Monthly Archives: ఆగస్ట్ 2008

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౩

అమ్మ: పుస్తకాలమీద ఎక్కితొక్కుతావేరా, చదువు రాదు, సరస్వతీ దేవి శపిస్తుంది
నాన్న: శపిస్తే ఏళ్లతరబడి ఈనాడు పుస్తకాలు కొని-చదవనందుకు నన్ను, వాటినన్నిటినీ మెట్టులాగా షోకేసు బొమ్మలందేటట్టు పెట్టిన నిన్ను శపించాలిగాని వాడినెందుకు శపించటం?

అమ్మ: □ □ □ □ □ □□

నాన్న: ▫■▫□▪□▪□▪□

అమ్మ □ □ □ □ □ □□ □ □ □ □ □ □□□ □ □ □ □ □□
 నాన్న: ▫■▫□▪□▪□▪□■□■□■
అమ్మ:   □ □ □ □ □ □□□ □ □ □ □ □□
 నాన్న:  ■■■▫■▫□▪□▪□▪□■□■□■□■□■□■□■□■□■□■
అబ్బాయి : నేను బొమ్మతీసుకొని దిగాను గాని, మీరింకా ఆపుతారా?

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౨

గురువారం రాత్రి:
అబ్బాయి : ఎంటి నాన్న తొందరగా వచ్చి నిద్రబుచ్చుతాననిచెప్పి ఇవాళ కూడా లేట్ గా వచ్చావు?

(అవసరానికో అబద్ధం ఆడే) నాన్న
:  పెందరాడే వద్దామనుకున్నా, వస్తుంటే పని ఉందని కారుణ్యా అంకుల్ ఆపేశాడు, అందుకని లేట్ అయ్యింది

***

శుక్రవారం ఉదయం
అమ్మ: ఏమండి,లేవండీ మీకు కారుణ్య ఫోన్
అబ్బాయి : ఉండు నేను మాట్టాడతా

అబ్బాయి : హలో, రాత్రి మా నాన్నని అంతసేపు ఆఫీస్ లో ఎందుకట్టేపెట్టా? తొందరగా వచ్చి బబ్బోపెడతానన్నాడు, రాలేదు పెట్టాలేదు..
కారుణ్య: ???
అమ్మ, నాన్న :?????

రొమాన్స్ కోసం వెతుకులాట -2

విపుల వారు మళ్లీ రొమాంటిక్ స్పెషల్ ప్రకటించారు. చదవండి.
ఒక దొంగతనం.ఒక ఆత్మహత్య, ఒక బ్లాక్మైలు…నేను ఇప్పుడు “రొమాన్సు” అనే పదానికి అర్ధం వెతుక్కుంటున్నాను….
నాటకీయ ముగింపు ని, ఏడో తరగతి చదివే పిల్లవాడిని “ఆ అమ్మాయిని ప్రేమించావా” అని అడిగే పాత్రని మినహాయిస్తే “నేను- నా కీటికీ” – కధ నాకు నచ్చింది.