ఈ వారం (డూపు)సిధ్ద — (డూపు)బుద్ధ

బుద్ధా
ఆ సిద్ధా
ఎటో బయల్దేరి నట్టున్నావ్.
అడిగావ్.., అట్టా అడగొద్దని నీకెన్నీ సార్లుజెప్పాను…
సరే అడిగేశాగా, చెప్పు…
ఊళ్లో మళ్ళా చికెన్ గున్యా మొదలైందిట, ప్రభుత్వానికి అర్జీ ఇద్దామని బయలుదేరాను..
చికెన్ గున్యా వస్తే ప్రభుత్వానికి ఏమి సంబంధం చెప్పు? చికెన్ గున్యా కి చికెన్ కి సంబంధం లేనట్టే, చికెన్ గున్యా కి ఆరోగ్య శాఖా మంత్రి కి ఏమి సంబంధం లేదని ఇంతకు ముందు ఆరోగ్య శాఖా మంత్రి చెప్పారా లేదా?
మరి..
ముసుగుకప్పుకు పడుకో అంతే….
అటునుంచి అటు కరంటు ఎక్కువసేపు పోతోందని కంప్లైంట్ ఇవ్వటానికి వెల్దామని..
కోతని చెప్పారు గా ఇంకా కంప్లైంట్ ఎందుకు..
రెండుగంటలని చెప్పి నాలుగు గంటలు తీస్తున్నారు బాబూ..
ఎగస్ట్రా రెండు గంటలు ఎందుకో చెప్పనా…
చెప్పు..
పెళ్లి కానివాళ్లకి సామూహిక వివాహాలు, ఉపనయనం కాని వాళ్లకి సామూహిక ఉపనయనం చేసినట్టు బత్తీబంద్ చేయని వాళ్ల చేత సామూహిక బత్తీబంద్ చేయించటానికి అన్నమాట, అందువల్ల కంప్లైంట్ చేయటానికి లేదు..
ఆ, బత్తీబంద్ అంటే గురొచ్చింది,అటునుంచి అటు బత్తీ బందు గురించి వై.యస్, బాబులకి ఇంకోసారి గుర్తు చేసొద్దామను కుంటున్నాను..
వాళ్లిద్దరు ఢిల్లీ వెళ్ళారు లే, ఒకరు నిలబెట్టటానికి, ఒకరు పడగొట్టటానికి.. ఇప్పుడు నువ్వు వాళ్ల ఆఫీసులకు వెళ్ళీ చేశేదేమిలేదు..
ఆ, క్రితం సారి అవిశ్వాస పరీక్షప్పుడు మా తమ్ముడూ రెండు రోజుల్లో ఇస్తానని తీసుకున్నా రెండు వేలు ఇప్పటికీ ఇంకా ఇవ్వలేదు, అటునుంచి అటు కోర్టు లో కేసు వేయటానికి వెల్దామనుకుంటున్నాను..
ఇంత చిన్న దానికి కోర్టు లో కేసూ, డబ్బులూ, టైము వేష్ట్ చేసుకోవటమెందుకు, ప్ర.మం.కా ఉంది గా?
అంతేనా?..
అవును ఇక కూసో మాట్టాడుకుందాం..

సరే ఐతే మనిద్దరం ఇక్కడ కదా ఉండాల్సింది,ఇక్కడకి ఎట్టా వచ్చామో చెప్పు..
బాబూ నువ్వు నిజం గా సిద్ధ- బుద్ధ లాగ ఫీల్ అవ్వకు…
సిద్ధ-బుద్ధ అక్కడే ఉన్నారు, సిద్ధ గ్రీన్కార్డ్ వాళ్లకి బియ్యం సబ్సిడి ఇవ్వాలన్న ఉద్యమం లో విహారికి సహాయం చేస్తున్నాడు.. బుద్ధ వాళ్ల బుడ్డాడు, బియ్యానికి కరువచ్చేస్తోందని ముందుచూపుతో చేపలు పట్టటం నేర్చుకుంటుంటే చేపలు లెక్కపెడుతున్నాడు..
అసలు సినీతారలు లేని రాజకీయ పార్టీలు డూపుల్ని బెట్టుకున్నట్టు ఈ ఊకదంపుడు మనల్ని యెత్తుకొచ్చాడు…

ఒరేయ్ లైవ్‍షో లో నిజాలు చెబుతావా.. ఉండు నీపనిజెప్తా…

4 responses to “ఈ వారం (డూపు)సిధ్ద — (డూపు)బుద్ధ

  1. భలే భలే, విహారి గగ్గోలు పెట్టెయ్యగలడు జాగ్రత్త. అయినా పేటెంటూ గీటెంటూ లేవుగా, మీరు డూపన్నారు, నేను పరకాయ ప్రవేశం అంటూ ఇంకో సిద్ధ, బుద్ధ తయారు చేసుకొస్తా.

  2. Trade Mark violations.

    We will come with our lawyer . hammaa!

  3. హైజాకింగులు, కార్జాకింగులు విన్నాను కానీ ఇలా పబ్లిగ్గా బ్లాగ్జాకింగులా? తప్పదు. బ్లాగులకు కొన్ని చట్ట బద్దమైన నియమ నిబందనలు పెట్టాల్సిందే. మీ ఈ మెయిలిస్తే ఓ సారి బ్లాయర్ నోటీసు పంపిస్తా. (ఎవరికీ చెప్పకండి, అందులో ఇతర బ్లాగుల్ని వాళ్ళకు తెలియకుండా ఎలా హైజాక్ చెయ్యాలో చిట్కాలు పంపిస్తా)

    — నోటీసుల విహారి

  4. పింగుబ్యాకు: నా లుంగీ కాకపోతే « ఊక దంపుడు

వ్యాఖ్యానించండి