Tag Archives: సంక్రాంతి

విరోధి వత్సర మకర సంక్రాంతి

ఆ.  ఉత్తరాయణమున ఉత్తచేతులనేడు

       మొక్కుచుంటి మున్ను మోతుబరిని.

      పూటగడచు వీలు మాటకైననులేక

      దిగులు ముద్ద మింగి దిరుగు చుంటి  (1)

ఆ. అక్కచెల్లికినయి అమ్ముకొంటిని కొంత

    సొంత సంతు గూర్చి కొంత యమ్మి

    ఉండి గూడ లేక ఒక్కచెక్కనుకల్గి

     మిగిలితినిటులయ్యె మిగుల బండి. (2)

ఆ. కఱవు తప్పె ననియె కాస్త కుదుటపడ

     వరద వచ్చి పంట వమ్ము చేసె

     కుమిలి- వేచి యుంటి – కొడుకుపిలుపుగాదు

     కలుగ ముక్తి, పెద్ద పిలుపు కొఱకు (3)

ఆ. లోకబంధు వీవు రోదసి నందున

    లోకబంధు రైతు లోకులెదుటె

    ఏటి కొక్క రోజు ఎంచుచుందురునిన్ను

    మాకు నెపుడులేదు మన్న నింత  (4)

ఆ. నాదు దిగులు లేదు నాకునిపుడు గాని

     కలదు బాధ కర్షకాళి గూర్చి

    రైతు కేమిగలుగొ రాబోవు దినములా

    చూడ నేమి గలుగొ సూర్య నీకు!   (5)

————————————————————————–

 

బాదరాయణ లంకెలు:
మునుపొకమారు
భైరవభట్ల వారి బ్లాగులో ఇప్పుడు ,మునుపు .