Monthly Archives: జనవరి 2010

ఇదో ప్రయాస

చిరిగిన నోటులో తేదీని చూస్తున్నా
పాలముంత లో నెయ్యి ని వెతుకుతున్నా
ఎంతటి పిచ్చివాణ్ణి నేను…
కానీలేనివాడ్ని వడ్డీతో కట్టమంటున్నా!

ఐ.పీల ముంగిట్లో అసలును బేరమాడుతున్నా
బకాయిదారు ఇళ్లను నిన్ననేను వెతుకున్నా
పరుసేలేనిచోట నేను…
పయిసల సామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా!

పెరటిఇంటి ముందు కావలినై కాస్తున్నా
దొరికితె నాల్గు తగులించాలనుకుంటున్నా
జేబులు చిరిగిన చొక్కాలో నేను…
చిల్లరనాణాలకై అన్వేషిస్తున్నా!

సయికిలుంది తాళాన్ని తీయలేకనున్నా
నడి రాత్రములో నాకునై నేనున్నా
నడకని ఆశ్రయించిన నేను…
తన్నేటిఎగశ్వాసలో తెగరొప్పుతున్నా!

ప్రకటనలు

గుమ్మడీ!జోహార్!

అమ్మకచెల్ల! నట్టనడి యవ్వనమందునె పెద్దపాత్రలన్
నమ్మగలేనిరీతిని జనాళికి మోదము గూర్ప నాడియే
అమ్మహనీయ చిత్రతతి నద్దియె ఆరని కీర్తిగంధముల్,
గుమ్మడిపూలయందములు కోరియొసంగిన గుమ్మడీ!జొహార్!

విరోధి వత్సర మకర సంక్రాంతి

ఆ.  ఉత్తరాయణమున ఉత్తచేతులనేడు

       మొక్కుచుంటి మున్ను మోతుబరిని.

      పూటగడచు వీలు మాటకైననులేక

      దిగులు ముద్ద మింగి దిరుగు చుంటి  (1)

ఆ. అక్కచెల్లికినయి అమ్ముకొంటిని కొంత

    సొంత సంతు గూర్చి కొంత యమ్మి

    ఉండి గూడ లేక ఒక్కచెక్కనుకల్గి

     మిగిలితినిటులయ్యె మిగుల బండి. (2)

ఆ. కఱవు తప్పె ననియె కాస్త కుదుటపడ

     వరద వచ్చి పంట వమ్ము చేసె

     కుమిలి- వేచి యుంటి – కొడుకుపిలుపుగాదు

     కలుగ ముక్తి, పెద్ద పిలుపు కొఱకు (3)

ఆ. లోకబంధు వీవు రోదసి నందున

    లోకబంధు రైతు లోకులెదుటె

    ఏటి కొక్క రోజు ఎంచుచుందురునిన్ను

    మాకు నెపుడులేదు మన్న నింత  (4)

ఆ. నాదు దిగులు లేదు నాకునిపుడు గాని

     కలదు బాధ కర్షకాళి గూర్చి

    రైతు కేమిగలుగొ రాబోవు దినములా

    చూడ నేమి గలుగొ సూర్య నీకు!   (5)

————————————————————————–

 

బాదరాయణ లంకెలు:
మునుపొకమారు
భైరవభట్ల వారి బ్లాగులో ఇప్పుడు ,మునుపు .

 

కప్పుకోండి

ఏకాభిప్రాయ సాధనమనే

ఒంటిచేత్తో

సైద్ధాంతిక దిగంబరత్వాన్ని.

రచ్చల బడ్డ-

స్వార్ధ ప్రయోజనమనే నగ్నత్వాన్ని

చర్చల కర్చీఫు తో కప్పుకోండి.

[ ఎవడు పరీక్షిస్తాడులే

అని పందెంలో నిలబడి పరిగెత్తినట్లు

ఎన్నికలలో ఎవేవో చెప్పి

గెలిచో గెలవకో వచ్చి నిల్చున్నారా..

