Monthly Archives: ఆగస్ట్ 2007

పన్ తరంగాలు

>>> కవులలో అతడు కిలిమంజారో కాంతామణి కనిపిస్తే మాత్రం వెకిలిమంజారో

>>> జనాలు రెండు రకాలు ‘వినదగునెవ్వరుచెప్పిన’ అనేవాళ్లు, ‘వినదగు never, చెప్పిన’అనేవాళ్లు.

>>> మా ఇంటి ఓనర్ అఖిలాండ్రేశ్వరి, అందరిని ఉతికారేస్తుంది.

>>> రిటైరవ్వకముందు ఇంటికి మూలపురుషుడు, రిటైరయ్యాక ఇంట్లో మూలపురుషుడు

>>> breakfast కి ఓ ఉత్తరాది మిత్రుడి హిందీ అనువాదం భూకావట్.

>>> Technologistకి తెలుగు పదం సాంకేతిగాడు.

>>> అవధానాల్లో ప్రసంగాలు రెండే రకాలు ౧. అప్రస్తుత ప్రసంగాలు ౨. స్తుత ప్రసంగాలు

>>> పాపులేషన్ లో మూడొంతులు పాపులే.
        ^^^

ప్రకటనలు

ఇది మటుకు జోకే

http://www.eenadu.net/story.asp?qry1=23&reccount=28

నాకు అర్ధం కాలేదు – నైతిక బాధ్యతకి – గాంధీకి గారికి ఏమిటి సంబంధం?
బాధ్యులెవరో తెలియని పరిస్థితులలో – అలా స్పందించటం అంటే -? రేపు బాధ్యులెవరో తెలిసిన తర్వాత – నాది నా ప్రభుత్వానిది కాదు ఫలాన వాడిది బాధ్యత అంటారా?
చివరలో బాగా శెలవిచ్చారు, టవరులు కూలిన ప్రభుత్వం కూలలేదు అని. అవును, ప్రభుత్వం కూలాలంటే టవర్లు కాదు ఓటవర్లు ( ఓటు బ్యాంకులు) కూలాలి మరి

వ్రాయటమా? రాయటమా?

రమ గారి చిన్న సందేహం చూసి ఇది ‘రా’యాలన్పించింది
డా|| మృణాలిని గారి పుస్తకం లో ఓ జోకు ఉంటుంది. ఓ కవిగారు నలుగురితో మాట్లాడుతూ, ఉండండి, తలకు నూనె వ్రాసుకొని వస్తాను అని లోపలకు వెళ్లబోయారుట. వెంటనే పక్కనాయన అవునవును కవిగారు తలకి నూనె వ్రాసుకుంటారు, కవితలేమో రాసుకుంటారు అన్నాడట.

జోకు(ల్లాంటివి)

జోకు(ల్లాంటివి)

టీచర్: ఓరేయ్ నువ్వు లేచి నిలబడి A B C D చెప్పరా
కాన్వెంట్ కిడ్: B C D E …
టీచర్: అదేంటి రా A ఎగరకొట్టావు?

కాన్వెంట్ కిడ్: A అంటే పెద్దలకి మాత్రమే సార్, మీరు చెబితే చాలు, మేం చెప్పక్కర్లేదు.

******

మొదటి వ్యక్తి: బాగున్నాయండీ, మీ అమ్మాయిల పేర్లు, అనిత, వనిత అని ..
రెండో వ్యక్తి: అబ్బో, ఆ పేర్ల వెనక పెద్ద కధే ఉందిలెండి.
మొదటి వ్యక్తి: ఏమిటో చెప్పండి.
రెండో వ్యక్తి: మేము పిల్లల్ని కనాలని ని నిర్ణయించుకున్న రువాత పుట్టింది, పెద్దది, దాని పేరు అనిత. ఇక రెండోది వనిత, ద్దని నిర్ణయించుకున్న రువాత పుట్టింది ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలో నేను నా భార్యా తేల్చుకునే లోపే. ఇక మూడోది దాని పేరు కునిత.
మొదటి వ్యక్తి: అదేంపేరండి?
రెండో వ్యక్తి: కు. ని. ర్వాత పుట్టింది మరి, ఏంచెయ్యమంటారు.

కడుపున ఉన్నదీ…

ఈ పేరడీ ఎక్కడో చూశాను.

