నా మిత్రుడి సలహా మీద ఈ విధంగా ఇంగ్లీషు మాట్లాడటం, అది అందరికి అర్ధమైపోవటం లాంటివి జరగుతూ ఉండటం తో, వాడికి ఈ విషయం చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్లేటప్పటికి వాళ్ల అన్నయ్య కొడుకు ఈ ఇంగ్లీషు ముక్కలు బట్టీయం వేస్తున్నాడు:
“But I have promises to keep,
And miles to go before I sleep”
మా రామలింగాన్ని తీసుకొని బయటకు వచ్చి కాఫీ హోటల్లో కూర్చున్నాక నేను అడిగాను :
ఆ బుడ్డోడికి అంత ‘పెద్ద’ పద్యాలు అవసరమంటావా?
రామ: పెద్ద చిన్న ఏముంది అన్నీ నేర్చుకోవాలీ, మన సీసమూ కందమూ లాగే.
నేను: నేనన్నది ఆ పెద్దగాదు, “పెద్దలకి మాత్రమే” పెద్ద.
రామ : అందులో పెద్దలకు మాత్రమే ఏముందిరా
నేను : నువ్వు ఆ పద్యం వినలేదా, దాని అర్ధం పట్టించుకోలేదా?
రామ : ఎంట్రా దానర్ధం, అడిగాడు టీ తాగబోతూ..
నేను : ” కానీ, నా దగ్గర ఉంచుకున్నదానికి చేసిన ప్రమాణాలు ఉన్నాయి , మరియు (అందువల్ల) చాలా మైళ్లదూరం వెళ్ళి నిద్రపోవాలి”నేను ఇది చెప్పిన తరువాత మా రామలింగడు ఏదో చెబుదామనుకున్నాడు కాని, వేడి టీ తో నోరు కాలటం వల్ల మాట్లాడలేకపోయాడు..
5 స్పందనలు so far ↓
చదువరి // డిసెంబరు 1, 2007 వద్ద 6:18 అపరాహ్నం
హ..హ్హ..హ్హ..హ్హా…ఆ..
అయ్యా ఊదం గారూ ఇరగదీసారండి.
ఇప్పుడు మీరు ఈ లింకు కూడా చూడాలి.., మీ స్నేహితుణ్ణి మీరు కొట్టిన దెబ్బ కంటే గట్టి దెబ్బే తగిలిందీ మేష్షారికి: http://jokulashtami.blogspot.com/2007/04/33.html
Giri // డిసెంబరు 1, 2007 వద్ద 8:07 అపరాహ్నం
అదిరింది చమత్కారం
రాకేశ్వర రావు // డిసెంబరు 1, 2007 వద్ద 10:07 అపరాహ్నం
బాగుంది.
ప్రవీణ్ గార్లపాటి // డిసెంబరు 2, 2007 వద్ద 1:04 పూర్వాహ్నం
ఇంతటి ట్విస్టులు చేస్తే ఎలాగండీ పాపం
vookadampudu // డిసెంబరు 3, 2007 వద్ద 11:16 అపరాహ్నం
చదువరి గారూ, Giri గారూ, రాకేశ్వర గారూ, ప్రవీణ్ గారూ,
నెనెరులు
రాజశేఖర్ గారు,
మీ బ్లాగ్ చూశాను, మీ సుడి లాంటిదే నా సుడి కూడా.
వ్యాఖ్యానించండి