Monthly Archives: జూన్ 2012

ఐదు కధలు

విపుల జూన్ సంచిక లో ప్రచురితమైన స్వాతి శ్రీపాద గారి లేని ఆకాశానికి నిచ్చెన కధ – మీతో ‘ఈ నాటి కధ ఇంటింటి కధ కానేకాదు కట్టుకధ’ అనిపిస్తుందేమో ఓ సారి చూడండి.

అలానే రామలక్ష్మి గారి నాయనమ్మ కధలు కూడా చూడండి.

గతం లో కధాజగత్ వారు కధావిశ్లేషణలడిగినప్పుడు, రాయలేదు గానీయండి, రాయటానికి నేను ఎంచుకొనిన కధలలో ఈ మూడూ ఉన్నాయి, మీకేమైనా నచ్చుతాయేమో చూడండి.

1) విహారి గారి బతకనివ్వండి
2) జి.ఎస్.లక్ష్మి గారి ఒఖ్ఖ రెండు రూపాయలు
3) ఎ.ఎన్.జగన్నాథశర్మ గారి నాన్నంటే