వందన శతముల్

    వాగ్దేవికి వినయముగను
    వాగ్దేవీవల్లభునకు వాని సములకున్
    వాగ్దేవీసమనేత్రుల,
    వాగ్దేవీవరసుతులకు వందన శతముల్!

8 responses to “వందన శతముల్

  1. నాకు ఈ పాదంలో ఎందుకో తేడా అనిపిస్తోంది, ఓ వేళ ఛంధోబద్ధంగా ఉన్నా కూడా…

    “వాగ్దేవీవల్లభునకు వాని సములకున్”

    పద్యం యొక్క ప్రవాహానికి ఓ స్పీడ్ బ్రేకరేసినట్లుంది. ఆ విరామం తర్వాత మళ్ళీ ప్రవాహంలో కెళ్ళినా ఏదో వెలితి. ఏమంటారు పెద్దలు?

  2. త్రిప్రాస తో భలేగా ఉంది పద్యం.
    వాగ్దేవీసమనేత్రుల అనగా ఈ అర్భకుడికి అర్థముఁగాలేదు. భావం మాత్రమే తెలిసింది.

  3. అయ్యా…ఊక కోసమొస్తే ఎక్కడా కనపడదే! రెండు పద్యాలూ బాస్మతీ గింజల్లా మెరుస్తున్నాయి!

  4. శ్రీరాం గారు,
    బహుకాల దర్శనాలు. వ్యాఖ్య చూసి కొత్తగా ఏమైనా అచ్చువత్తేరేమో అని చూస్తే కనపడలేదు.. అదివారం అగచాట్లలో ప్రశ్నకు సమాధానం, రానారే, నాగరాజు గారి సమస్యలకు పూరణలు ..మీరు చాలానే బాకీ..

    వికటకవిగారు,
    మీరు చెప్పింది నిజమండీ. .. వాని సములకున్ వద్ద మళ్ళా వాగ్దేవీ అనో వాగ్దానమో , వాక్పటిమ అనో వస్తే తప్ప .. ఆ ప్రవాహం సాగి పోదు..

    బ్లాగేశ్వరుడుగారు,
    వాగ్దేవి కి , బ్రహ్మ కి , అతని సములైన హరహరులకి,
    వాగ్దేవికి సములైన గౌరీలక్ష్మీ లకు, వాగ్దేవికివర పుత్రులన దగిన పండితులకు వందనములు అని భావము..

  5. ఔనండీ కాస్త వెనకబడ్డాను. ఈ మధ్య కాస్త ఎక్కువగానే పనిలో ఉన్నట్టు నటిస్తున్నాను. అదీ విషయం. బాకీ ముట్టిందనే అనిపిస్తాలెండి.

    మొదటి వాయిదా: ఆ పాట ఫలానా రాగం అని చెప్పలేనండీ. ఖరహరప్రియ లోని స్వరాలూ, ప్రయోగాలూ కొన్ని వినిపించాయి తప్పకుండా కానీ ఆ రాగమే అనేయడం కష్టమని నా అభిప్రాయం. హిందుస్తానీ కాఫీ థాట్ లోని స్వరాలు వాడారని నాకు అనిపిస్తోంది. ఏమైతేనేం మంచి పాట మళ్ళీ ఒకసారి వినేలా చేసారు. నెనర్లు!

  6. “వాగ్దేవీసమనేత్రుల” — కొంచెం వివరించగలరు (వాగ్దేవీసమనేత్రుల సరి కాదేమోననీ వాగ్దేవీసమనేతృల సరైనదనీ నాకనిపిస్తోంది).

  7. రాఘవ గారు,
    ఒకసారి పరిశీలించి చెబుతాను. వందన శతములు.

  8. పింగుబ్యాకు: తాంబూలం « ఊక దంపుడు

వ్యాఖ్యానించండి