె తండ్రికి?

చిత్రమువెనుదిరిగివచ్చి చీకటిబడకే

పుత్రుడివలెమూలనుబడ
పుత్రోత్సాహంబు పాడు బొందర సుమతీ!

పుత్రోత్సాహమధికమై
పుత్రుకు పుట్రేపు బెట్టి -పొంగగ, హీరో
పాత్రిచ్చి తీయ సినిమా-
పాత్రొచ్చినచేతికి- తన పాపమె? సుమతీ!

ఉల్లముంచవా ఈ తంతులో

[ఇది కేవలం బాణీకి పేరడీ, అర్ధం వెతికి సమయం వృధా చేసుకోకండి.]

ఉల్లముంచవా ఈ తంతులో
తల్లివికావా ఈ ఆటలో
ప్రణయకేళి బాధా?
నాబ్రతుకు బూదికాదా?

మేనున్నది దీంతోనే
నీమేను నాదేలే – నీదన్నది ఏమున్నదినీలో
నేనేనాడొ తలచాను ఈరాత్రిని
నీవీనాడు మెలగాలి ఆ స్పూర్తిని

ఇదేనాకు తపమని, ఇదేనాకు వ్రతమని
చెప్పాలనిఉంది, గుండెవిప్పాలని వుంది.

నీప్రేమకు దాసుణ్ణి, నీ పూజకు దేవుణ్ణీ
నీ బిడ్డకు నాయన్ని కానా
నేనిన్నాళ్ళు వేచింది ఓ వేదన, నీకు ఈ నాడు కలగాలి సంవేదన

ఇదే నిన్నువినమని, “సరే పదా” అనమని
చెప్పాలనిఉంది, గుండెవిప్పాలని వుంది.

కడుపున ఉన్నదీ…

ఈ పేరడీ ఎక్కడో చూశాను.

హెచ్చరిక: అన్నం తినగానే చదవద్దు.
*********
కడుపున ఉన్నదీ కక్కాలనున్నదీ డోకులురావేఎలా
పొద్దునతిన్నదీ ఓ మంచిపచ్చడీ బయటకుపోతేఎలా
అతడిని చూస్తే ఠక్కున తెమిలిపోయే వికారం ఆపేదెలా
ఎదురుగ వస్తే ముక్కుకుచేరిపోయే కోపం నిలిపేదెలా
ఒకసారి నిలదీసి వాడి గొడవేమిటో తేల్చకపోతే ఎలా

చెంత ఐసున్న వెచ్చగ‍ఉందని
ఎంత A.Cఉన్న తెలియగలేదని
తననే తిట్టుకొనేవేళలో
తను అంటేనే తగని రోతని
లేతగుండెల్లో ఱంపపుకోతని
బొత్తిగాతెలుసుకోలేనివాడితో
కనబడుతోందా నాపీడైన నీకు నాఎదరోత అని అడగాలనీ
ఊపుకుంటూ నాచుట్టూ ఇకతిరగద్దనీ తెలుపకపోతే ఎలా ||కడుపున||

నీకన్నుల్లో ఆతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే జడుసుకునే వేళలో
మూసుకున్నావా కొంతేసేపని
పీడకలల్లో ఊరేగుతాడనీ
కనులే తెరుచుకునే రేయిలో
వినబడుతోందా నా పీడైన నీకు నా శోకపురాగం అని అడగాలనీ
పగలేదే, రేయేదో, ఎరుకేలేదని తెలుపకపోతే యెలా ||కడుపున||