Monthly Archives: నవంబర్ 2008

౫-౭-౫ లేక కు(హనా)హైకూ

ఒక్క వాక్యాన్ని
మూడు ముక్కలు చేస్తే
అదే కు హైకూ
[నాల్గో ముక్క చేస్తే అకాణానీ]

క్లుప్తత గోరి
నేను పరిశ్రమిస్తే-
భావ శూన్యత

భావం పెదవి
దాటకే -అక్షరాలు
లెక్కదాటాయి

తెనుగు హైకూ
ఛాందసవాదుల
విదేశీ మోజు

సకల ఛందో
ప్రక్రియానుగతమీ
ఊక దంపుడు
——————

దిగులు కాకి
మామ రావటం జూసి
తుర్రు మన్నది

మాటలలలు
మ్రింగే బంధు సాగరం
ఇద్దరి మధ్యా.

ఒకటే మాట
నీనోట- మనసుకి
మాయని గాయం

1) అరువు బాణీ
ఉక్కుచట్రంలో సినీ
తెలుగు పాట

2) హిందీ గొంతుల
అంపశయ్యపై సినీ
  తెలుగు పాట

బండి మురికి
వానకి వదిలింది-
తలపై హెల్మెట్