నేర్పవయ్య నాకు సర్పభూష! – ౨

        నిముషమ్ము జటలోన నిలుపంగ గంగనే
                       చినయింటి ఘనశంకఁ జిన్నబుచ్చె
        చెరకుమోపులవాన్కి చిరుసాయమిడినంత
                             పుట్టగా చెమరింత పూలగొట్టె
        తగదన్న వినకనే తనతండ్రి గృహమేగి
                         యజ్ఞశాలకునద్దె యమునినగవు
        అనసూయ ఘనతనే వినినంత నీసొంది
                          ఆద్యంత రహితుకే యమ్మనిచ్చె 

        కోరి జేరిన సతి గుణదోషము లనక
        వలయు ధర్మమెల్ల దెలియ జెప్పి
        గారవించి మెలగ, కలికాలమందునా
        నేర్పవయ్య నాకు సర్పభూష!

————————————————————————–

బాదరాయణ లంకెలు:
మునుపొకమారు
భైరవభట్ల వారి బ్లాగులో.
చంద్రిమ
చంద్రబింబాననా

6 responses to “నేర్పవయ్య నాకు సర్పభూష! – ౨

  1. మహా శివరాత్రి శుభాకాంక్షలు !

  2. చివరి నాలుగు లైన్లు మాత్రం ఈ సమాజానికి అత్యంతవసరం.

  3. “ఆద్యంత రహితుకే అమ్మనిచ్చె”. చాలా బాగున్నది.

    మహా శివరాత్రి శుభాకాంక్షలు !!

    సనత్ కుమార్

  4. నాకు అనసూయ లైను అర్ధం కాలేదు

  5. parimalam గారు, సనత్ కుమార్ గారు,
    ధన్యవాదములు.
    రవి చంద్ర గారు,
    నాకు పెళ్లై ఇన్నేళ్లైనా రాని పరిణతి .. మీకు ఇప్పుడే వచ్చేసిందే 🙂
    శీఘ్రమేవ…
    కొత్తపాళీ గారు,
    అనసూయ దగ్గరకి త్రిమూర్తులను ముగ్గురమ్మలూ పంపితే ఆవిడ ఊయలతొట్టిలో వేసి తల్లిలా ఆడించినదిగదా.. ఆ విషయం చెప్పాలనుకున్నా…
    అనసూయ వ్రతమునే వినినంత .. అని కాకుండా అనసూయ పతిభక్తి వినినంత అంటే ఇంకా హాయిగా ఉండేదేమో

  6. నాకు పెళ్ళైతే కదా తెలిసేది ఈ పరిణతి ఎంతకాలం నిలుస్తుందో.. 🙂

వ్యాఖ్యానించండి