రివ్వున కొట్టిన ఒక్క గాలి వాన

దేవతా వస్త్రాలను సైతం విసిరేసి

చిదంబర రహస్యాలను బయట బెడుతుంటే

మానిఫెస్టో వెతుక్కోకండి-

మానేశారు ప్రకటించడమెపుడో.

జెండా కోసం ఎగబాకకండి-

అది ఎప్పుడో కొట్టుకు బోయింది

కాదంటే కాల్చేశాడెవడో.

అదేగాలి –

నా కళ్లగంతలనూ విసిరికొడితే

ఎదురుగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే

ఆశ్చర్యం-

అసహ్యమూ లేదు, జుగుప్సా లేదు

క్రోధమూ లేదు, ఏహ్యమూ లేదు

బలవంతపు బందులకు మల్లే

మీ చేతిలో మోసపోవడనికి కుడా

స్వఛ్చందంగా  అలవాటుపడి పోయినట్టున్నా!!

మళ్లీ మానిఫెస్టోల కోసం

జెండాలకోసం,

అజెండాలకోసం వెతక్కండి

చరిత్రపుటల మధ్య

మోకాళ్లల్లోతలెట్టుకొనికూర్చోండి

స్మృతులతో కరిగించుకుంటూ మౌనాన్నీ

నుతులతో కలిగించుకుంటూ అభిమానాన్నీ

ఇక మాకు వదిలి పెట్టండి రాజకీయాన్ని-

సరిదిత్తుతాం వర్తమానాన్ని

శాసిస్తాం భవితవ్యాన్ని]

నా లుంగీ కాకపోతే

తమనాడు విభజన ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలన్న వార్త నేపధ్యం లో

సుబ్బలష్షిమి: బావా! మేడ మీద ఆరేసిన ఈ లుంగీ చాలా పెద్దగా ఉంది, ఓ ముక్క చించి పిల్లవాడికి అంగీ కుట్టించనా

సుబ్బారావు: సరి

సుబ్బలష్షిమి: బావా! నిజంగా చాల పెద్దగా ఉంది, ఇంకో ముక్క చింపి వాడు హిందీ ప్రాధమిక ట్యూషన్ వేరే సంచి కావాలి, అన్నిపుస్తకాలతో పాటు పెట్టుకోను అంటున్నాడు ఓ సంచీ కుట్టించనా?

సుబ్బారావు: సరి

సుబ్బలష్షిమి: బావా!పిల్లాడు ఫాబ్రిక్ పైంటింగ్ నేర్చుకుంటున్నాడు కదా, చార్మినార్ బొమ్మేస్తాను, టవలీ అమ్మా అన్నాడు, ఇంకో ముక్క చింపి ఇస్తానే.

సుబ్బారావు: సరి

సుబ్బలష్షిమి: బావా, మెత్తగా ఉంది, నీ కళ్లద్దాలు తుడుచుకోవటనికి బావుంటుంది, ఇంకో ముక్కచింపుతా.

సుబ్బారావు: సరి

సుబ్బలష్షిమి: బావా ఎప్పుడూ , చిరుగులు పడ్డ లుంగీ చింపటానికి కూడా ఒప్పుకొనే వాడివి కావు, కుట్టి కట్టుకుంటా అనేవాడివి, అంతగా ఐతే చిరుగులు కనపడకుండ శాలువా లాగా కప్పుకుంటా అనేవాడివి, ఇవాలేంటి బావా ఇలా అంటున్నావు?

సుబ్బారావు: అది నా లుంగీ కాదు. ఇవాళ వెళ్లేటప్పుడు తీసుకెళ్లాలని మీ తమ్ముడు రాత్రి కష్టపడి ఆరేసుకున్న ధోతీ, మర్చిపోయి వెళ్లాడు.

సుబ్బలష్షిమి: ??!

—————————————–

అసలు టపా

మునుపొకసారి

మొదటిసారి