Monthly Archives: డిసెంబర్ 2021

తప్పటడుగులు

నాల్గవ తరగతిలోనో అనుకుంటా రేఖాగణితం నేర్పటం మొదలు పెట్టేవారు. ఐదవ తరగతి లెక్కలకి జ్యామెట్రీ బాక్స్ ( జామెంట్రీ బాక్స్ అనేవాళ్ళం) కావాలి. ఎవరికైనా కొత్త జామెంట్రీ బాక్స్ కొనిపెడితే ఎంత ఆందపడేవాళ్ళంటే . ఈ రోజుల్లో కుర్రకారు కి వాళ్ళ అమ్మానాన్నల్లు కొత్త బజాజ్ పల్సర్ కొనిపెట్టినా అంత ఆనందం పొందరు. ఇక ఆ కొనే జామెంట్రీ బాక్స్ కామిలిన్ ఐతే – ఆ బాక్స్ సొంతదారు ఆనందం మాటల్లో వర్ణించలేం..
అందులో ఓ ఉపకరిణి ఉంటుంది – కోణములు కొలిచి – త్రిభూజాలో మరొకటో గీయటానికి. దానికి – మా పిల్లల మధ్య లో పేరు – “D-కోణం” .
ఒకటి రెండు రోజులు బడి మానేసి – తిరిగి వెళ్ళిన తరువాత – పక్కవాడు చెప్పాడు – ఒరేయ్ – దాని పేరు “D-కోణం” కాదురా.. కోణమాలిని మొన్ననే మాష్టారు చెప్పారు అని.
మర్నాడు “అవుటు బెల్లు” తరువాత, లెక్కల తరగతి మొదలవ బోతుంటే నేను ఇంటికి పరిగెత్తటం మొదలు పెట్టాను.. క్లాసు దాటీ దాటంగానే ఎదురైన లెక్కల మాష్టారు ఏంట్రా ఎక్కడికి పోతున్నావ్ అన్నారు.
కోణమాలిని ఇంటి దగ్గర మర్చిపోయాను తెచ్చుకుంటానండీ అన్నాను భయభయంగా.

ఆయన గట్టిగా నవ్వి – కోణమాలిని హేమమాలిని కాదురా … కోణమానిని – ఏదీ మళ్ళా అను.. అన్నారు.

***********************************************

ఆ రోజుల్లో చాలా బాగా ప్రసిద్ధి కెక్కిన పాట ఒకటి ఉండేది
నీతి నిప్పులు ఆరు, నీ కోపం ఎప్పుడు తీరు అని.

ఇక్కడ ఆరు అంటే క్రియావాచకమని తెలియదు. సంఖ్యా వాచకమనే అనుకొనే వాడిని.. ఏనుగు కి నాలుగు కాళ్ళు, కుమారస్వామికి ఆరుముఖాలు లాగా, నీతి ఆరు నిప్పులుంటాయి అనుకొనే వాడిని .

 

——————————————————-
బాదరాయణ లంకెలు ::
తప్పటడుగులు

ఎక్కాలు గుణింతాలు ఎలా