Monthly Archives: మార్చి 2010

దత్తపది – ౨

వాచ్ ( Watch),
రింగ్( Ring),
చైన్ (Chain),
టై ( Tie)
ఈ పదాలను ఉపయోగించి పురుషనిజభూషణ శోభ గురించి వృత్తపద్యం చెప్పండి.
నే నేమంటున్నానో అర్ధం కాకపోతే ఇక్కడ చూడండి.

ప్రకటనలు

నగుమోము – ౨

బుగ్గలెందుకు నవ్వేనంటే పెదవులనంటి ఉన్నాయన్నావు

కళ్లెందుకు నవ్వేనంటే “జ్ఞానేంద్రియాలు” కదా అన్నావు

నత్తుకీ జూకాలకీ కూడా నవ్వటం నేర్పావు

ఈ మట్టిమనిషిని మాత్రం మరిచావు.

పన్ తరంగాలు – ౪

  • ఇపుడవి ఖూనివర్సిటీలు.
  • కోర్ కమిటీ పూర్తి పేరు దగాకోరు కమిటీ.
  • (చాలా మంది) మగవారు పెళ్లికి ముందు నిత్యానందులు, పెళ్లి తరువాత కేవలం రత్యానందులు.

( ఈ పన్నునే త.నా, కర్ణాట లలో వేరే విధం గా చెప్పుకుంటున్నారుట, మీ ఇష్టం మీది)

  • ఇప్పటికీ చాలా మంది ఆడవారికి కొంప కొల్లేరు, బెడ్రూము పులికాట్.
  • గుఱ్ఱపు పందేలు ఆడేవాళ్లు ఎక్కువగా పాడుకునే పాట : ఆరేసుకేబోయి పారేసుకున్నాను హరీ, హరీ.

దత్తపది – ౧

రాబోయే సీతాకళ్యాణానికి, ఎలాగు మీరు పద్యాలు వ్రాస్తారు కాబట్టి, ఈ లోపు

మిల్క్( milk),
బటర్ ( butter),
జాం ( jam),
శాండ్ విచ్( Sandwich)

పదాలతో –
బాలకాండ – శివధనుర్భంగం ముందువరకు, ఏదైనా అంశంపైన – మీకు తోచిన వృత్తం లో
పద్యం కావాలి.

హవ్వ! రవ్వనద్దారు

కాస్త పని ఒత్తిడిలో ఉండటం వల్ల,
ఈ టపాకి నే వ్రాయదల్చుకున్న విషయం 3/4 రోజులలో వ్రాస్తాను. ఈ లోపు మీరు ఏమైన ఊహ చేస్తారేమో కూడా చూస్తాను.

శుభాకాంక్షలు

అందరికీ టీవీ ఛానల్ …
అహ కాదు కాదు …..
వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఎదురుగ నీవై విరోధి ఇంతనె గతమై

సదమదమౌచుంటినినే
వదలనిచీకాకుతోడ వ్యాపారములన్
కదిలెను కాలము వడిగొని
ఎదురుగ నీవై విరోధి ఇంతనె గతమై.

గతజలసేతుభంధనము కాదిది, దెల్పగనీకు జెప్పెదన్
జితజనమానసుండు విధి జిక్కెయె, జేరెను దూరలోకముల్
ఋతువులు కర్షకాలికి ఎప్పటి లాగునె గూర్చెశోకముల్
చెదిరెను ఐకమత్యము రచింపగ గోరియె కొత్తహద్దులన్

ఐకాసలుబుట్టెనటునిటు
ఏకతవిభజనలగోరి, ఎటులను గానీ
మాకయ్యెనిత్యకృత్యము
శ్రీకృష్ణునినామజపము జెప్పగ నిపుడున్.

ముక్కయొ, ముక్కలు జేతువొ,
ఒక్కటి గానుండమనియె ఓర్మినిడెదవో
రెక్కాడకడొక్కాడని
బక్కబతుకులను మటుకిక బాధింపకుమా.

గాలిని బీల్చభీతిలిరి; కైనిడి యూపక మొక్కిరందరున్
కూలెన్ ధైర్యముల్, నరులు గోళిని బొందగ సూదిమందునో
జాలిగ వీధులంబడిరి జల్లదనంబది శాత్రువైబడన్
చాలువిరోధికృత్యములు, చల్లగ జూడుము నెల్లవారలన్

వాకల్సాగును తేనెలేతెనుగునెవ్వారేలవంచించిరో
మాకూనల్ పలుకంగబోవరుబడిన్, మ్లానమ్ము, శిక్షార్హమై,
ఏకైవచ్చియె జేరిమేకగుటనే ఏలాగు మాసీమ “పో
నీకానీ” యనిజూడకేవిడుదురోనీవైన ప్రశ్నింపుమా.

వైద్యులు ఒజ్జలు తమతమ
భాధ్యతలనెరిగియెజూడ బాలల, మహిళల్
విద్యాధికసౌరునందన్
ఉద్యమస్పూర్తిన్ యడుగిడుమోయీ వికృతీ.

ఎచ్చోట పిల్లలే ఎగిరుచు గెంతుచు
బడికిబోవగలరో భయము లేక

ఎచ్చోట మహిళలు ఎదిరించి క్రౌర్యమున్
గెలిచి నడిచెదరో గేలి లేక

ఎచ్చోటనుప్రకృతి నెంచిరక్షింతురో
రాబోవు తరములా రక్ష గోరి

అచ్చోటు నెలకొల్ప ఆంధ్రదేశమునందు
ఆనబూనియెరమ్ము ఆశ నిమ్ము.

పద్యములివె అర్ఘ్యపాద్యములని
స్వాగతింతు నేను సంప్రదాయ
రీతి, సంతసించి లెమ్ము,రమ్మువికృతీ,
ఎదురుకోల ఇద్దె ఎత్తుగీతి.