Monthly Archives: జూలై 2010

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

నేపధ్యం:

 సమస్య
నా పద్యం:

పదవీ విరమణ చేసిన వృద్ధుడు, తన భార్యతో,భోజనానికి కూర్చుంటూ:

చచ్చులు పుచ్చులు కూడా

లచ్చిమి!కొనలేకనుంటి; లావా నలమై

 చిచ్చరబుట్ట జఠరమున

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

[సామాన్యంగా వారి బ్లాగులోనే జవాబు ఇచ్చేవాడిని కానీయండీ, ఈ పద్యంలో లావానలమని అపభ్రంశం ఉండటంతో అక్కడ జూపలేదు. ]

అనూరులు

 గిరిగారు చెప్పినట్టు బెంగ లేకుండా ఉండటానికని, విశ్వనాధుని గెలుపు తరువాత కూడా చదరంగ సమాచారం కోసం చూస్తుంటే ఈ లంకె దొరికింది. ఇతగాడిని గూర్చి నాలుగు ముక్కలు రాద్దామనుకున్నాను గానీయండి కుదరలేదు. ఇవేళ మళ్లా కామేశ్వర రావు గారి బ్లాగులో అనూరుడి ప్రస్తావన తో తిరిగి ఈ విషయం గుర్తొచ్చి – రాద్దమని వస్తే కూడలి లో చక్రవర్తి గారి టపా కనిపించింది.
శిశిర గారి బ్లాగు లో ఇటువంటిదే మరో కధ.