Monthly Archives: ఆగస్ట్ 2011

ఇదియె శృంగారమండ్రునేనెరుకచేయఁ

విపుల వారు “Romantic Special” ప్రచురించారు. ఇది ప్రతి సంవత్సరమూ ఉన్నదే గానీయండి, ఈ సారి వారికి కూడా మనసు పద్యం మీదకి పోయింది. రసరాజం శృంగారమ్ అని వ్యాసానికి పేరు పెట్టారు. “శృంగార తరంగమని” కూడా కనిపించింది, ఈ శీర్షికతో నెలకొక వ్యాసం అందిస్తున్నారేమో, అందు ఈ నెల వ్యాసం “రసరాజం శృంగార” మేమో తెలియదు. అదే ఐతే సంతోషించవలసిందే. వ్యాసకర్త పేరు నాకు తోచలేదుకానీయండి, “కేవలం కామోద్రేకం శృంగారం కాదు” [రామాయణంలో పిడకలవేట: ఈ వాక్యం లో కేవలమనే మాట అవసరమంటారా?] అని మొదలునే చెప్పి కొన్ని పద్యాలు ఇచ్చారు. శ్రీనాధ కవి, తెనాలి రామకృష్ణ కవుల చాటువులు, ఇంకా కవికర్ణరసాయనము,నైషధము,విజయవిలాసము, గాధాసప్తశతి నుంచి ఉటంకించారు. పట్టుమని పది పద్యాలు. ఐతేనేం ఈ విడతకు చాలు.నా బోట్లకు సులువుగా ఉంటుందని – ప్రతి పద్యానికీ భావం కూడా ఇచ్చారు. మెచ్చవలసిన ప్రయత్నం. విపులవారు అభినందనీయులు.

ప్రకటనలు

రొమాన్స్ కోసం వెతుకులాట – ౪

ఈ రొమాన్సు నందలి రహస్యమేమి, అది యెట్టిది అని తెలుకొనవలెన్న కౌతూహలము బహుశః యవ్వనపు తొలినాండ్లయందునుదయించెను. దీని గురించి నెరుంగవలెనని పలుమార్లు ఆలోచన చేయుటవల్ల దినములు జరుగుచునుండ, ఇదియే నా మనోయోచనావరణమున నిండి నర్తింపసాగెను. ఇది ఏమి? భౌతికమా లేక మానసికమా.. కృతమా కాక శ్రుతమా .. కేవలము పౌరుషేయమా? స్త్రీ ఋషేయమునున్నా? ఇట్టి సమాధనమెరుంగని ఎన్నియో ప్రశ్నలు పదే పదే మానసమునజొప్ప నేను స్థిమితము గాననైతిని. ఒకరిద్దఱు ప్రియమిత్రుల సమక్షమున ఆదినములనందున నా వేదన,ఘర్షణ వెళ్లబెట్టుకొనియుంటిని. వారు స్థిమితపడమనియున్నూ, నిదానము మీద బోధపడగలదనియున్నూ..ఊరడించియుండిరి. ఇంకనూ ఈ విషయజ్ఞానమేరికి నేరీతినెప్పుడలవడునో చెప్పనసాధ్యమనియూ, భవిష్యత్తునందునొకానొక సుముహూర్తమునందున నాకునూ వెతుకబోయినతీవకాలినితగిలినభంగి గోచరము కాలగలదనియునూ ఆశాప్రియత్వమున పలికియుండిరి.

దినములట్లుగడచుచుండ, నా కాళ్లపైనేను నిలబడవలయునని మిత్రులు హెచ్చరించుటవలనను, నిలబడకనుంటినని పెద్దలు మందలించుటచేతనూ యుదరపోషణార్ధమై నగరపుబాట పట్టితిని. ( ఇది ఏ ప్రభుత్వపధకమూ కాదని పాఠకులు గుర్తెరుంగవలయును). చిన్నదైన యుద్యోగము దొరకబట్టుకొని అందు నిమిత్తము వ్యస్తుడనైయుంట కొంతకాలమునకే ఈ రోమాన్సు సంగతినీ మరచితిని. దానిని గూర్చి కూలంకషముగా తెలుసుకొనవలెనన్న నా ఆసక్తియూ తనకుదానుగా కృశింపదొడగెను.

