Monthly Archives: ఫిబ్రవరి 2009

నేర్పవయ్య నాకు సర్పభూష!

సీసము(?):

శిరమున నొప్పుకాపురభారమొక్కటి

శిరమున సంసార భారమదొక్కటి
పరవళ్ల గంగయు- వరసకొడుకు*

తిరముగ నొంటినంటి రమణి యొక్కతె
పార్వతీ దేవియు పసుపు కొడుకు

ఆమెకు నామెకు నేమందులేగాని
సకలలోకమనెడి సవతి పోరు

ఈతని కాతని కీశ! జెప్పగనేల,
సకలలోకమెరుగు చవితి పోరు

ఆటవెలది(?):

మౌని,స్థాణు, జడుడ, మాటవరసకైన
జోక్య మింత లేదు జోగి నీదు.
“నీరు-తామరాకు” నియతి వర్తింపగా
నేర్పవయ్య నాకు సర్పభూష!

ఎందుకని

ఈ మద్య వ్రాయట్లేదు, ఎందుకని?
పెనోపాజ్.

మీ కంపెనీ లో ఉద్యోగుల్ని తీసేస్తున్నారుట, ఎందుకని?
ధనోపాజ్.

మీకు ఏ విషయమూ ఓ పట్టాన అర్ధం కాదు ఎందుకని?
మనోపాజ్.

కొంతమంది మగాళ్లు ముసలితనం లో కూడా వెకిలివేషాలేస్తారెందుకని?
మెన్,నో పాజ్.