Monthly Archives: ఆగస్ట్ 2021

భర్త

మళ్ళి మంచిముహుర్తాలు వచ్చాయిట. కుఱ్ఱ పిల్లగాళ్ళు పెళ్ళి చేసుకొనటానికి సిద్ధపదుతున్నారుట. అలాంటి వాళ్ళలో ఏఒక్క పిల్లవాడికన్నా ఉపయోగపడకపోతుందా అని

చినచిన్న పనులైన చేయనీయక పని
మనిషిని నిల్పక మగడు నౌనె?
వంట మాన్పించియే బయట హోటళ్ళలోఁ
దినిపింపక పతి దేవు డగునె?
వారమందొకనాడు స్వాభీష్టమున దాను
వలలు రూపెత్తక వల్లభుండె?
మానిని తోడ ప్రేమవిహారయాత్రలు
విరివిగా చేయక విభుడు నౌనె?
పుట్టింటి ముదిత నోమునుబట్టి పిలువగాఁ
చను శీఘ్రమె యనక పెనిమిటౌనె?
ఏడేడు జన్మలు నిల్లాలుగా వలె
నీయింతి యనక యాత్మేశుడగునె?
మేనకాదులకన్న మేటిసొగసునీది
నమ్ముమిద్దనకున్న నాధుడగునె?
నెలజీతముదెచ్చి నెలత కాళ్ళకుజేర్చి
దండంబు బెట్టక దయితుడగునె?
ప్రతిపుట్టుపండువన్ వ్రతమూని బంగరు
కానుక కొనకున్న కాంతుడగునె?

ఇన్ని చేయుచుండ నేశుభవేళనో
ఆయుధమున కాక.యవయవమున
“తొలగద్రోయ” బడక యలుకనో నెయ్యపు
కినుక వలనొ, భర్త యనగ తగునె?