అడవతడవ గప్తికొచ్చిననూ, గతమునందువలె మదినిల్చి నాక్రమించజాలదయ్యను. అట్టి క్షణమున నేనునూ తెలుసుకొనెడి వీలుయున్నచో తెలుసుకొనెదను గాక, తెలయవలసిన దినమునకునదియే అవగతమౌనుగాక అని అనుకొనెడివాడను.

అంతట, కొన్నినాండ్లకు, కొలువునందలి సహోద్యోగి నాకు జగజ్జాలమును పరిచయము సలిపెను. ఇది సకల విజ్ఞానసారమనియూ, విశ్వదర్పణమనియూ, గ్రంధాలయ ప్రవేశద్వారమనియూ, చింతామణి యనియునూ ఇట్లు పలుతెఱంగుల జెప్పను. ఈ జగజ్జాలమును గూర్చినెరిగిన పిదప మరల జిగీష మనమున జృంభింపసాగెను. ఇంతటి సమున్నత ఆధునికోపకరణి చేతనుండగా సాధ్యము కానిదేమి, తెలుకొనెదను గాక, యని తలంచి మరల ఈ రొమాన్సు కొఱకు నెమకుటనారంభించితిని.
కొన్ని వనరులు లభ్యమైనపట్టికినీ నాకీ పదార్ధము మిధ్యగనే మిగిలెను. అంతట జాలమునందునే విపులవారి పుటకన్పట్టెను. వీరు సహృదయులు. వర్షమునకొకమారు “Romantic Special” ప్రకటిమ్చి నా వంటి వారలకు రొమాన్సునెరింగింపజూతురు. ఈ పత్రిక నుండి కూడ ఈ రొమాన్సును అధ్యయనము చేయుటకు గతమునందు ప్రయత్నించిననూ ఫలితము కాననైతిని. ఈ విధముగా రెండు సంవత్సరముల మున్ను వరకునూ ప్రయత్నించి, పట్టుబడెడి అవకాశము, విధమునూ తెలియక నా ప్రయత్నములను విరమించియుంటిని.

అంతయునూ పరమేశ్వరానుగ్రహము కదా.

ఇక ప్రస్తుతమున, ఇటీవల దినముల ఒక జిజ్ఙాసువు “రొమాన్సు” కొరకు వెతుకుచూ నా ఈ సాల్లెగూటికిజొచ్చెనని పదపుటచ్చు(WordPress) వాడు తెలిపియుండెను. మరల క్షణికోద్రేకమున నేను బడిబాటబట్టితిని.

ఈ పరి నా కలఫలించునేమో, నేను స్నాతకుడనౌదునేమోయని ఆశించితిని.
తెలసిన దారులను వెదకుట మానవ సహజ నైజము కదా.. మరల విపులవారిని ఆశ్రయించితిని.
విపుల

మొత్తము 15 నకు పైబడి కధలు ప్రచురించిరి. తెనుగు కధలు, అనువదింపబడిన కధలున్నూ. చదివితిని.

సంధ్యాసమయములో, ఇంకో ప్రేమకధ, శృంగార ఔషధం, వెన్నెలవాన,అతడు-ఆమె ఇత్యాది తెనుగుకధలందు కలవు.

మంత్రి-అభినేత్రి((మరాఠీ),స్పందన(అమెరికా),మధుర ప్రణయం(కన్నడ),విషకన్య(మలయాళ), గోడ(ఉత్కళ), అను కధలు కూడా చదివితిని.

నా ఆశ అడియాసగనే మిగిలెను. ఇన్ని కధలనూ చదివినపిమ్మట రొమాన్సు నాకందని ద్రాక్షయని ఎరింగితిని. ఇకనెప్పుడునూ దీనిని గూర్చి తెలుసుకొనవలెనను భ్రాంతి నాకు కలగరాదని సంకల్పము జేసితిని. కలగిననూ అట్టి యోచనను మొగ్గనందే త్రుంపెదననియూ నిశ్చయించుకొంటిని.

చిత్రవ్యధ

వాన నీటిని ఇలా మురుగు నీరు జేసి..

ఇలా టాంకర్లతో నీళ్లు కొనుక్కోవటం నాగరి’కత’.

శుభాకాంక్షలు!

అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!