Monthly Archives: డిసెంబర్ 2009

అమ్మ,నాన్న, ఓ ర్యాంకులొచ్చేఅబ్బాయి

 అమ్మ :  ఏమండి, ఎలాగూ ఇక్కడదాకా వచ్చాంగా , అవస్థలపురం లో మా పెద్దమ్మ కూతురుంది వెళ్దామండి.

నాన్న:  వద్దు, ఇంటి దగ్గఱ పిల్లాడు ఒక్కడే ఉన్నాడు, వెళ్దాం.

 అమ్మ :  మళ్లీ ఇక్కడ దాకా ఎప్పుడొస్తామో ఏమో, ఎక్కువసేపు వద్దు , రెండే నిమిషాలూ కూర్చొనివెళ్దామండి.

నాన్న:  వాడు ఒక్కడే ఉంటే టి.వీ చూస్తూ కూచుంటాడు,నా మాట విని ఇంటికి వెళ్దాం పద.

అమ్మ:  చదువుకుంటాని అని చెప్పాడండి, ఐనా టి.వి లాక్ చేసి వచ్చాను,  న్యూస్ ఛానల్స్ తప్ప ఏవీ రావు.

నాన్న: పిచ్చిదాన, అవి చాలవూ?!

అద్భుత అవకాశం

 

ఇలా మీ ఖరీదైన కారుని హై.మ.పా.సం చెత్తకుండి పక్క నిలుపుకోవటానికి, రెండుగంటలకి కేవలం పది రూపాయలే.
మీది ద్విచక్రవాహనమైతే కేవలం 5 రూపాయలే.
త్వరపడండి, అసలే ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉంది. మళ్లా,కొత్త సంవత్సరం కానుకగా, ప్రభుత్వం రుసుము పెంచే ప్రమాదం లేకపోలేదు.

[ఇక్కడ వాహనాలు నిలుపుకోనివ్వటం ద్వారా,  హై.మ.పా.సం  ఆర్జించే ఆదాయం సంవత్సరానికి 13 లక్షల పైమాట అని విశ్వసనీయ వర్గాల భోగట్టా.]

ఆ…!

నిశ్శబ్దంగా
నిరాహారదీక్షమానేస్తే
నిర్దాక్షిణ్యంగా వీరు-

నిరాహారంగా
నీరో రాజును కుదిపేస్తే
నిబిడాశ్చర్యంతో వీరే…