చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా

గోపిక-1:
హారనులేనికారువలె, హస్తికి దంతము లేనిరీతినన్
చీరెకు అంచులేనటుల, జీరలు కల్గని వ్యాఘ్రమోయనన్
ధారుణి ఖ్యాతినొందనగు, దాపరికమ్మొకొ, ఏమియా  
దారములేని హారము, నితంబిని, నీకెటులొచ్చె జెప్పవే?
గోపిక-2:
మేరువు పండితోత్తముల, మేటికవీశులమధ్య, తా.ల.బా, 
పేరుకుతగ్గరీతిమన పెద్దన యల్లిక సౌరునిచ్చె,రా   
నారెయు,రామకృష్ణ,గిరి, నవ్యకవుల్  శుభలగ్నమందునే
తీరుగ జేరికట్టిరిదొ, దివ్యకదంబము పద్యమాలికన్,  
దారములేనిహారమని,తానిడె కాన్కగ కొత్తపాళియే!
గోపిక-1:
కరవదినవ్యయుగమునన్,
అరదుగగనగలుగువీధి యంగడి యందున్
వరమే? అణాకు తూగని
సరుకే దెచ్చికొని చెలియ, సంతస మేలా?

గోపిక-2:
కప్పుర గంధము ఓలెన్
అప్పసిడితొడవులమెరయు అందము లాగున్,
అప్పారిజాతమువలెను
ఇప్పద్యమునిత్యనూత్నమింతీ! మఱియున్ –    

సురపురనందనైకవరశోభితసుందరశ్వేత,గంధశ్రీ
విరితరుశాఖనే భువికివేడుకదెచ్చినరీతి; జాలమున్ 
అరయగకొత్తపాళివరుడంటునుద్రొక్కగ పద్యశైలికే
స్థిరముగబూనికొన్నదనశిష్యులె పాదునుజేసి నీరిడన్
చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా!

8 responses to “చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా

  1. అణాకు తూగని సరుకా..? హన్నా ఎంత మాట..?? పదహారణాల సరుకైతే..!!
    చాలా బాగున్నాయి ఫన్‌డితోత్తమా..!!

  2. కరుణను పండితోత్తములు గారవమొప్పగ బిల్చినారుగా
    చిరుకవులన్ మమున్ కవిత జెప్పగ, మేమును సంతసమ్ముతో
    విరివిగ జెప్పుకొంటిమి కవిత్వము, మెచ్చిరి పెద్దలందరున్
    చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాయదే!

  3. బ్రహ్మాండంగా చెప్పారండీ!
    చివరి చంపకం మొదటి పాదమంతా విస్తరించిన సమాసం సెబాసో సెబాసు.

  4. కొత్తపాళీ గారు,
    ధన్యోస్మి.
    మురళి గారు,తెరెస గారు,రమణి గారు,అరిపిరాల గారు,
    నెనర్లు
    చంద్రమోహన్ గారు,
    పద్యం బాగా వచ్చింది.మీరు కూడా గిరి గారిలా వేగం గా రాస్తున్నారు ….ఇలాగే కొనసాగించండి.

    అరిపిరాల గారు,
    పదహారణాలనే కవి భావం కూడా..
    అందుకే ప్రత్యుత్తరం గా పలికిన పద్యం లో “వీధి యంగడి”, ” అణాకు తూగని” లాంటి నేలబారు పోలికలు కాకుండా, ఉత్తమమైన వస్తువులతో పోలిక.

  5. అరిపిరాలగారన్నట్లు ఫన్‌డితోత్తములు మీరు! 🙂
    ఈ పద్యాల శ్రోతలకు కాస్త నేపథ్యం. మీరు అనుమతించాలని మనవి.

వ్యాఖ్యానించండి