Tag Archives: శివరాత్రి

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౬

సీ||
సర్పభూషణుఁడీవె? స్వర్ణభూషణుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గజచర్మ ధారివే? కనకవసనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
వల్లకాడు నీయిల్లె? వైకుంఠమట యిల్లు శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
విషమేక్షణుండవీవె? సమేక్షణుండంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గరళకంఠుడవీవె? కౌస్తుభధరుడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
దాల్తువె బూదినె? దాల్చఁట గంధమే శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
గంగిరెద్దు రధమె? గరుడవాహనుఁడంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి
శ్వశుర వైరివె? యుంట శ్వశురగృహమునంట శ్రీహరి గూర్చియే చెప్ప వింటి

ఆ||
సిరియు సంపదలును స్థితియు సకలభోగ
భాగ్యములును వస్తు వాహనాదు
లెన్నొ గల హితుఁ గన నీర్ష్య నొందకయుంట
నేర్పవయ్య నాకు నీలకంఠ!

ప్రకటనలు

నేర్పవయ్య నాకు సర్పభూష! – ४

అన్నపూర్ణాదేవి ఆత్మేశు వీవని
తృప్తిగా కీర్తించు తెలివి లేక

పొట్టకూటికొఱకు పొరుగు రాష్ట్రమునందు
పలుకష్టముల్ నేను పడుచునుంటి

చిత్తశాంతినిగూర్చు జీవేశువీవని
తర్కించు కొనునట్టి తడవు లేక

చిన్నవిషయముకుఁ జింతగొనుచు
మాన్ప వైద్యులమధ్య మనుచునుంటి

ఆపదల్ తొలగించి యవనిజనులగాచు
ఆదిదేవుడవన నదియుమరచి

ధన,బల, జ్ఞాన వృద్ధస్నేహసమితిలోన్
బ్రోచువారికొరకు జూచు చుంటి

దైత్యతతకినైన దయవరములనిచ్చు
దైవమీవనునట్టి తలపులేక
కోర్కెవెనుకకోర్కె  కోరుచుండసతియె
తీర్చుదారిగనక తిరుగు చుంటి

పరువు పెట్టు చుంటి ప్రస్థానమెఱుగక
పదియు లిప్త లైన ప్రతి దినము
నిన్ను తలచి కొల్చి నెమ్మదింపమదిని
నేర్పవయ్య నాకు సర్ప భూష!

నేర్పవయ్య నాకు సర్పభూష! (3)

కాళిపూనికనొంది గౌరిగా రూపొంద
నీవెకారకుడవు, నీల కంఠ!

అన్నపూర్ణగగొనియాడనపర్ణాఖ్య
నానందమగునీకు ఆది భిక్షు!

పుట్టింటికేగి తాఁబూదియైనసతికి
ప్రాణముఁ బోసిన ప్రళయ కార!

సకలలోకములకుఁ సతియెదిక్కనుచును
రుద్రభూమిఁదిరుగు రుద్రుఁడీవు!

సతిసుఖమనయమ్ముపతికిముఖ్యమనియు
సతివిభవముగాంచి సంతసించు
ననియు బోధపరుపనర్ధాంగికినెటులో
నేర్పవయ్య నాకు సర్పభూష!

మునుపొకమారు

నేర్పవయ్య నాకు సర్పభూష! – ౨

    నిముషమ్ము జటలోన నిలుపంగ గంగనే
            చినయింటి ఘనశంకఁ  చిన్నబుచ్చె
    చెరకుమోపులవాన్కి చిరుసాయమిడినంత
               పుట్టగా చెమరింత పూలగొట్టె
    తగదన్న వినకనే తనతండ్రి గృహమేగి
             యజ్ఞశాలకునద్దె యమునినగవు
    అనసూయ వ్రతమునే వినినంత ఈసొంది
             ఆద్యంత రహితుకే అమ్మనిచ్చె 

    కోరిజేరినసతి గుణదోషములనక
    వలయు ధర్మమెల్ల దెలియ జెప్పి
    గారవించి మెలగ, కలికాలమందునా,
    నేర్పవయ్యనాకు సర్పభూష!

————————————————————————–

 

బాదరాయణ లంకెలు:
మునుపొకమారు
భైరవభట్ల వారి బ్లాగులో.
చంద్రిమ
చంద్రబింబాననా

 

నేర్పవయ్య నాకు సర్పభూష!

సీసము(?):

శిరమున యొప్పుకాపురభారమొక్కటి

శిరమున సంసార భారమదొక్కటి
పరవళ్ల గంగయు- వరసకొడుకు*

తిరముగ ఒంటినంటి రమణి యొక్కతె
పార్వతీ దేవియు పసుపు కొడుకు

ఆమెకు ఈమెకు నేమందులేగాని
సకలలోకమనెడి సవతి పోరు

ఈతని కాతని కీశ! జెప్పగనేల,
సకలలోకమెరుగు చవితి పోరు

ఆటవెలది(?):

మౌని,స్థాణు, జడుడ, మాటవరసకైన
జోక్య మింత లేదు జోగి నీదు.
“నీరు-తామరాకు” నియతి వర్తింపగా
నేర్పవయ్య నాకు సర్పభూష!

చంద్రమౌళి

శిరమెటనొంచని వెన్నుడె
శిరమొంచునునీకడయని శితికంధరుడా!
శిరమొంచె బావయన నీ
శిరమున జేరెను మఱింది శీతకరుండే.