నిరీక్షణ

నన్ను నేను చూసుకుందామని
నీ కళ్లలోకి తొంగి చూస్తే
కనిపించింది నేను లేని విశ్వం!

నీ కళ్ళెదుటే నేను
కానీ,
నీ చూపుమేర లో లేను?!

నీ కనురెప్పల వాకిలిలో
కరుణాస్పద దృక్కులకై నిలుచున్నా

రెప్పమూసి హృదిలోన చోటిస్తావో
రెప్పలార్పి పాదాలకు జారనిస్తావో

నిర్ణయం నీది
నిరీక్షణ నాది

5 responses to “నిరీక్షణ

  1. super అండి. నేను తెలుపవలెనని అనుకున్న విషయం అదే. అలాంటి కవిత కొరకే నేను వేచియున్నాను. అద్భుతం. నేను నా బ్లాగులో మీరు అనుమతిస్తే దర్శించుకుంటాను. మీ అనుమతి కై…ఇన్ని రోజులు నాకు కనిపించలేదెమి?

  2. చాలా బాగుందండి,
    పృధ్వీ గారి మరో 2 చిత్రాలను నాబ్లాగులో కవిత్వీకరించాను. దయచేసి చూసి కామెంట్ చెయ్యండి

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  3. చాలా బావుంది కవిత! మొదటి పేరా మూడు వాక్యాలలో మొత్తం చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

  4. పృధ్వీ గారు,radhika గారు, కామేశ్వర రావు గారు, బొల్లోజు బాబా గారు,
    ధన్యోస్మి.

    పృధ్వీ గారు,
    నిరభ్యంతరంగా మీ బ్లాగులో పెట్టుకోండి.

వ్యాఖ్యానించండి