Monthly Archives: ఆగస్ట్ 2009

ఏళ్లు – మైలు రాళ్లు

త రెండేళ్ల లో హిందూ మతానికీ జరిగిన ఆవగింజంతా మేలైన ఉంటే, ఆ మేలు గురించి చెప్పుకోవటం జరిగితే వాటిలో భక్తి టి.వి తప్పక ఉండదగినది.
నిన్న రెండేళ్లు పూర్తి చేసుకున్న భక్తి టి.వి కి శుభాకాంక్షలు.

షా కిరణ్ మూవీస్ సంస్థకు పాతికేళ్లు.
శ్రీవారికి ప్రేమలేఖ. ప్రతిఘటన. మయూరి. కోట. శ్రీకాంత్.
ఉషా కిరణ్ మూవీస్ వారికి నా శుభాకాంక్షలు.

నెల లోనే 10వ తేదీన ఈనాడు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంది. తెలుగు చదవటం వచ్చి, ఈనాడు దినపత్రిక “అస్సలు” చదవని తెలుగువాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈనాడు వారికి శుభాభినందనలు. ఈ దినపత్రిక కొన్నివందల ఏండ్లు నడచు గాక.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా మొదటి సారి ప్రమాణస్వీకారం చేసినది సెప్టెంబర్ 1న. రేపటికి పుష్కరం పైన రెండు సంవత్సరాలు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారలను మెప్పించిన, ప్రధాని పదవి లో ఎవరు ఉండాలి అనే విషయం లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన, ఎక్కువకాలం ముఖ్య మంత్రిగా కొనసాగిన గుర్తింపు కలిగిన దశనుండి, హత్యాయత్నము, పదవీచ్యుతి, నిన్న మొన్న రాజకీయాలలోకి వచ్చిన వారితో శాసనసభలోనూ – వాంప్ కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ వంటి వారలతో బయటా మాటలనిపించుకొనే స్థితి -విధివిలాసమంటే ఇదేనేమో.
క, బ్లాగ్లోకం లో- గురుతుల్యులు, నిత్య యవ్వనులు శ్రీ చింతారామకృష్ణ గారి ఆంధ్రామృతం బ్లాగు ప్రధమ వార్షికోత్సవాన్ని దిగ్విజయం గా పూర్తిచేసుకుంది.

ప్రకటనలు

మనవి

గత కొన్ని వారాలలో నా బ్లాగు నందు కొన్ని వ్యాఖ్యలు WordPress వారి పుణ్యమా అని, నా ప్రమేయం లేకుండానే చెత్తగా గుర్తింపబడి తొలగింపబడ్డాయి. నేను ఏ వ్యాఖ్యనూ తొలగించలేదని, మీ వ్యాఖ్య కనపడకపోతే అది WP వారి పనే అనీ సుహృదయులై బ్లాగ్మిత్రులకు మనవి చేసుకుంటున్నాను. ( చంద్రబాబు లాగా కాదు, నా లాగానే)

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౮

 

మొన్న సాయంత్రం ఓ బ్లాగ్మిత్రుడితో మాట్లాడి, పనిలో పనిగా చాలా రోజులైందని మా రామలింగం ఇంటికి వెళ్ళాను, చెప్పాపెట్ట కుండా.

“ఏమిట్రా ఊడి పడ్డావ్” అన్నాడు

“ఉద్యోగం ఊడి పడ్డాను రా “అన్నాను

“పోన్లే పోతే పోయిందిలే” అన్నాడు రానారె అంత దిలాసా గా.

” పోయింది నాది కాకపోతే నేనూ అదే అనేవాడిని”

“ఇప్పుడేమిటంటావ్” 

“ఏదైనా ఉద్యోగం చూపించు”

” నేను ఏదో ఇంగ్లీషు పాఠాలు చెప్పుకుంటున్నవాడిని మీ ఉద్యోగాలసంగతి నాకేంతెలుసు” అన్నాడు “తెలీవని నాకుతెలుసులే కానీ పొరపాటున తెలిస్తే చెప్పు”అని.. ఈ మంతెన సత్యనారయణ గారి మాహా శిష్యుడి దగ్గర ఆ టైం లో కాఫీ నీళ్లు కూడా గిట్టుబాటుకావని లేచి వచ్చేశాను.

