Monthly Archives: మార్చి 2011

ఘనంగా శ్రీరామలింగేశ్వర శతకావిష్కరణ (డి.వి.డి)

మొన్న శివరాత్రి నాడు జొన్నవిత్తుల వారి శ్రీరామలింగేశ్వర శతకావిష్కరణ మహోత్సవం చూడడాటనికి వెళ్ళాను. మహోత్సవం అన్నది నా మాటే.అలా ఎందుకన్నానంటే – ముందుగా ఘనాపాఠీలు స్వరయుక్తంగా చేసిన రుద్రపారాయణం మొదలిడుకొని అంతా శివమయంగా  భక్తిపూర్వకంగా జరిగిన కార్యక్రమమిది.

ఈ శతకం పుస్తకరూపం లో ఇంతకుముందే వెలువడి, ఈ  మధ్యనే మూడవముద్రణకు నోచుకుంది. ఇప్పుడు ఆ పద్యాలన్నీ శతకకర్త పాడి, వ్యాఖ్యానించిన డి.వి.డి ని ఆవిష్కరించారు.ఈ సభ లో వేల సంఖ్యలోశతకం పుస్తక (మూడవముద్రణ) ప్రతులను భక్తులకు ఉచితంగా ఇచ్చారు.

రుద్రపారాయణ తరువాత ప్రార్ధనా గీతం గా ఈ శతకం లోనివే, రెండు పద్యాలు జొన్నవిత్తుల వారి ఇద్దరుకుమార్తెలు అద్భుతంగా ఆలపించారు. “మా నీ దాగనిదా” అనిమొదలయ్యే శార్దూలం చాలా చక్కగా పాడారు చిన్నారులు. వెంటనే బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు శివరాత్రి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రసంగించి కవి శ్రీ జొ.రా.రాను ఆశీర్వదించారు.

వీరు ప్రసంగం చేస్తుండగా శ్రీ చిరంజీవి గారు సభ కి వచ్చారు. వెంటనే ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందనుకున్న నా ఊహ ను తల్లకిందులు చేస్తూ – పద్య వాద్య కచేరి మొదలు పెట్టారు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు – పద్మశ్రీ ఎల్లా వారి తో కలసి.
ఇది అనితఃపూర్వం. అసామాన్యం. అద్భుతమైన ప్రయోగం.

ఒక సంగీత వాద్యం వెలుపరించే నాదానికి అనుగుణంగా సార్ధక శబ్దాలను ఉపయోగించి పద్యం చెప్పే ప్రక్రియ. ఇది అనుకోకుండా,చివర నిముషంలో   తలపెట్టిన అంశమని నిర్వాహకులు వెల్లడించారు. అందువల్లనూ, కొంతమంది రావలిసిన కళాకారులు చివరి నిముషం లో రాలేకపోవటం వల్లనూ కొన్ని పద్యాలనే గానం చేశారు. శంఖానాదాన్నీ, ఘంటానాదాన్నీ, మృదంగధ్వానాన్నీ – పద్యం లో  ప్రతిభావంతంగా పలికించారు జొన్నవిత్తుల వారు. ఆ విధంగా ఆంధ్రదేశం లో  పద్య వాద్య ప్రక్రియ అనే సాహితీ వామనమూర్తి మూడడుగులు వేసినట్లయింది. ఇది సంగీత సహిత్యాలు సమన్వయం చేసే ప్రక్రియ. ఇప్పటికే పద్యనాటకాలు దేశాన పలుచెరుగల విజయవంతంగా నడచున్నప్పటికీ దానికన్నా భిన్నమైన ప్రక్రియ – వాయిద్యజన్య ధ్వనికి దగ్గరగా ఉన్న  తెలుగు అక్షరాలతో పద్యం ఉండే ప్రక్రియ. రెండూ ఒకదాని వెంట ఒకటి చెవులకుసోకుతుంటే చిత్రమైన ఆనందానుభూతి. మాత్రవిబుధరంజకం. శ్రీయుతులు రామలింగేశ్వరరావు, ఎల్లా వెంకటేశ్వరరావుగార్ల కృషితో మునుముందు మరింత సొబగులు అద్దుకొని ఆంధ్రసాహితీసరస్వతికి మంగళాశాసనాలు పలికే ప్రక్రియ.
తదనంతరం శ్రీ చిరంజీవి గారి  చేతుల మీదగా శ్రీరామలింగేశ్వరశతకం డి.వీ.డీ ఆవిష్కరింపబడినది.
ఎందరో చిత్రరంగ ప్రముఖులు హాజరైనారు, వేదికనలంకించినారు. ఐతే,  ఎవ్వరూ కూడ బేషజాలు చూపకుండా, తమతమ సామజిక స్థాయి గానీ, ఐశ్వర్యాన్ని గాని ఎంచక వేదికపై తమ వర్తన ద్వారా  “సత్యం  శివం సుందరం” అని చాటిన ఘనమైన సభ. “కొన్ని సభలకు మనం గౌరవం తెస్తాం, కొన్ని సభలు మనకు గౌరవం తెస్తాయి” అన్న చిరంజీవి గారి పలుకు ఇక్కడ ఉటంకించటం చదువరుల ఊహకు ఉపయుక్తం అని అనుకుంటాను.

నేర్పవయ్య నాకు సర్పభూష! (3)

కాళిపూనికనొంది గౌరిగా రూపొంద
నీవెకారకుడవు, నీల కంఠ!

అన్నపూర్ణగఁ గొనియాడ నపర్ణాఖ్య
నానంద మగు నీకు ఆది భిక్షు!

పుట్టింటికేగి తాఁ బూదియైన సతికి
ప్రాణముఁ బోసిన ప్రళయ కార!

సకలలోకములకు సతినిరాజ్ఞిగఁజేసి
వల్లకాడేలెడి వామదేవ!

సతిసుఖ మనయమ్ము పతికి ముఖ్యమనియు
సతి విభవము గాంచి సంతసించు
ననియు బోధపరుప నర్ధాంగికి నెటులో
నేర్పవయ్య నాకు సర్పభూష!

మునుపొకమారు