నేర్పవయ్య నాకు సర్ప భూష! ౫

హొయలగంగానదీ హోరు నిత్యము నీకు
దూరదర్శనమిడు హోరు నాకు

వామభాగమునంటి పార్వతీసతి నీకు
మాటిమాటికిఁ బిల్చు బోటి నాకు

పాదాశ్రితామరపరివారములు నీకు
క్షణము వీడని యధికారి నాకు

మెడలోన బుసలిడు తొడవరయఁగ నీకు
కొండెముల్ వినుటకు దండ నాకు

వేయి కలుగ నైన విఘ్నముల్ చెదరక
మొక్కవోని దీక్ష చక్క వెట్టు
టెటులొ విధిశతంబు నింటిచెంతనిలచి
నేర్పవయ్య నాకు నిశ్చలుండ!

1 responses to “నేర్పవయ్య నాకు సర్ప భూష! ౫

  1. మనకంటే ఇప్పుడు ఇంటివద్దనుంచీ పనిచేయమని చెబుతున్నారు కానీయండి, మహేశ్వరుడికి మొదటినుంచీ విధినిర్వహణ ఇంటివద్దనుంచి యే.
    కాబట్టి ఇంటి నుంచి కచేరి పనులు ఎలాచేయాలో ఆయనే నేర్పించాలి.
    కొండెముల్ వినుటకు దండ నాకు = మెడలో ఎప్పుడూ వ్రేలాడే Bluetooth headset

వ్యాఖ్యానించండి