రాత్రి పెందరాడె పదకొండు గంటలకి ఇంటికి చేరి, స్నానపానాదులు ముగించి నిద్రపోవాలి కాబట్టి, టి.వి చూడకపోతే నిద్ర పట్టదేమో అని భయం తో టి.వి పెట్టి రిమోట్ కి పనిచెప్పాను అలా పాయలను తిప్పుతూ తిప్పుతూ, ఉవిదా టివి వద్ద ఆగాను – సులభాంగ్లమ్ అనే కార్యక్రమం మీద. ఓ ఐదు నిముషాలు చూసి ఉద్విగ్నత తట్టుకోలేక – మా రామలింగానికి పోన్ చేశాను

రా.లిం: ఓరె నీ ఉద్యోగం పోయిందని గుర్తు ఉంది,  వీలైతే ఉద్యోగం చూపించాలని గుర్తుంది, ఈ టైమ్ లో పెళ్లినవాడిని బాధించటం న్యాయం కాదురా, స్వాతిముత్యం లో కమల్ హాసన్ లాగా.

 నేను: ఆగాగు, నే ఫోన్ చేసింది నా ఉద్యోగం గురించి కాదు, నీ ఉద్యోగం పోవచ్చు అని చెప్పటానికి రా.లిం:ఎందుకుట

నేను: టి.వి లో సులభాంగ్లం అని ఓ కార్యక్రమం వస్తోంది

 రా.లిం:సులభాంగ్లమా సులభ్ కాంప్లెక్స్ ఆంగ్లమా?

నేను:ముందు శులభ్ నేర్పి తర్వాత కాంప్లెక్స్ నేర్పుతారేమో

రా.లిం:ఐతే ఏమిటిటా?

నేను: ఓరి అమాయకుడా, ఆకలిరాజ్యం లో కమల్ హసన్ అంత అందగాడు ముగ్గురు యాంకరమ్మలని కూర్చోబెట్టుకొని, టి.విలో ఉచితం గా ఆంగ్లం నేర్పుతుంటే ఇంక నీదగ్గరకొచ్చి డబ్బులు కట్టి ఎవడు నేర్చుకుంటాడు చెప్పు?

రా.లిం:ఇంగ్లీషా, ఏమి నేర్పుతున్నాడు ఏమిటి

నేను:చేంజ్ థ వాయిస్

రా.లిం: ఇందాకటి నుంచి “a object” “a object” అంటున్నాడ?

నేను:అవును

రా.లిం: సరే మరి, ఆయన యాంకరమ్మలు మాట్లాడే విషయాన్ని బట్టి గొంతు ఎట్టా మార్చుకోవాలో నేర్పూతూ ఉండి ఉంటాడు, ఇంగ్లిషు గ్రామర్ కాదులే .. నువ్వేమీ భయపడక

నేను:అంతే నంటావా?

రా.లిం: అంతే, స్పోకెన్ ఇంగ్లీషు నేర్పేవాడికి ఆంధ్రదేశం లో ఢోకా లేదు.

నేను:అంతే నంటావా?

రా.లిం: అంతే, కాదు కూడదు భయపడాల్సిందే అంటే, పగటి వేళ భయపడరా బాబు, ఇలా రిపీట్ టెలికాష్ట్ చూస్తూ భయపడమాక.ఇంక నువ్వు కూడా టివీ కట్టేసి పడుకో.

 వాడి మాట ప్రకారం టి.వి కట్టేసి, రిమోట్ ని టి.వి మీద పెడుతూంటే అక్కడ మా ఆవిడ వ్రాసి పెట్టిన చీటీ కనిపించింది. VCD పైన అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాను, టి.వి చూడడం ఐపోయిన తరువాత, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సంతకం చేయండి. ఇంగ్లీషు మార్కులు ఒక్కసారి చూడండి.

వాడి ఇంగ్లీషు మార్కుల మీద నాకు ఎటువంటి ఆశలు లేవు. ఎందుకంటే, వాడి ఇంగ్లీషు పరీక్ష రోజు, బడి దగ్గర దింపుతుంటే, ప్రిన్సుపాలిని ( అనగా నమ్రత కాదు) అరుపులు వినిపించాయి:

 What did I said?

 What did I said?

 I told you that you should woke up early morning at least in exam days naa…

సరే మాఆవిడ చెప్పింది కదా చూద్దమని ఫైల్ తీసుకున్న నాకు, ఆ బడి వారు ప్రత్యేకంగా ముద్రించిన ఫైలే చెప్పింది

fname

 అనవసరంగా ఇంగ్లీషు మార్కులు చూడకు అని.

రొమాన్స్ కోసం వెతుకులాట -3

విపుల వారు మళ్లీ రొమాంటిక్ స్పెషల్ ప్రకటించారు.

2008, 2007 కన్నా ఈసారి కధలు మెరుగు.చదవండి.