హెచ్చరిక: అన్నం తినగానే చదవద్దు.
*********
కడుపున ఉన్నదీ కక్కాలనున్నదీ డోకులురావేఎలా
పొద్దునతిన్నదీ ఓ మంచిపచ్చడీ బయటకుపోతేఎలా
అతడిని చూస్తే ఠక్కున తెమిలిపోయే వికారం ఆపేదెలా
ఎదురుగ వస్తే ముక్కుకుచేరిపోయే కోపం నిలిపేదెలా
ఒకసారి నిలదీసి వాడి గొడవేమిటో తేల్చకపోతే ఎలా

చెంత ఐసున్న వెచ్చగ‍ఉందని
ఎంత A.Cఉన్న తెలియగలేదని
తననే తిట్టుకొనేవేళలో
తను అంటేనే తగని రోతని
లేతగుండెల్లో ఱంపపుకోతని
బొత్తిగాతెలుసుకోలేనివాడితో
కనబడుతోందా నాపీడైన నీకు నాఎదరోత అని అడగాలనీ
ఊపుకుంటూ నాచుట్టూ ఇకతిరగద్దనీ తెలుపకపోతే ఎలా ||కడుపున||

నీకన్నుల్లో ఆతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే జడుసుకునే వేళలో
మూసుకున్నావా కొంతేసేపని
పీడకలల్లో ఊరేగుతాడనీ
కనులే తెరుచుకునే రేయిలో
వినబడుతోందా నా పీడైన నీకు నా శోకపురాగం అని అడగాలనీ
పగలేదే, రేయేదో, ఎరుకేలేదని తెలుపకపోతే యెలా ||కడుపున||

తెఱచి రాజు

“తెఱచి రాజు” అని చూసి, ఎవరిదో పేరు, ఇంటి పేరు తెఱచి వ్యక్తి పేరు రాజు అనుకునే రోజులేమో. అలాంటి వాళ్లందరూ కూడ ఇప్పుడు “రాజు తెఱచి” లయ్యారు కాబట్టి, ఇదేదో ముసలి వ్యవహారం అని దాటవేయావచ్చు. తెఱచి రాజు అనేది చదరంగపు ఆట కు సంబంధించిన మాట. ఏదైనా బలగాన్ని కదిపి , అలా కదపటం తో వేరే బలగంతో ‘రాజు’ చెప్తే దానిని తెఱచి రాజు అంటారు. దీనికి ఆంగ్లభాషాసమర్ధకం Discovered Check ట. ఈ పదాన్ని ఒకప్పుడు విరివిగా వాడేవారనుకుంటా. ఈ పేరుతో నవలో కధో కూడా ఉన్నట్టు గుర్తు. ఒక వ్యక్తి తనపని తనుచేసుకుపోతూ, పనిలో పని ఎదుటి వాళ్లని ఇబ్బంది పెడితే ఇది వాడేవాళ్లు(?). ఇప్పుడెందుకిదంతా అంటారా? ఈ మాట వాడకపోయినా, కార్యాలయాలలో చాలామందిచేసేది ఇది కాదుటండీ?

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -కొనసాగింపు

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -కొనసాగింపు

ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టిన రెండో రోజు, రెండిటప్పుడు , ఇద్దరి మిత్రులతో కలిసి లంచ్ కి వెళ్తూ, దారిలో కనిపించిన సీరియస్గా పనిచేసుకుంటున్న ఓ అమ్మాయిని “మిస్ కారేజా” అని అడిగా…ఆ అమ్మాయిని దాటి కొంచం ముందుకువెళ్లగానే పక్కవాడు అందుకున్నాడు..

పక్కవాడు : ఏంట్రా, ఆ అమ్మాయిని ఏంటి అడిగావ్?
నేను: మిస్ కారేజా అని అడిగాను.
పక్కవాడు : అది విన్నాను గాని, అంటే అర్దం ఏంట్రా?
నేను : ఏదోలే బాబూ, కారేజి తెచ్చుకుందా అని అడిగాను.
పక్కవాడు: ఓ, అదా, నేను ‘కన్యా గర్భమా?’ అని అడిగావనుకున్నా!
రెండోవాడు: ‘కన్యా గర్భమా?’ ఏంట్రా? వాడు గర్భం పోయిందా అని అడిగితే!!

నాకు తెలియకుండా ఇంగ్లీషు లో ఇన్ని శ్లేషలు మాట్లాడుతున్నందుకు నాకు ఆనందపడాలో, ఏడవాలో తెలియలేదు.

        *************************

రెండు మూడు వారలక్రితం,ఓ శుక్రవారం సాయంత్రం colleague (ఇది కొలీగా?కలీగా?)వచ్చి B.R ఇవాళ చేయనా మండే చేయనా అని అదిగాడు.
నేను చెప్పాను:
If you do B.R today BR today, you want B.R monday B.R monday ,అతనికేమర్ధమయ్యిందో నాకర్ధం కాలేదు కానీయండి, ఆయన O.K అని వెళ్లిపోయాడు.