Monthly Archives: సెప్టెంబర్ 2010

సమస్యాపూరణం -100

మూడేళ్ల క్రితం రాకేశ్వర్డుడికి చెబితే ఆశకు అంతు ఉండాలి అనే వారేమో.
రెండేళ్ల క్రితం రానారేకి చెబితే – సాలుకి రెండూ సభలు జరుకుంటే చాలేద్దూ అనేవారేమో
ఏడాది క్రితం మలక్పేట్ రౌడి తో అని ఉంటే – సమస్య లా కెలుకుడు సంఘం కామెంట్లా అని అడిగేవారేమో…

అంతెందుకు – ఓ వందరోజుల క్రితం మీరు నాతో చెప్పి ఉంటే.. నేనూ నమ్మేవాడిని కాను….

కానీ ….

ఇవేళే … కందిశంకరయ్య గారు తమ బ్లాగులో వందవ సమస్యని .. అవునండీ వందవ సమస్యని పూరణ కొరకై ప్రకటించారు.

వారికి మరొక్క మారు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అవిశ్రాంతంగా, ఆరోగ్యం సహకరించకున్నా , వేరే పనులు ఉన్నా ఉపేక్షించకుండా ప్రతి రోజూ సమస్యనో దత్తపది నో ఇచ్చారు. అవి కష్టం గా ఉండకుండ చూశారు. తమ మిత్రులు చెప్పిన పూరణలను – బ్లాగరుల కోసం తమ బ్లాగు లో ఉంచారు. శ్రద్ధగా తప్పులు చెప్పారు – మెరుగులు దిద్దారు.
ఈ తెలుగు అధ్యాపకులకు నా నమస్సులు.

అలానే, ఈ సాహితీ ప్రక్రియను బ్లాగ్లోకంలో సుప్రసిద్ధం గావించిన చింతారామకృష్ణారావు గారికి, డా.ఆచార్యఫణీంద్ర గారికీ, మురళీ మోహన్ గారికి, మలక్పేట్ రౌడీ గారికి, కామేశ్వరరావు గారికి, సుమిత్ర గారికి, యువకవులు రానారే, రాఘవ,శ్రీరాం గార్లకూ, కొత్తపాళీ గారికీ వినయ పూర్వక అభినందనలు.

పూరణలందించిన ప్రతి ఒక్కరికిన్నీ అభినందనలు.